మట్టి వినాయక విగ్రహాలనే పూజించండి
ఆర్యవైశ్య సంఘం ఆధర్యంలో గణేశ్ విగ్రహాలు పంపిణీ
హుస్నాబాద్ : మట్టి వినాయక విగ్రహాలనే పూజించాలని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు కొండ్లె రాజేశ్వర్ అన్నారు. శ్రీరామేశ్వర, రాజేశ్వర (ఎస్ఆర్ఆర్) ఫౌండేషన్ మురంశెట్టి రాములు సిద్దిపేట ఆధ్వర్యంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం సౌజన్యంతో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసాయనాలతో వినాయక విగ్రహాలను తయారు చేయడం వల్ల చెరువులు, కుంటలు కలుషితమై అనేక వ్యాధులు సంభవించే ప్రమాదముందన్నారు. భక్తులు మట్టి వినాయక విగ్రహాలను పూజించి కాలుష్య నివారణకు తోడ్పాటు అందించాలని కోరారు. కార్యక్రమంలో సంఘ నాయకులు జిల్లా రవీందర్, కృష్ణమూర్తి, దొమ్మాటి రమేష్, కొండూరి శ్రీకాంత్, రాజు తదితరులున్నారు.