state governmet
-
సమన్వయమే కీలకం
కరోనా వైరస్ కేసుల్లో మహారాష్ట్ర ఇప్పటికీ అగ్రభాగానే వున్నా అక్కడ కొత్తగా బయటపడే కేసుల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతున్న సూచనలు కనబడటం ఊరటనిస్తుండగా... దేశ రాజధాని నగరం ఢిల్లీ మాత్రం ఇంకా భయపెడుతూనే వుంది. ఆ మహా నగరం గురించిన చింత మరొకటుంది. కరోనా విరుచుకుపడుతున్న ఈ దశలో కూడా ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కొరవడటం... రోగుల విషయంలో ఎలా వ్యవహరించాలన్న ప్రాథమిక అంశంలో కూడా ఏకాభిప్రాయం లేకపోవడం మరింతగా ఆందోళన కలిగిస్తోంది. దేశంలో బుధవారంనాటికి దేశవ్యాప్తంగా 4,56,183 కేసులుండగా, మహారాష్ట్రలో 1,39,010 కేసులు, ఢిల్లీలో 70,390 కేసులు న్నాయి. ఢిల్లీలోప్రభుత్వాలు రెండూ కలిసి పనిచేయకపోతే ఆ నగరం ప్రమాదకరంగా మారుతుం దని సాక్షాత్తూ సుప్రీంకోర్టు చెప్పాక కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్... ఉన్నతాధికారులు ఉమ్మడి సమావేశాలు నిర్వహిం చారు. ఆ తర్వాత ఢిల్లీ ప్రభుత్వం ఎలాంటి అదనపు చర్యలు తీసుకోవాల్సివుంటుందో సూచిస్తూ కేంద్రం వివిధ సూచనలు చేసింది. వీటన్నిటి పర్యవసానంగా కరోనా కట్టడి మెరుగవుతుందని అందరూ ఆశించారు. కానీ జరుగుతున్నది వేరు. నాలుగు రోజులక్రితం అనిల్ బైజాల్ జారీ చేసిన ఆదేశాలు గమనిస్తే ఈ సంగతి అర్థమవుతుంది. ప్రస్తుతం కరోనా వ్యాధిగ్రస్తుల్ని గుర్తించాక వారిలో స్వీయ నిర్బంధం సరిపోతుందనుకున్న వారిని ఇంటికే పరిమితం చేస్తున్నారు. వారి యోగక్షేమాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ, అవస రమైన మందులిస్తున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువున్నవారిని మాత్రం ఆసుపత్రుల్లో చేరుస్తున్నారు. అయితే బైజాల్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా కరోనా బారిన పడినవారంతా కనీసం అయిదు రోజులు ప్రభుత్వం నిర్వహించే ఆరోగ్య కేంద్రాల్లో వుండాలి. వైద్యుల పర్యవేక్షణలో వారు అన్ని రకాల పరీక్షలూ చేయించుకున్నాక ఆ రోగులకు స్వీయ నిర్బంధం సరిపోతుందో లేదో నిర్ణయిస్తారు. అదే సమయంలో మరో బృందం ఆ రోగుల ఇంటికిపోయి అక్క డున్న సౌకర్యాలేమిటో చూస్తుంది. స్వీయ నిర్బంధంలో వుండదల్చుకున్నవారికి ఇంటిదగ్గర విడిగా ఒక గది, వాష్‌రూం వున్నాయో లేదో పరిశీలిస్తుంది. అలాంటి అవకాశం వున్నవారిని మాత్రమే ఇళ్లలో వుండేందుకు పంపుతారు. తగిన సౌకర్యాలు లేకపోతే వ్యాధి తీవ్రతతో సంబంధం లేకుండా వారు ఆసుపత్రులకే పరిమితం కావలసివుంటుంది. కరోనా వ్యాధి విస్తృతి క్రమంలో తీవ్రత అధికంగా వున్నచోట్ల అమలు చేస్తున్న విధానాలు కొన్నివున్నాయి. మందకొడి లక్షణాలున్నవారిని ఇంట్లోనే వుంచి, ఎప్పటికప్పుడు వారికి సలహాలిస్తూ అవసరమైన మందులు వాడించడం, లక్షణాలు ముదు రుతున్న సూచనలు కనిపిస్తే ఆసుపత్రులకు తరలించడం అక్కడ అనుసరించే విధానం. కానీ బైజాల్ తాజా ఆదేశాలు కొత్త విధానాన్ని తీసుకొచ్చాయి. కరోనా లక్షణాలున్నవారందరినీ అంబులెన్స్‌లలో ఆసుపత్రులకు తరలించడం, అక్కడ అందరినీ పరీక్షించడం, అయిదురోజులపాటు వారు అక్కడే వుండటం వంటివి అందులో కొన్ని. అయితే ఢిల్లీ ప్రభుత్వం నుంచి దీనిపై అభ్యంతరాలు వ్యక్తమ య్యాక అయిదురోజులు ఆసుపత్రుల్లో వుండాలన్న నిబంధన నిలిపివేశారు. ఆరోగ్యకేంద్రానికొచ్చి తగిన పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధన పాటించితీరాలంటున్నారు. వ్యాధివున్నా దాని లక్ష ణాలు బయటపడనివారిని, ఆ వ్యాధి తీవ్రత ఎక్కువున్నవారిని ఒకేచోట వుంచితే రోగుల సంఖ్య అమాంతం పెరిగిపోయే అవకాశం వుండదా? తీవ్ర జ్వరంతో బాధపడే రోగులు తమ వంతు వచ్చే వరకూ ఆసుపత్రుల్లో గంటల తరబడి బారులు తీరి నిలబడవలసి రావడం ఇబ్బంది కాదా? ఇంత మందిని పరీక్షించడానికి అవసరమైన వైద్య సిబ్బంది అందుబాటులో వుండటం సాధ్యమేనా? వ్యాధి తీవ్రత అధికంగా లేనివారిని ఇళ్లకు పరిమితం చేస్తున్నా, తీవ్రత వున్నవారిని చేర్చుకుని వైద్య సౌక ర్యాలు కల్పించడంలోనే ఆసుపత్రులు తలకిందులవుతున్నాయి. ఢిల్లీ పరిధిలో 11 జిల్లాలుంటే అందులో కనీసం మూడు జిల్లాల్లో కరోనా జోరు అధికంగా వుంది. ఢిల్లీలో ఇప్పుడు రోజూ బయటపడుతున్న కేసుల సంఖ్య 3,000 దాటింది. ఇంతమందిని ఆసు పత్రులకు తరలించడానికి అవసరమైన అంబులెన్స్‌లు సమకూర్చడం, వచ్చిన రోగులకు అవసర మైన పరీక్షలు జరపడం, మరోపక్క తీవ్రత వున్నవారికి చికిత్స అందిస్తుండటం అయ్యేపనేనా? ఒక లెక్క ప్రకారం ఢిల్లీలో కరోనా రోగుల సేవకు 163 అంబులెన్స్‌లు ప్రత్యేకించారు. ఈ వాహనాలు ఒక్కొక్కటి 18 ట్రిప్పులు నడిపితే తప్ప 3,000మంది రోగుల్ని తరలించడం అసాధ్యం. పైగా వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య కేంద్రాల్లో కూడా తగిన సదుపాయాలు లేవు. వైద్యుల సంగతలావుంచి అక్కడ తగినన్ని ఏసీలు, మరుగుదొడ్లు వంటివి లేకపోవడం రోగులకు సమస్యగా వుందంటున్నారు. వైద్య బృందాలు అనుమానితుల ఇళ్లకు వెళ్లడం, వారికి పరీక్షలు జరిపి వ్యాధి నిర్ధారణ చేయడం, తక్షణం చికిత్స అవసరమైనవారిని ఆసుపత్రులకు తరలించడం... అంతగా తీవ్రత లేనివారిని ఇళ్లకే పరిమితం చేయడం అనే ప్రస్తుత విధానం ఉన్నంతలో మంచిది. అదీగాక రోజూ వేలాది కేసులు బయటపడుతున్న తరుణంలో వున్న విధానాన్ని మార్చడం వల్ల వ్యవస్థ తల కిందులవుతుంది. కరోనా వైరస్ పరీక్షల్ని నిర్వహించడంలో ఇప్పటికే దేశంలో అందరికన్నా ముందున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం... వచ్చే మూడు నెలల్లో ప్రతి కుటుంబానికీ సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని సంకల్పించింది. తాజాగా ఢిల్లీ ప్రభుత్వం కూడా అదే బాటలో వెళ్లాలని నిర్ణయించుకుంది. ఢిల్లీలో కరోనా కట్టడికి అనుసరించాల్సిన విధివిధానాలపై అటు కేంద్ర ప్రభుత్వమూ, ఇటు ఢిల్లీ ప్రభుత్వమూ ప్రతిష్టకు పోకుండా సమష్టిగా పనిచేస్తేనే సమస్య మటు మాయం అవుతుంది. -
అంగన్ వాడీల సమ్మె యథాతథం
