డిగ్రీ ఫైనలియర్ పరీక్షలో మార్పులు
తేదీలు ముందుకు మారుస్తున్నట్లు ప్రకటించిన ఏఎన్యూ
ఒంగోలు : డిగ్రీ ఫైనలియర్ పరీక్షల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ నెల 12వ తేదీ నిర్వహిస్తామని ప్రకటించిన స్టాటిస్టిక్స్-3 పరీక్షను ఈ నెల 11వ తేదీకి మార్పుచేశారు. ఈ నెల 14వ తేదీ నిర్వహిస్తామని ప్రకటించిన స్టాటిస్టిక్స్-4 పరీక్షను ఈ నెల 12వ తేదీకి మార్చారు. ఈ నెల 21, 22వ తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించిన కెమిస్ట్రీ పరీక్షలోనూ మార్పులు చోటుచేసుకున్నట్లు సమాచారం.
పరీక్షల మార్పు వివరాలను కేవలం కాలేజీలకు ఆన్లైన్లో పంపి యూనివర్శిటీ అధికారులు చేతులు దులుపుకున్నారు. జిల్లాలో దీనికి సంబంధించి అధికారి ఎవరూ లేకపోవడంతో అయోమయం నెలకొంది. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు కాలేజీల నుంచి వెళ్లిపోయూరు. వారికి సమాచారం చేరవేయడం కాలేజీ యూజమాన్యాలకు పెద్ద సమస్యగా మారింది.