The state forest minister
-
పర్యావరణ పరిరక్షణకు కృషి
మంచిర్యాల టౌన్ : ప్రజా సంక్షేమంతో పాటు పర్యావరణ పరిరక్షణకు టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం మంచిర్యాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మూడేళ్ల ప్రణాళికలో భాగంగా రూ.230 కోట్లతో మొక్కల పెంపకం చేపట్టనున్నట్లు తెలిపారు. ఇంటింటా మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు మహిళల్లో చైతన్యం రావాలన్నారు. రాష్ట్రంలో ఆర్అండ్బీ ద్వారా నిర్మించనున్న 506 కిలో మీటర్ల బీటీ రోడ్లకు రూ.1230 కోట్లు, పంచాయతీరాజ్ ద్వారా నిర్మించనున్న 1790 కిలో మీటర్ల బీటీ రోడ్లకు రూ.257 కోట్లు విడుదల చేసినట్లు చెప్పారు. అర్హులందరికీ ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందేలా చూస్తామన్నారు. ఇంటింటా కుళాయి ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి సాగు విస్తీర్ణాన్ని పెంచుతామన్నారు. ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య, మున్సిపల్ చైర్ పర్సన్ వసుంధర, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు రాజయ్య, శంకర్ పాల్గొన్నారు. దురుద్దేశంతోనే ఆరోపణలు.. బెల్లంపల్లి : దురుద్దేశంతోనే ప్రభుత్వంపై ప్రతిపక్షాలు అసత్య ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి జోగు రామన్న అన్నారు. ఆదివారం బెల్లంపల్లికి వచ్చిన ఆయన ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వచ్చే నాలుగేళ్లలోపు ప్రతీ ఇంటికి నల్లా కనెక్షన్ ఇప్పించి తాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు. చంద్రబాబు పాలనలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, రైతులపై చిత్తశుద్ధి ఉంటే అప్పటి మృతుల కుటుంబాలకు ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సునీతారాణి, వైస్ చైర్మన్ ఎన్.సత్యనారాయణ, ఎంపీపీ పి.సుభాష్‌రావు, టీఆర్ఎస్ నాయకులు ఆర్.ప్రవీణ్, ఎస్.నర్సింగం పాల్గొన్నారు. మున్నూరు కాపుల అభ్యున్నతికి కృషి మంచిర్యాల టౌన్ : మున్నూరు కాపు కుల బాంధవుల అభ్యన్నతికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. ఆదివారం మంచిర్యాలలో మున్నూరుకాపు సంఘం పట్టణ గౌరవ అధ్యక్షుడు గొంగళ్ల శంకర్ నివాస గృహానికి మంత్రి రామన్న ప్రత్యేక ఆహ్వానితుడిగా హాజరు కాగా ఆయనను ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు కులస్తుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఐక్యతగా రాణిస్తూ మున్నూరు కాపులు రాజకీయాల్లో కూడా రాణించాలని సూచించారు. పిల్లలు ఉన్నత చదువుల్లో రాణించేలా వారికి తల్లిదండ్రులు తగిన ప్రోత్సాహం అందించాలన్నారు. మంత్రి వెంట బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మందమర్రి తహశీల్దార్ ఇత్యాల కిషన్, మున్సిపల్ వైస్‌చైర్మన్ నల్ల శంకర్, వేంపల్లి సర్పంచ్ డేగ బాపు, మున్నూరు కాపు సంఘం సభ్యులు రాజయ్య, సత్యం, శ్రీనివాస్, సంతోష్, సత్యనారాయణ, బొలిశెట్టి కిషన్, ఆకుల దిలీప్, పానగంటి శ్రీనివాస్, బొడ్నాల శ్యాం, దీటి రవి పాల్గొన్నారు. -
ఓటమే గెలుపునకు నాంది
