state sarkar
-
సీఎం, సీఎంవో కనుసన్నల్లో...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినా సీఎం చంద్రబాబు, ఆయన కార్యాలయ ఉన్నతాధికారులు పరోక్షంగా ఉల్లంఘనలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇందుకు రాష్ట్ర ఆర్థిక శాఖ తన వంతు తోడ్పాటు అందిస్తోంది. సీఎం, ఆయన కార్యాలయ ఉన్నతాధికారుల కనుసన్నల్లో నగదు లావాదేవీల్ని నిర్వహిస్తోంది. ఓట్లు రాల్చని బిల్లులన్నింటినీ పెండింగ్‌లో పెట్టేయాలని, కేవలం ఓట్లు రాల్చే పథకాలకోసం నిధులను అందుబాటులో ఉంచాలని స్వయంగా సీఎం ఆర్థిక శాఖను ఆదేశించారు. ఈ మేరకు రెగ్యులర్ బిల్లులను పెండింగ్‌లో పెట్టాలన్న ఆయన ఆదేశాల్ని ఆర్థిక శాఖ తూచా తప్పక పాటిస్తోంది. ఇందులో భాగంగా వివిధ రకాలకు చెందిన రూ.25,600 కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టేసింది. అదే సమయంలో సీఎంతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు సూచించిన వాటికే బిల్లులు చెల్లిస్తోంది. సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఒకఉన్నతాధికారి ఈ బిల్లుల చెల్లింపు వ్యవహారంలో కమీషన్లు సైతం కాజేస్తున్నారని సచివాలయ వర్గాలు చెబుతుండడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఓట్లు రాల్చే పథకాలకు ఇచ్చేందుకు వీలుగా అప్పులు తీసుకోవాలని, ఎక్కువ వడ్డీకైనా వెనుకాడవద్దని సీఎం ఆదేశాలిచ్చారు. దీంతో ఆర్థికశాఖ ప్రభుత్వరంగ సంస్థలన్నింటికీ 9 శాతానికిపైగా అప్పులు తెచ్చుకోవడానికి అనుమతిస్తూ రహస్య జీవోను జారీ చేసింది. అంతా పెండింగ్.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను నెలల తరబడి చెల్లించకుండా ఆర్థికశాఖ పెండింగ్‌లో పెట్టేసింది. మరోవైపు కేంద్ర ప్రాయోజిత పథకాల కింద కేంద్రం విడుదల చేసిన నిధులను దారిమళ్లించేసింది. కేంద్రం తనవాటా కింద నిధులను విడుదల చేయగా.. వాటికి రాష్ట్ర వాటాను జమ చేసి ఆయ శాఖలకు విడుదల చేయాల్సిన రాష్ట్ర సర్కారు కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ.మూడు వేల కోట్లను ఇతర వినియోగానికి మళ్లించింది. - ఇటీవల పెద్దఎత్తున వివిధ రంగాల ప్రాజెక్టులకు టెండర్లు ఖరారు చేశారు. అలా టెండర్లు ఖరారు చేసిన కాంట్రాక్టు సంస్థలకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు ఇవ్వడానికి వీలుగా మిగతా రంగాలకు చెందిన బిల్లుల్ని పెండింగ్‌లో పెట్టేశారు. కోటి రూపాయల బిల్లుకోసం మాజీ ఎమ్మెల్యే నెలరోజులుగా సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నా బిల్లును పాస్ చేయకపోవడం దీనికి నిదర్శనం. మరోవైపు మున్సిపాలిటీల్లో రూ.50 లక్షల విలువగల చిన్న చిన్న పనులు చేసిన చిన్న కాంట్రాక్టర్లకూ బిల్లులు నిలుపుదల చేశారు. ఆ కాంట్రాక్టర్లు సైతం సచివాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం ఉండట్లేదు. - గ్రంథాలయ సంస్థలకు చెందిన పీడీ ఖాతాల్లో నిధులను కూడా రాష్ట్రప్రభుత్వం లాగేసుకుంది. ఒక్కో జిల్లా గ్రంథాలయ సంస్థల పీడా ఖాతాల్లో ఉన్న రూ.80 లక్షల నుంచి రూ.కోటి వరకు గల నిధులను వెనక్కు తీసేసుకుంది. దీంతో గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులు 1,000 మందికి వేతనాలు డిసెంబర్ నుంచి రావట్లేదు. అలాగే పదవీ విరమణ చేసిన 1,500 మందికి పెన్షన్ రావట్లేదు. దీనిపై ఆంధ్రప్రదేశ్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు కోన దేవదాస్ మంగళవారం సచివాలయంలో ఆర్థికశాఖ కార్యదర్శిని కలసి వినతిపత్రం సమర్పించారు. మరోవైపు జిల్లా గ్రంథాలయ సంస్థల్లో పనిచేస్తున్న 283 మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాల్ని 2016 నుంచి