Starbucks CEO
-
స్టార్‌బక్స్ సీఈవో లక్ష్మణ్ నరసింహన్ జీతం ఎంతంటే?
సాక్షి,ముంబై: గ్లోబల్ కాఫీ చైన్ స్టార్‌బక్స్ కొత్త సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. దీనిపై ఆనంద్ మహీంద్రా లాంటి పలువురు వ్యాపార దిగ్గజాలు భారతీయ బిజినెస్ లీడర్స్ సురక్షితమైన, ప్రతిభావంతమైన వారుగా పాపులర్ అతున్నారని వ్యాఖ్యానించారు. ఇది చదవండి : Laxman Narasimhan:స్టార్‌బక్స్ సీఈవో ఇన్స్పైరింగ్ జర్నీ..ఫిదా అవ్వాల్సిందే! 2023 ఏప్రిల్ నుంచి సీఈవోగా పూర్తి బాధ్యతలను స్వీకరించనున్న లక్ష్మణ్ నరసింహన్ వార్షిక మూల వేతనంగా 1.3 మిలియన్ డాలర్లు (దాదాపు రూ. 10 కోట్లు) తీసుకుంటారని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో స్టార్‌బక్స్ పేర్కొంది. అలాగే సుమారు 12 కోట్ల రూపాయల బోనస్‌తో పాటు 9.25 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 73 కోట్లు) విలువైన ఈక్విటీ గ్రాంట్‌ను కూడా అందుకుంటారు. 2023 ఆర్థిక సంవత్సరం నుండి, 13.6 మిలియన్ డాలర్లకు (రూ. 107 కోట్లకు పైగా) సమానమైన వార్షిక ఈక్విటీ అవార్డును పొందనున్నారు. కాఫీతో మనం కనెక్ట్ అయ్యే విధానాన్ని మార్చివేసిన సాటిలేని మేటి కంపెనీ ఎదిగిన స్టార్‌బక్స్‌లో చేరడం సంతోసంగా ఉందని నరసింహన్ ప్రకటించారు. నిబద్ధతతో సేవలందిస్తూ ప్రపంచవ్యాప్తంగా మెచ్చుకునే బ్రాండ్ స్టార్‌బక్స్ అని పేర్కొన్నారు. అలాగే ప్రస్తుతం ఎదుర్కొంటున్న, మారుతున్న, డిమాండ్స్ తీర్చడానికి మరింత బలమైన భవిష్యత్తు పెట్టుబడులు పెడుతున్న కీలక సమయంలో దిగ్గజ కంపెనీ స్టార్‌బక్స్‌లో చేరడం గౌరవంగా భావిస్తానన్నారు. -
స్టార్‌బక్స్ కొత్త సీఈవో నరసింహన్ ఇన్స్పైరింగ్ జర్నీ.. ఫిదా అవ్వాల్సిందే!
ప్రపంచ కాఫీ తయారీ దిగ్గజం స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఎంపికైన లక్ష్మణ్ నరసింహన్ చాలా చిన్నస్థాయి నుంచి ఎదిగిన వ్యక్తి. అమ్మే స్ఫూర్తి. రాక్-కర్ణాటక మ్యూజిక్ వరకూ అన్నీ తెలుసు. చాలా చురుకైన ప్రతిభావంతుడు. ఎపుడూ సరదాగా, జోక్లేస్తూ ఉండటం అలవాటు. చదవడం, ముఖ్యంగా బిజినెస్ బుక్స్ చదవడం అంటే చాలా ఇష్టం. చిన్నపుడు ఫుట్‌బాల్ గేమ్‌లో గోల్ కీపర్‌గా ఉండటమే కాదు, ఎదిగిన తరువాత వ్యావార రంగంలో ఉన్నత పదవులకు వన్నె తెచ్చిన రాక్‌స్టార్. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అనే జీవిత సత్యాన్ని ఎరిగిన వారు నరసింహన్. స్టార్‌బక్స్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా లక్ష్మణ్ నరసింహన్ ఎంపికతో గ్లోబల్ బ్రాండ్ బిజినెస్ లీడర్స్‌గా సత్తా చాటుతున్న భారతీయ సంతతికి చెందిన సీఈవో జాబితా పెరుగుతోంది. స్టార్‌బక్స్ సీఈవోగా లక్ష్మణ్ నరసింహన్ అక్టోబర్ 1, 2022న కంపెనీ బాధ్యతలు స్వీకరిస్తారు. స్టార్‌బక్స్ సీఈవోగా, గ్లోబల్‌లీడర్‌గా ఎదిగిన లక్ష్మణ్ నరసింహన్ 30 సంవత్సరాల అనుభవం, వివిధ హోదాల్లో పనిచేసిన ట్రాక్ రికార్డ్ ఆయన్ని