State BJP
-
ఇక పరిశీలన పర్వం
సాక్షి, హైదరాబాద్: పార్టీ టికెట్ల కోసం దాఖలైన దరఖాస్తుల పరిశీలనకు రాష్ట్ర బీజేపీ సిద్ధమౌతోంది. ఆశావహులు అధిక సంఖ్యలో ఉండటంతో ఇప్పుడు వాటి పరిశీలన కీలకంగా మారింది. ఈ నెల 4 నుంచి 10వ తేదీల మధ్య అప్లికేషన్లు స్వీకరించగా మొత్తం 6,003 దరఖాస్తులు అందాయి. నియోజకవర్గాల వారీగా వివిధ స్థాయిల్లో వీటిని పరిశీలించి, వడపోతకు సిద్ధం చేసేందుకు కొంత సమయం పడుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం దరఖాస్తులను జిల్లాలు, నియోజకవర్గాల వారీ గా కట్టలు కట్టి, ఓ జాబితా రూపొందించేందుకు పార్టీ కార్యాలయంలో కసరత్తు సాగుతోంది. ఈ ప్రక్రియ ముగిశాక దరఖాస్తుల పరిశీలనకు పార్టీ రాష్ట్ర నాయకత్వం నలుగురైదుగురు నేతలతో ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఒక్కో నియోజకవర్గానికి ముగ్గురు లేదా నలుగురి పేర్లతో ఓ తాత్కాలిక జాబితాను సిద్ధం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి బీజేపీ పార్లమెంటరీ బోర్డుకు అభ్యర్థుల ఎంపిక నిమిత్తం పంపేందుకు మరికొంత సమయం పట్టొచ్చునని ముఖ్యనేతలు అంచనా వేస్తున్నారు. దరఖాస్తుల పరిశీలన కొనసాగుతుండగానే రాష్ట్ర ఎన్నికల కమిటీని పార్టీ నాయకత్వం నియమించే అవకాశాలున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. నేటి నుంచి జిల్లాల వారీ సమావేశాలు మంగళవారం నుంచి ఉమ్మడి జిల్లాల వారీగా పార్టీ సమావేశాలకు ముఖ్య నేతలు తరలనున్నారు. ఈ భేటీల్లో జిల్లాల్లోని ఆయా నియోజకవర్గాల వారీగా అందిన దరఖాస్తులు, పోటీకి ఆసక్తి చూపుతున్న నాయకులు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అరవింద్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జ్ తరుణ్ ఛుగ్, ఎంపీ సోయం బాపూరావు హాజరవుతారని బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. -
కరువును ఎదుర్కోవడంలో సర్కార్ విఫలం
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప తుమకూరు : రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితులను ఎదుర్కొనడంలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, మాజీ సీఎం యడ్యూరప్ప ఆరోపించారు. కరువును అధ్యయనం చేయడంలో భాగంగా ఆదివారం ఆయన తుమకూరు జిల్లాలో పర్యటించారు. రాష్ట్ర సరి హద్దు ప్రాంతమైన గౌడగెరె గ్రామాన్ని సందర్శించిన బీఎస్‌వై అక్కడి రైతులను, గ్రామస్తులను కలిసి వారి సమస్యలను అడిగి తెలసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ ప్రజలకు తాగేందుకు నీళ్లు లేని పరిస్థితులు నెలకొన్నాయని, గ్రాసం లేక పశువులు బక్కచిక్కిపోతున్నాయన్నారు. అయినప్పటికీ సీఎం సిద్దరామయ్య కరువు సమస్యను పట్టించుకోకుండ కేవలం కేంద్రాన్ని తిట్టడంలోనే కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. కరువు నివారణ చర్యలకు కేంద్రం రాష్ట్రానికి రూ. 2575 కోట్లు కేటాయించిందన్నారు. అయితే ఆ నిధులు ప్రజలకు చేరవేయడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కార్యక్రమంలో మాజీ మంత్రి సొగడు శివణ్ణ, ఎమ్మెల్యే సురేష్‌గౌడ పాల్గొన్నారు. -
నేడు బీజేపీ రాష్ట్ర కోర్‌కమిటీ సమావేశం