ఇవ్వకుండా నిలుపుదల చేశారు. - ఎన్టీఆర్ వైద్యసేవలో ఔట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న 1,600 మందికి సైతం జనవరి నుంచి వేతనాలివ్వకుండా నిలుపుదల చేశారు. అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మూడేసి నెలల నుంచి వేతనాలు చెల్లించకపోవడంతో తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. - సంక్షేమ గురుకులాల్లో విద్యార్ధులకు శిక్షణ ఇచ్చే ఔట్సోర్సింగ్ ఉద్యోగులదీ ఇదే పరిస్థితి. వారికి ఆరు నెలలనుంచి వేతనాల్ని నిలుపుదల చేశారు. ఇక విద్యాశాఖకు చెందిన ఆహార, రేషన్ బిల్లుల్నీ ప్రభుత్వం నిలిపేసింది. ఔట్‌సోర్సింగ్‌లో వివిధ ప్రభుత్వశాఖలకు వాహనాలను నడుపుతున్న స్వయం ఉపాధి వారికీ చెల్లింపులు ఆపేశారు. - సీఎం సహాయనిధి నుంచి పేదలు, మధ్యతరగతి రోగులకు వైద్యంకోసం మంజూరు చేసే నిధులనూ పెండింగ్‌లో పెట్టేశారు. దీంతో రోగులు అవస్థలు పడుతున్నారు. సీఎం లేదా ఆయన కార్యాలయ అధికారులు చెప్పే బిల్లులకే ఆర్థికశాఖ ఆమోదం తెలుపుతోంది. ఇలా చేయడం వల్ల అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్ కేటాయింపులకు విలువ ఏముంటుందని, ఆయా రంగాలకు కేటాయించిన నిధులను ఇతర రంగాలకివ్వడం అసెంబ్లీ ఆమోదించిన బడ్జెట్‌ను అపహాస్యం చేయడమేనంటూ ఉన్నతాధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండడం గమనార్హం. ఔట్సోర్సింగ్ వారికి తక్షణం వేతనాలివ్వాలి.. అసలే తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలివ్వకుండా రాష్ట్రప్రభుత్వం ఇతర అవసరాలకు నిధులివ్వడాన్ని ప్రభుత్వ ఉద్యోగుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల రాష్ట్ర సమాఖ్య తప్పుపట్టింది. సమాఖ్య ప్రతినిధులు వెంకటరామిరెడ్డి, అర్వాపాల్ మాట్లాడుతూ తక్షణం ఔట్సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా గ్రంథాలయాలకు చెందిన నిధుల్ని వారి ఖాతాల్లోంచి ప్రభుత్వం లాగేసుకోవడం దారుణమన్నారు. వారి ఖాతాలకు తిరిగి వారి నిధులను ప్రభుత్వం తక్షణం జమ చేయాలని డిమాండ్ చేశారు. -
ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారు?
రుణరైతు విమోచన కమిషన్‌పై రాష్ట్ర సర్కార్‌ను ప్రశ్నించిన హైకోర్టు సాక్షి, హైదరాబాద్: రైతు రుణ విమోచన కమిషన్‌ను ఎప్పటిలోగా ఏర్పాటు చేస్తారో నిర్ధిష్టంగా తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతు రుణ విమోచన కమిషన్‌ను ఏర్పాటు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఇంద్రసేనారెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేసింది. రుణాల ఊబిలో కూరుకుపోయిన రైతులు వాటిని తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో 2016 మే 27న రాష్ట్ర రుణ విమోచన కమిషన్ చట్టాన్ని తెచ్చిందని పిటిషనర్ తరఫు న్యాయవాది వై.బాలాజీ గుర్తుచేశారు. వ్యవసాయ కూలీలు, సన్నకారు రైతులు, గ్రామీణ చేతివృత్తుల నిపుణుల రక్షణ కోసం తెచ్చిన ఆ చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఇప్పటికే కొంతమేర జాప్యం జరిగినమాట వాస్తవనేని, కమిషన్ ఏర్పాటుకు కొంత సమయం కావాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ కోరారు. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి అధ్యక్షతన ఏర్పాటుకు చర్చలు జరుగుతున్నాయని, ఈ దశలో వివరాలు వెల్లడించలేమని, 2 వారాల గడువిస్తే పూర్తి వివరాలు అందజేస్తామన్నారు. ఎంత గడువులోగా కమిషన్‌ను ఏర్పాటు చేస్తారో నిర్ధిష్టంగా తెలపాలని కోరిన ధర్మాసనం.. చట్టం ప్రకారం కమిషన్‌ను ఏర్పాటు చేయాల్సిందేనని స్పష్టం చేసింది. -
రాష్ట్ర ప్రజలపై రోజుకు రూ.40 కోట్లు
-
రోజుకు రూ.40 కోట్లు!
వైఎస్ హయూం తర్వాత ప్రభుత్వాలు ప్రజలపై మోపిన భారం సాక్షి, హైదరాబాద్: గత నాలుగేళ్లలో పన్ను పోట్లు, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం మోపిన రాష్ట్ర ప్రభుత్వం.. ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇదిగో సంక్షేమం, అదిగో పథకం అంటూ హడావుడి చేస్తోంది. కోటి ఆశలతో కొత్త ప్రపంచంలోకి అడుగుపెట్టిన ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం ముగిసిన తర్వాత.. సంక్షేవు పథకాలకు కోత పెట్టడం, వీలైనంతగా కొత్త పన్నులతో బాదడానికే ప్రభుత్వాలు పరిమితమయ్యూరుు. గత నాలుగేళ్లను ఒక్కసారి పరికించి చూస్తే.. కఠోర వాస్తవాలు కళ్లముందు గిర్రున తిరుగుతాయి. వైఎస్ ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత విద్యుత్... ఇలా ఎన్నో సంక్షేమ పథకాల నిధుల్లో కోత పెట్టి వాటిని కొరగాకుండా చేసిన ప్రభుత్వం ఖజానా నింపుకోవటమే పనిగా పెట్టుకుంది. గత 50 నెలల కాలంలో ఈ ప్రభుత్వాలు రాష్ట్ర ప్రజలపై ఎంత భారం మోపాయో లెక్కతీయుటానికి ‘సాక్షి’ ప్రయుత్నించినప్పుడు కళ్లు తిరిగే లెక్కలు తేలాయి. వ్యాట్, కరెంటు బిల్లులు, బస్సు చార్జీలు, వాహన పన్నులు, స్టాంపులు..రిజిస్ట్రేషన్లు తదితరాల రూపంలో ఏకంగా సుమారు రూ.60 వేల కోట్ల భారాన్ని ప్రజల నెత్తిన మోపింది. అంటే సగటున ప్రతినెలా రూ. 1,200 కోట్లు, రోజుకు రూ. 40 కోట్ల పెను భారం మోపింది. కరెంటు చార్జీలతో గుండెకోత వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్ల కాలంలో కరెంటు బిల్లు ఒక్క రూపాయి కూడా పెరగలేదు. భవిష్యత్తులోనూ చార్జీలు పెంచేది లేదని ఆయన స్పష్టంగా చెప్పారు. పైగా పేద రైతులపై కరెంటు భారం ఉండదన్న ఉద్దేశంతో ‘ఉచిత కరెంటు’ పథకాన్ని ప్రారంభించి నిరాటంకంగా కొనసాగించారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా లక్షలాదిమంది రైతులకు లబ్ధి చేకూరింది. మరోవైపు పరిశ్రమలకు యూనిట్‌పై సగటున 17 పైసలు చొప్పున ప్రోత్సాహకాన్ని ప్రకటించారు. 2009 సెప్టెంబర్‌లో రాజశేఖరరెడ్డి మరణించిన వెంటనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న రోశయ్య ఒక్కసారిగా కరెంటు చార్జీలను పెంచి భారీ భారాన్ని ప్రజల నెత్తిన మోపగా, ఆ తర్వాత వచ్చిన కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రతియేటా చార్జీలు పెంచటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇక అది చాలదన్నట్టు సర్దుబాటు చార్జీల పేర, అసలు చార్జీలను మించి వసూలు చేయటం మొదలుపెట్టారు. ఇక ఉచిత విద్యుత్ పథకాన్ని నిర్వీర్యం చేస్తూ రెండున్నర ఎకరాల మాగాణి (తరి) పొలం ఉన్న వారిని అందుకు అనర్హులుగా ప్రకటించారు. ఇలా లక్షన్నర మంది రైతులకు ఆ పథకాన్ని దూరం చేశారు. వెరసి రాజశేఖరరెడ్డి మరణానంతరం తర్వాత సర్దుబాటు చార్జీలు సహా కరెంటు బిల్లుల రూపంలో ప్రభుత్వం అదనంగా రూ. 