శ్రీరాంపూర్ : ఓటమే గెలుపునకు నాంది అని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శ్రీరాంపూర్ ప్రగతి మైదానంలో మూడు రోజులుగా నిర్వహించిన 41వ రాష్ట్రస్థాయి జూ నియర్ కబడ్డీ పోటీలు ఆదివారం ముగిశాయి. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్యఅతిథిగా హా జరై ఫైనల్ మ్యాచ్‌లు తిలకించారు. అనంతరం బహుమతుల ప్రదానోత్సవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ, ఓటమితో ఎప్పుడు కుంగిపోవద్దన్నారు. 2009 ఎన్నికల్లో తాను ఓ డిపోయాయని, అయినా వెనకడుగు వేయకుండా ప్రజల కోసమే పని చేశానని పేర్కొన్నా రు. ఆ ప్రజలే తనను 2014లో గెలిపించారని గుర్తు చేశారు. క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలోని పలు ప్రాంతా ల్లో రూ.3 కోట్లతో స్టేడియాలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మన ఊరు-మన ప్రణాళిక లో కూడా క్రీడల కోసం ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. తెలంగాణలోని చాలా పాఠశాలలకు పీఈటీలు, పీడీలు, గ్రౌండ్లు లేవన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు. ప్రస్తుతం క్రీడాకారులకు విద్యా, ఉద్యోగాల్లో 2 శాతం రిజర్వేషన్ ఉందని దాన్ని 5 శాతానికి తాము సీఎంను కోరుతామన్నారు. రూ.90 కోట్లతో బడ్జెట్ ఇటీవల బడ్జెట్లో క్రీడలకు ప్రభుత్వం రూ.90 కోట్లు కేటాయించిందని మంచిర్యాల ఎమ్మెల్యే ఎన్ దివాకర్‌రావు తెలిపారు. దాన్ని రెండింత లు చేస్తామన్నారు. అనంతరం బెల్లంపల్లి ఎ మ్మెల్యే దుర్గం చిన్నయ్య మాట్లాడుతూ తెలంగాణ క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని ఆకాక్షించారు. విజేతలకు వీరే.. రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు హోరాహోరీగా సాగాయి. ఫైనల్ పోటీ లను చేసేందు కు స్థానికులు పెద్దఎత్తున తరలివచ్చారు. బా లుర విభాగంలో నిజామాబాద్ జట్టు ప్రథమ స్థానం సాధించగా, వరంగల్ ద్వితీయ స్థానం లో నిలిచింది. హైదరాబాద్, కరీంనగర్ జట్ల కు ఉమ్మడిగా తృతీయ స్థానం ఇచ్చారు. బాలి కల్లో వరంగల్ జట్టు ప్రథమ స్థానం, నల్గొండ జట్టు ద్వితీయ స్థానం సాధించాయి. ఆదిలాబాద్, నిజామాబాద్ జట్లకు ఉమ్మడిగా తృతీ య స్థానం ఇచ్చారు. ఇదిలా ఉంటే జిల్లా జట్టు కేవలం మహిళ విభాగంలో తృతీయ స్థానంలో సరిపెట్టుకోవడం స్థానిక క్రీడాకారులను, నిర్వాహకులను నిరాశ పరిచించింది. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ప్రాబబుల్స్ జట్టును ఎంపిక చేసి నేషనల్స్ ఆడిస్తామని ని ర్వాహకులు తెలిపారు. వీరికి 15 రోజులపా టు హైదరాబాద్‌లో శిక్షణ ఇచ్చి వచ్చే నెల చివరి వారంలో ఢిల్లీ జరిగే జాతీయ స్థాయి పోటీలకు పంపిస్తామన్నారు. పోటీల నిర్వాహణకు మైదానంతోపాటు ఇతర వనరు లు సమకూర్చిన సిం గరేణి కి వారు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అతిథులను, క్రీడాకారులను సన్మానించారు. కార్యక్రమంలో కబడ్డీ అసోసియేష న్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అజీజ్‌ఖాన్, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజీరెడ్డి, జెడ్పీటీసీ ఆర్.ఆశలత, టీఆర్ఎస్ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు లోక భూమారెడ్డి, ఒలింపిక్స్ అసోసియేషన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్.నారాయణరెడ్డి, కార్యదర్శి పి.రఘునాథరెడ్డి, దివాకర్‌రావు తనయుడు విజిత్‌రావు, రెస్క్యూ జీఎం సూర్యదాస్, డీజీఎం(పర్సనల్) శర్మ, కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఈ.రాంచందర్, సహాయ కార్యదర్శి, సర్పంచ్ ఎం .రాజేంద్రపాణి, టీబీజీకేఎస్ కేంద్ర ఉపాధ్యక్షుడు ఏనుగు రవీందర్‌రెడ్డి, డివిజన్ ఉపాధ్యక్షుడు బండి రమేశ్, నేతలు పానుంటి సత్తయ్య, సురేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.