ప్రభుత్వంతో చర్చలు విఫలం 10 సంఘాలతో ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి, కమిషనర్ భేటీ నిర్దిష్టమైన హామీ ఇవ్వని అధికారులు వేతనాల పెంపుపై పట్టుపట్టిన సంఘాలు సాక్షి, హైదరాబాద్: వేతనాల పెంపు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం గత 17వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తున్న అంగన్వాడీల తరఫున వివిధ యూనియన్లతో ప్రభుత్వం జరిపిన చర్చలు ఫలించలేదు. అంగన్వాడీల సమస్యల పట్ల తాము సానుభూతితోనే ఉన్నప్పటికీ ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో వేతనాల పెంపునకు సంబంధించి స్పష్టమైన హామీ ఇవ్వలేమని అధికారులు తేల్చిచెప్పడంతో సమ్మెను కొనసాగించాలనే యూనియన్లు నిర్ణయించాయి. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు రాష్ట్రవ్యాప్త ఆందోళనల నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పి.కె. మహంతి చొరవ మేరకు ప్రభుత్వం తరఫున రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి నీలం సహానీ, కమిషనర్ చిరంజీవి చౌదరి, జాయింట్ డెరైక్టర్లు శివపార్వతి, సత్తయ్య, సరళా రాజ్యలక్ష్మి యూసఫ్‌గూడలోని కమిషనర్ కార్యాలయంలో యూనియన్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. సీఐటీయూ, ఏఐటీయూసీ, వైఎస్ఆర్సీపీ, ఐఎన్టీయూసీ, టీఎన్టీయూసీ వంటి రాజకీయపార్టీల అనుబంధ యూనియన్లతో పాటు గోదావరి, అక్కా, తెలంగాణ ఐసీడీఎస్ ఫోరం, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సకల ఉద్యోగుల సంఘం, మందకృష్ణ మాదిగ ప్రతినిధులు హాజరయ్యారు. చర్చల్లో ముఖ్యాంశాలు.. వేతనాల పెంపునకు స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని సీఐటీయూ తరఫున హాజరైన సాయిబాబు, రోజాలు ప్రభుత్వాన్ని కోరారు. ఆపద్ధర్మ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయని, ఈ సందర్భంగా తాము వేతనాల పెంపుపై సరైన నిర్ణయం తీసుకోలేమని అధికారులు తెలిపారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఫైల్ ఇప్పటికే ముఖ్యమంత్రికి, ఆర్థిక శాఖకు పంపించామని అక్కడి నుంచి రాగానే నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. అయితే నిర్దిష్టమైన హామీ ఇస్తేనే సమ్మె విరమిస్తామని సీఐటీయూ ప్రతినిధులు స్పష్టం చేశారు. ప్రస్తుత రాజకీయ అనిశ్చితి నెలకొన్న తరుణంలో ఆందోళనలు కొనసాగించడం సబబుకాదని ఏఐటీయూసీ తరఫున ప్రతినిధులు చంద్రశేఖర్‌రావు, విజయలక్ష్మి, కరుణకుమారి తదితరులు అభిప్రాయపడ్డారు. అంగన్వాడీలతో సంబంధం లేకుండా కొన్ని యూని యన్లు తమ ప్రయోజనాల కోసం సమ్మెను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ ఐసీడీఎస్ ఫోరం ప్రతినిధి రవికుమార్, సకల ఉద్యోగుల సంఘం ప్రతినిధి సి. శ్రీనివాస్‌రావు, అక్కా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ తరఫున అనసూయ, గోదావరి సంఘం సభ్యులు వ్యతిరేకించారు. అయితే పరిస్థితులను బట్టి తగిన నిర్ణయం తీసుకోవాలని, అప్పటివరకు సమ్మెను కొనసాగించాలని అన్ని యూనియన్లు నిర్ణయించాయి.