24,218 కోట్ల భారాన్ని మోపింది. బస్సు చార్జీల మోత కరెంటు బిల్లుల తరహాలోనే ఆర్టీసీ చార్జీల విషయంలోనూ వైఎస్ వ్యవహరించారు. ప్రజలపై భారం పడొద్దని తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం వాటి జోలికే వెళ్లలేదు. ఆయన మరణానంతరం అడ్డూఅదుపూ లేకుండా చార్జీల మోత మోగించిన ప్రస్తుత ప్రభుత్వం గడచిన నాలుగేళ్లలో ఏకంగా రూ.1980 కోట్లమేర ప్రజల జేబుల నుంచి అదనంగా కొల్లగొట్టింది. చివరకు పేదల కోసం ఉద్దేశించిన పల్లెవెలుగు బస్సులనూ చార్జీల పెంపునుంచి మినహారుుంచలేదు. వ్యాట్ వేటు..! ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా భావించే విలువ ఆధారిత పన్ను (వ్యాట్) అంటేనే ప్రజలు వణికిపోయే పరిస్థితి నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ.55 వేల కోట్ల మేర పిండుకోవాలని లక్ష్యంగా పెట్టుకోవటం దీనికి నిదర్శనం. అంతకుముందు సంవత్సరం కంటే ఏకంగా రూ.10 వేల కోట్ల మేర అధికంగా లక్ష్యాన్ని నిర్ధారించిన ప్రభుత్వం అవకాశం ఉన్న వస్తువునల్లా వ్యాట్ పరిధిలో చేరుస్తూ, 5 శాతం పన్ను పరిధిలో ఉన్నవాటిని 14.5 శాతం పరిధిలోకి తెస్తూ ప్రజలను పీల్చిపిప్పి చేస్తోంది. లక్ష్యాన్ని పెంచినా ఆదాయం సరిపోవటం లేదన్న కారణంతో వచ్చే ఆర్థిక సంవత్సరం లక్ష్యాన్ని హీనపక్షంగా మరో రూ. 8 వేల కోట్లకు పెంచే యోచనలో ఉంది. 2008-09 వ్యాట్ లక్ష్యం రూ. 22,500 కోట్లు ఉంటే వైఎస్ దాన్ని మరుసటి యేడాదికి కేవలం వేయి కోట్లమేర మాత్రమే పెంచారు. కానీ ఆయన మరణించిన తొలి సంవత్సరంలోనే రోశయ్య ప్రభుత్వం ఏకంగా రూ. 29,144 కోట్ల లక్ష్యాన్ని పెడితే అది కాస్తా 2013-14 నాటికి రూ.55 వేల కోట్లకు పెరగటం విశేషం. ఈ విధంగా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో ప్రజల నుంచి ఏకంగా రూ.23 వేల కోట్లకుపైగా అదనంగా దండుకుంది. వాహన కొనుగోలుదారులకు వెతలు వాహన కొనుగోలుదారులనూ ప్రభుత్వం వదిలిపెట్టలేదు. 2009-10 ఆర్థిక సంవత్సరంలో రవాణా శాఖ ద్వారా రూ.2,300 కోట్ల ఆదాయం ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆర్థికమాంద్యం, రాష్ట్రంలో అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో అభివృద్ధి మందగించడంతో రాష్ట్రంలో మోటారు వాహనాల విక్రయం నేల చూపులు చూస్తోంది. కానీ ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకోకుండా.. పన్నుల మోత మోగిస్తోంది. త్రైమాసిక పన్నుల జాబితాలో ఉన్న పలువాహనాలను జీవితపన్ను పరిధిలోకి తీసుకురావడం, పన్నులు పెంచడం, రెండో వాహనం కొంటే గరిష్టంగా 14.5 శాతం పన్ను విధించడం.. తదితర చర్యల తో ప్రజల మీద భారం పెంచేసింది. తద్వారా రెండువేల కోట్లకు పైగా ఆర్జించింది. స్టాంపులు, రిజిస్ట్రేషన్ల బాదుడు ప్రభుత్వం ఆదాయం పెంపు కోసం స్థిరాస్తి కొనుగోలుదారులను కూడా పీల్చిపిప్పి చేసింది. 2009 - 10 ఆర్థిక సంవత్సరంలో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 2012- 13 నాటికి రూ.6,600 కోట్లకు పెరగడం గమనార్హం. 2010లో ప్రభుత్వం భూములు, స్థలాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. 29 విభాగాలుగా ఉన్న భూములు, స్థలాలను కేవలం అయిదు కేటగిరీలుగా మార్చేసింది. పట్టణాల్లో అయితే వాణిజ్య, నివాస అనే రెండు వర్గీకరణలకే పరిమితం చేసింది. అప్పట్లో కొన్నిచోట్ల భూములు, స్థలాల మార్కెట్ విలువలను 400 నుంచి 600 శాతం వరకూ పెంచింది. అందువల్లే 2009 -10లో రూ.3,064 కోట్లు ఉన్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ రాబడి 2010 -11 సంవత్సరంలో రూ.4,432 కోట్లకు పెరిగింది. 