చిత్తూరు తాగునీటి పథకంపై హైకోర్టు ప్రశ్న
సాక్షి, హైదరాబాద్: సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో తాగునీటి పథకానికి సంచిత నిధి (కన్సాలిడేటెడ్ ఫండ్) నుంచి రూ. 7,390 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు... అందుకు శాసనసభ ఆమోదం అవసరం లేదా? అని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇంత భారీ మొత్తాలను ఖర్చు చేసే ముందు శాసనసభ ఆమోదం అవసరమా.. లేదా? అనే విషయంపై పూర్తి వివరాలతో ఈనెల 27లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. ఆ తరువాత వారం రోజుల్లోగా ఆ కౌంటర్‌కు సమాధానం ఇవ్వాలని పిటిషనరైన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే టి.హరీష్‌రావుకు స్పష్టం చేసింది.