మరింత ఉన్నత స్థానంలో నిలబెట్టింది. ఈ క్రమంలో లక్ష్మణ్ విద్య కరియర్, అలవాట్లు, హాబీలపై ఒక లుక్కేద్దాం. లక్ష్మణ్ నరసింహన్ ఏప్రిల్ 15, 1967న పూణేలో జన్మించారు. కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ పూణే, సావిత్రిబాయి ఫూలే పూణే విశ్వవిద్యాలయం నుండి మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీని పొందారు. తరువాత యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని ది లాడర్ ఇన్స్టిట్యూట్, ఇంటర్నేషనల్ స్టడీస్‌లో ఎంఏ, ది వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం ద్వారా ఫైనాన్స్‌లో ఎంబీఏ పట్టా పొందారు. మెకిన్సేలో ఉద్యోగిగా కరియర్‌ను ప్రారంభించారు. 2012 వరకు 19 సంవత్సరాలు అక్కడ పనిచేశారు. కంపెనీలో తన పని చేస్తున్న సమయంలో, న్యూఢిల్లీ కార్యాలయానికి డైరెక్టర్, లొకేషన్ మేనేజర్‌గా పదోన్నతి పొందారు. 2012లో నరసింహన్ పెప్సికో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా మరో మెట్టుఎక్కారు. కంపెనీ దీర్ఘకాలిక వ్యూహం, డిజిటల్ సామర్థ్యాలకు నాయకత్వం వహించి, కంపెనీని లాభాల బాటపట్టించారు. అనంతరం లాటిన్ అమెరికా, యూరప్, సబ్-సహారా ఆఫ్రికా కార్యకలాపాలకు సీఈవోగా కూడా పనిచేశారు. నరసింహన్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూషన్కు ట్రస్టీ కూడా, కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ సభ్యుడు, యూఏ ప్రైమ్ మినిస్టర్స్ బిల్డ్ బ్యాక్ బెటర్ కౌన్సిల్ సభ్యుడిగానూ, వెరిజోన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌లో సభ్యుడుగాను పనిచేశారు. సెప్టెంబరు 2019లో సీఈవోగా రెకిట్‌లో చేరారు. లైసోల్, డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్లఅమ్మకాల్లో రికార్డు సృష్టించారు. కంపెనీ కీలక ఎగ్జిక్యూటివ్‌గా ప్రధాన వ్యూహాత్మక పరివర్తన, స్థిరమైన వృద్ధికితో కంపెనీని లాభాల బాటపట్టించారు. అమ్మే స్ఫూర్తి, రోజుకు పూటే భోజనం ఇటీవలి కాలంలో ఆన్లైన్ గ్లోబల్ మీటింగ్ 'ఫైర్‌సైడ్ చాట్'లో తన జీవిత విశేషాలను పంచుకున్నారు లక్ష్మణ్ నరసింహన్. పూణేలో ఒక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేసిన తల్లి తనకు ఎంతగానో స్ఫూర్తినిచ్చిందని చెప్పారు. అలాగే వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో చదువు, వీసా ఇతర ఖర్చుల కోసం ఇంట్లోని వస్తువులను అమ్మి మరీ డబ్బు కూడగట్టుకోవాల్సి వచ్చిందని తెలిపారు. అంతేకాదు జర్మనీలో సమ్మర్ స్కూల్లో విద్య నభ్యసించేటపుడు చేతిలో డబ్బుల్లేక రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేసేవాడట. అందుకే ఏకంగా 10 కిలోల బరువు తగ్గానని, ఇదే తాను జీవితంలో మరింత పట్టుదలగా ఎదడగానికి దోహదం చేసిందంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంటారు నరసింహన్. అంతేకాదు లాటిన్ అమెరికాలో ఒక కంపెనీ నడుపుతున్నప్పుడు తాను వారాంతంలో స్పానిష్ నేర్చుకున్నారట. నిరంతరం మనం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని తన ఉద్యోగులకు సలహా ఇచ్చేవారట. ముఖ్యంగా "మనం ఎక్కడి నుండి వచ్చామో అసలు మర్చిపోవద్దు" అని కూడా సూచించారట. స్నేహితుల సంబరం నరసింహన్ క్లాస్మేట్ పారిశ్రామికవేత్త నితిన్ జోషి ప్రకారం తన స్నేహితులందర్నీ ఇప్పటికీ చాలా ప్రేయగా ఆప్యాయంగా పలకరించే బెస్ట్ ఫ్రెండ్. అన్నట్టు వీరికి కూడా పూర్వ విద్యార్థులతో ఒక వాట్సాప్ గ్రూపు కూడా ఉందట. ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా 1982 లయోలా హై స్కూల్ గ్రూపులో తన ఫోటోలు, ఎపుడూ అప్డేట్లను పోస్ట్ చేస్తూ ఉంటారట. అయితే ఎప్పుడూ గ్రూప్‌లో యాక్టివ్‌గా ఉండే ఆయన సడన్‌గా ఈ మధ్య బిజీ అయిపోయారట. కట్ చేస్తే స్టార్బక్స్గా సీఈవోగా ఎంపికైన వార్త తెలిసందంటూ జోషి చాలా సంతోషం వ్యక్తం చేశారు. కష్టాలను అధిగమించి, ప్రపంచం నలు మూలలా కష్టపడి పనిచేసి ఈ రోజు గ్లోబల్‌లీడర్‌గా ఎదిగాడని ఆయన ప్రశసించారు. తండ్రి మార్గదర్శకత్వంలో లక్ష్మణ్ ఫుట్‌బాల్ ఆడేవారనీ, ముఖ్యంగా స్కూలు స్థాయిలో జట్టు గోల్ కీపర్‌గా ఉండేవారని విన్సెంట్స్ బాయ్స్ అసోసియేషన్, వ్యాపారవేత్త ముర్తుజా పూనావాలా చెప్పారు. నరసింహన్ తమ అకాడమీకే గౌరవాన్ని, గుర్తింపును తెచ్చారని.. ఇందుకు తాము గర్వపడుతున్నామని CoEP యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ సీఈఓ ముకుల్ సుతాన్ తెలిపారు. నరసింహన్ బజాజ్ ఆటో ఎండీ రాజీవ్ బజాజ్ సహచరుడని కూడా ఆయన గుర్తుచేశారు. -
స్టార్‌బక్స్ సీఈవోగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్
న్యూఢిల్లీ: ప్రపంచ అతిపెద్ద కాఫీ చైన్ స్టార్‌బక్స్ సీఈఓగా భారత సంతతికి చెందిన లక్ష్మణ్ నరసింహన్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని స్టార్‌బక్స్ కార్ప్ గురువారం ప్రకటించింది. గ్లోబల్‌గా మరో ప్రముఖ కంపెనీకి సీఈవోగా ప్రవాస భారతీయుడు లక్ష్మణ్ నరసింహన్ ఎంపిక కావడం విశేషం. ప్రస్తుతం స్టార్‌బక్స్ సీఈఓగా ఉన్న హోవర్డ్ షుల్ట్జ్ స్థానంలో లక్ష్మణ్ నరసింహన్‌నుఎంపిక చేసింది. అయితే రానున్న అక్టోబర్‌లో కంపెనీ చేరనున్న నరసింహన్ ఏప్రిల్1న 2023లో పూర్తి బాధ్యతలను స్వీకరిస్తారని కంపెనీ ప్రకటించింది. ఇటీవల కాలంలో సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సంస్థ ‘‘రీఇన్వెన్షన్" ప్లాన్ గురించి కొన్ని నెలలు తీవ్ర కసరత్తు చేయనున్నారు. ముఖ్యంగా బారిస్టాలకు మెరుగైన వేతనాలు, ఉద్యోగుల సంక్షేమం, కస్టమర్ అనుభవాన్ని మెరుగు పర్చడం, స్టోర్లను తీర్చిదిద్దడంలాంటివి ఉన్నాయి. మేనేజ్మెంట్ టీమ్‌తో చర్చలు, బరిస్టాగా సమగ్ర పరిశీలన ఉద్యోగులను కలవడంతోపాటు, తయారీప్లాంట్లు, కాఫీ ఫామ్‌లను సందర్శిస్తారని స్టార్‌బక్స్ తెలిపింది. అప్పటి వరకూ తాత్కాలిక సీఈఓగా ఉండాలని హోవర్డ్‌ను కోరినట్టు తెలిపింది. ఇప్పటిదాకా డ్యూరెక్స్ కండోమ్‌లు, ఎన్‌ఫామిల్ బేబీ ఫార్ములా, మ్యూసినెక్స్ కోల్డ్ సిరప్‌లను తయారు చేసే రెకిట్ సంస్థకు నరసింహన్ సీఈవోగా ఉన్నారు. అయితే ఈ పదవినుంచి వైదొలగుతున్నట్టు స్టార్‌బక్స్ ప్రకటనకు ముందు రోజు ప్రకటించారు. దీంతో FTSE-లిస్టెడ్ రెకిట్ షేర్లు 4శాతం పడిపోయాయి. నరసింహన్ సెప్టెంబరు 2019లో రెకిట్‌లో చేరిన నరసింహన్ కోవిడ్‌కాలంలో కూడా కంపెనీని విజయపథంలో నడిపి మార్కెట్ వర్గాల ప్రశంసలందుకున్నారు. 1999లో రెకిట్‌ను ఏర్పాటు చేసినప్పటి నుండి దానిలో అధికారం చేపట్టిన తొలి ప్రవాస భారతీయుడు కూడా. అలాగే గతంలో పెప్సికోలో గ్లోబల్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్‌గా పనిచేసిన నరసొంహన్ అమ్మకాలు క్షీణించిన సందర్బంలో కంపెనీని పునరుద్ధరించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే కాఫీ దిగ్గజం నరసింహన్‌ను తమ కీలక అధికారిగా నియమించుకుంది. ముఖ్యంగా ఈ దశాబ్దం చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 20 వేలకు పైగా స్టార్‌బక్స్ ఔట్లెట్స్ తెరవాలన్న టార్గెట్‌ను చేరుకునేందుకు సరియైన వ్యక్తిగా నరసింహన్‌ను ఎంపిక చేసింది. -
ఓ సీఈవో వేడుకోలు: ఆఫీస్‌కు రండయ్యా!
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పలు దేశాలకు చెందిన దిగ్గజ కంపెనీలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. కానీ కొన్ని కంపెనీలు మాత్రం ఇంటి వద్ద నుంచి పనిచేయడాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఆఫీస్‌కు రావాలంటూ సీఈవోలు సైతం ఉద్యోగులకు అల్టిమేట్టం జారీ చేస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా స్టార్ బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ వ్యవహరిస్తున్నారు. బాబ్బాబు మీకు దణ్ణం పెడతా. వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు..ఆఫీస్‌కు రావాలని ఉద్యోగుల్ని ప్రాధేయపడుతున్నారు. ప్రస్తుతం ఈ అంశం బిజినెస్ వరల్డ్‌లో ఆసక్తికరంగా మారింది. వాషింగ్స్టన్లో జరిగిన న్యూయ్యార్క్ టైమ్స్ డీల్ బుక్ పాలసీ ఫోరమ్ కార్యక్రమంలో స్టార్ బక్స్ సీఈవో హోవార్డ్ షుల్జ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఉద్యోగుల్లారా..వర్క్ ఫ్రమ్ హోమ్ వద్దు. ఆఫీస్‌కు వచ్చేయండి. వాట్ ఎవర్ యూ వాంట్. కావాలంటే చెప్పండి మోకాళ్లపై నిల్చుంటా, లేదంటే పుషప్స్ చేస్తా. కానీ మీరు మాత్రం తప్పకుండా ఆఫీస్‌కు రావాల్సిందే'నని అన్నారు. నేను ఫెయిల్ అయ్యాను ఉద్యోగులు మాత్రం ఆఫీస్‌కు వచ్చేందుకు సుముఖంగా లేరు. నేను చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి.వారు(ఉద్యోగులు) వారానికి రెండు లేదా మూడు రోజులు మాత్రమే ఆఫీస్‌కు రావాలని అనుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉద్యోగులు పనితీరు స్టార్ బక్స్ సంస్థ ఉద్యోగుల జాబ్స్ రోల్స్‌ను బట్టి కొంత మందిని హైబ్రిడ్ వర్క్‌లో పనిచేయిస్తుంది. ప్రత్యేకమైన లొకేషన్లకు చెందిన ఉద్యోగులు మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్, ఆఫీస్ వర్క్, హైబ్రిడ్ వర్క్ పని చేస్తున్నారు. అయితే టెస్లాతో పాటు ఇతర సంస్థల తరహాలో స్టార్ బక్స్ సైతం ఉద్యోగులు ఆఫీస్‌కు రావాలంటూ పిలుపునిస్తుంది. ఉద్యోగులకు వార్నింగ్ టెస్లా సీఈవో ఎలన్ మస్క్ రిటర్న్ టూ ఆఫీస్ పాలసీకి జై కొడుతున్నారు. ఇంటి వద్ద నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు ఆఫీస్‌కు రావాల్సిందేనని స్పష్టం చేశారు. కాదు కూడదు అంటే జీతాల్లో కోత విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయంలో ఏ మాత్రం మొహమాటం ఉండదని ఖరాకండీగా చెప్పిన విషయం తెలిసిందే. కానీ విచిత్రంగా స్టార్ బక్స్ సీఈవో ఉద్యోగుల్ని ఆఫీస్‌కు ఈతరహా పిలుపు నివ్వడం సోషల్ మీడియాలో చర్చాంశనీయమైంది. -
ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!
10వేల మంది శరణార్థులను నియమించుకుంటాం స్టార్‌బక్స్ సీఈవో ప్రకటన ముస్లిం మెజారిటీ దేశాల నుంచి శరణార్థుల రాకను నిషేధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జారీచేసిన ఉత్తర్వులను ఆ దేశ కార్పొరేట్ దిగ్గజాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ నిర్ణయం నేపథ్యంలో రానున్న ఐదేళ్లలో 75 దేశాల్లో 10వేలమంది శరణార్థులను తమ ఉద్యోగులుగా నియమించుకోవాలనుకుంటున్నామని స్టార్‌బక్స్ కంపెనీ సీఈవో హోవర్డ్ షుల్ట్జ్ ప్రకటించారు. అమెరికాకు రాకుండా శరణార్థులపై ట్రంప్ నాలుగు నెలల తాత్కాలిక నిషేధాన్ని విధించిన సంగతి తెలిసిందే. అలాగే సిరియాతోసహా ఏడు ముస్లిం మెజారిటీ దేశాల నుంచి పర్యాటకుల రాకను ఆయన పూర్తిగా నిషేధించారు. ఉగ్రవాద దాడుల నుంచి అమెరికాను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయంపై ఇంటా, బయటా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ట్రంప్ నిర్ణయం వల్ల ప్రభావం పడే కార్మికులకు అండగా ఉండేందుకు పూర్తిగా కృషి చేస్తామని షుల్ట్జ్ ఆదివారం తన కంపెనీ ఉద్యోగులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. వివిధ దేశాల్లో అమెరికా ఆర్మీ అభ్యర్థన మేరకు భద్రతా దళాలకు దుబాసీలుగా, సహాయక సిబ్బందిగా సేవలు అందించిన వ్యక్తులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యమిస్తానని ఆయన తెలిపారు. ఒబామా హెల్త్ కేర్ ప్రజాబీమా పథకాన్ని ట్రంప్ ఎత్తివేసిన నేపథ్యంలో కంపెనీ ఉద్యోగులకు తామే ఆరోగ్యబీమా అందిస్తామని షూల్ట్జ్ స్పష్టం చేశారు. షూల్ట్జ్ గతంలోనూ పలు అంశాలపై గట్టిగా గళమెత్తి పతాక శీర్షికలకు ఎక్కారు. దుకాణాలకు తుపాకులు తీసుకొని రావొద్దని, జాతుల మధ్య సంఘర్షణ గురించి చర్చించాలని ఆయన గతంలో పేర్కొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా? ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి! వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా 'ట్రంప్‌తో భయమొద్దు.. మేమున్నాం'