2013లో కూడా ప్రభుత్వం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూములు, స్థలాలు, భవనాల మార్కెట్ విలువలను భారీగా పెంచింది. పట్టణాలకు సమీపంలోని గ్రామాల్లో అక్కడక్కడా ఒకటి రెండు ఇళ్లు ఉన్న వ్యవసాయ భూములను కూడా ఇళ్ల స్థలాల వర్గీకరణలోకి మార్చింది. దీంతో వీటి కొనుగోలుదారులపై భారీ భారం పడింది. నగరపాలక, పురపాలక సంఘాల్లో గత మూడేళ్ల కాలంలోనే ఏకంగా ఆస్తిపన్ను పెంపు ద్వారా రూ. 800 కోట్లు, మంచినీటిపై రూ. 200 కోట్ల భారాన్ని మోపింది. భవన నిర్మాణ అనుమతుల ఫీజుల్లో రూ. 300 కోట్ల పెరుగుదల నమోదైంది. -
అసెంబ్లీ ఆమోదం అక్కర్లేదా?
చిత్తూరు తాగునీటి పథకంపై హైకోర్టు ప్రశ్న సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో తాగునీటి పథకానికి సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రూ. 7,390 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు... అందుకు శాసనసభ ఆమోదం అవసరం లేదా? అని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేసే ముందు శాసనసభ ఆమోదం అవసరమా.. లేదా? అనే విషయంపై పూర్తి వివరాలతో ఈనెల 27లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఆ తరువాత వారం రోజుల్లోగా ఆ కౌంటర్‌కు సమాధానం ఇవ్వాలని పిటిషనరైన టీఆర్ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావుకు స్పష్టం చేసింది. -
నిబంధనలు సడలించండి
సాక్షి, హైదరాబాద్: వర్షాలు, వరదల కారణంగా తడిసిన, రంగు మారిన వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలుకు వీలుగా నిబంధనలు సడలించాలని, రైతులను ఆదుకునేందుకు వీటిని ప్రభుత్వ సంస్థల ద్వారా సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కారు విజ్ఞప్తి చేయనుంది. వర్షాల నష్టాలపై మంగళవారం సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో సమీక్షలో సీఎం ఈ మేరకు నిర్ణయించారని మీడియాకు మంత్రి రఘువీరారెడ్డి తెలిపారు. తడిసిన పత్తిని సీసీఐ ద్వారా కొనుగోలు చేయించడానికి పరిశీలన బృందాన్ని పంపడానికి కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు అంగీకరించారని చెప్పారు. తడిసిన, రంగు మారిన ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి ద్వారా, మొక్కజొన్న, సోయాబీన్‌ను నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని కేంద్రాన్ని సీఎం కోరతారన్నారు. బ్యాంకర్ల కమిటీతో మాట్లాడి రుణాలు రీ షెడ్యూల్ చేయించాలని నిర్ణయించారు. ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు తక్షణం విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.1.50 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని సూచిం చారు. 18 ఏళ్లు నిండిన వారికైతే ఆపద్బందు కింద మరో రూ.50 వేలు అదనంగా ఇప్పించాలని ఆదేశిం చారు. నష్టాలపై మూడు నాలుగు రోజుల్లో పూర్తిసాయి నివేదికలు పంపాలని అధికారులకు సూచించారు.