సాక్షి ప్రతినిధి, కాకినాడ : బీజేపీ రాష్ర్ట కోర్ కమిటీ సమావేశం ఆదివారం రాజమహేంద్రవరంలో జరగనుంది. దీనికి పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ సిద్ధార్థనాథ్ సింగ్, ఎంపీలు గోకరాజు గంగరాజు, కంభంపాటి హరి బాబు, రాష్ట్ర మంత్రులు పైడికొండల మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, కంతేటి సత్యనారాయణరాజు, ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, విష్ణుకుమార్‌రాజు, కేంద్ర మాజీ మంత్రులు పురంధేశ్వరి, కావూరి సాంబశివరావు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తదితరులు హాజరుకానున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనను ఖరారుపై ఈ సమావేశంలో చర్చ ఉంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుత పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పదవీకాలం త్వరలో పూర్తికానున్నందున.. ఆయన వారసుడి ఎంపికపై చర్చించవచ్చని తెలుస్తోంది. తన కుమార్తె దీపా వెంకట్ కుటుంబంలో జరిగే ఓ శుభకార్యానికి కేంద్ర మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఈ నెల 17న రాజమహేంద్రవరం రానున్నారని సమాచారం. ఈలోగా ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకురావడంపై కోర్‌కమిటీలో చర్చించనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాపులకు అన్ని పార్టీలూ ప్రాధాన్యం ఇస్తున్నందున.. బీజేపీ కూడా అదేబాటలో పయనించాలనే వాదన కొద్దికాలంగా వినిపిస్తోంది. దీంతో ఎమ్మెల్సీ సోము వీర్రాజుకే రాష్ర్ట అధ్యక్ష పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఇప్పటికే చంద్రబాబు వ్యతిరేకిగా ముద్రపడినా, ఇటీవల టీడీపీ అక్రమాలపై ఆయన నోరు మెదపడంలేదు. టీడీపీ నుంచి వ్యతిరేకతా రాకుండా ఉండేందుకే ఆయన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారన్న వాదన ఉంది. ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపుగర్జన సభకు వీర్రాజు హాజరు కాకపోవడం, సభకు హాజరైన మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై ప్రభుత్వం కేసు నమోదు చేసినా స్పందించకపోవడం, చివరకు ముద్రగడ నిరాహార దీక్షకు సంఘీభావం ప్రకటించక పోవడంతో పార్టీలోని కాపు సామాజికవర్గం ఆయనపై గుర్రుగా ఉంది. దీంతో పార్టీలోని రెండు ప్రధాన సామాజికవర్గాల నుంచి వ్యతిరేకత వస్తుందనే సాకుతో కంభంపాటినే మరోసారి కొనసాగించవచ్చని చెబుతున్నారు. -
సీఎంతో ఖడ్సేకు విభేదాలు..?
సాక్షి, ముంబై: రాష్ట్ర బీజేపీలో అప్పుడే లుకలుకలు మొదలయ్యాయనే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఇటీవల ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 42 మంది ఉన్నతస్థాయి అధికారులను బదిలీ చేసిన సంగతి తెలిసిందే . ఈ సమయంలో విభేదాలు మరింత ముదిరినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ తీరుపై పార్టీ సీనియర్ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే గుస్సాగా ఉన్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అధికారుల బదిలీల నేపథ్యంలో రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శిగా మనుకుమార్ శ్రీవాస్తవ్ మంగళవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ బదిలీ ప్రక్రియను వ్యతిరేకిస్తూ సీఎంకు రెవెన్యూ శాఖ మంత్రి ఏక్నాథ్ ఖడ్సే లేఖను రాసినట్లు వార్తలు గుప్పుమన్నాయి. దాంతో తాను బదిలీలకు సంబంధించి సీఎంకు ఎటువంటి లేఖ రాయలేదని ఖడ్సే వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కాగా, ఖడ్సే ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదని, ఆయన మా పార్టీ సీనియర్ నాయకుడని దీంతో తాము కీలక నిర్ణయాలు తీసుకునేముందు ఆయనతో కూడా చర్చలు జరిపామని సీఎం స్పష్టంచేశారు. ఇదిలా ఉండగా, మరోవైపు మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర సహకార మంత్రి రావ్‌సాహెబ్ దానవే పేరును ప్రకటించడంపై కూడా ఖడ్సే అసంతృప్తి వ్యక్తంచేసినట్లు సమాచారం. -
రాష్ట్ర బిజెపిలో "పవర్ సెంటర్" ప్రాబ్లమ్స్