steady
-
నిలకడగా ఆఫీస్ అద్దెలు.. హైదరాబాద్‌లో డౌన్
న్యూఢిల్లీ: ఆఫీసు అద్దెలు దేశవ్యాప్తంగా ఆరు ముఖ్య పట్టణాల్లో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ పట్టణాల్లో చదరపు అడుగు అద్దె సగటున రూ.95గా ఉంది. ఈ పట్టణాల్లో 32 శాతం అదనపు కార్యాలయ వసతి ఈ కాలంలో అందుబాటులోకి వచి్చంది. ఇక కార్యాలయ స్థలాల కోసం డిమాండ్ 2 శాతం పెరిగింది. హైదరాబాద్‌తో పాటు పుణె, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. స్థూల ఆఫీసు స్పేస్ లీజు జూన్ క్వార్టర్లో క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలో పోలి్చచూసినప్పుడు, 2 శాతం పెరిగి 14.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి లీజు కోసం డిమాండ్ పెరిగింది. ఢిల్లీల్లో వృద్ధి ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు 11 శాతం పెరిగి 3.1 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కొత్తగా కార్యాలయ స్థలాల అందుబాటు. 43 శాతం పెరిగి 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.94.20గా ఉంది. ముంబైలో ఆఫీస్ స్పేస్ లీజు 41 శాతం క్షీణించి 1.6 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. నూతన సరఫరా 79 శాతం తగ్గి 0.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు రూ.140.10గా నమోదైంది. పుణెలో లీజు పరిమాణం 1.7 మిలియన్ చదరపు అడులుగా ఉంటే, ఒక చదరపు అడుగు అద్దె రూ.76.70గా ఉంది. నూతర సరఫరా 52 శాతం పెరిగి 0.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. హైదరాబాద్‌లో డౌన్ హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు జూన్ త్రైమాసికంలో 22 శాతం క్షీణించి 1.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజు పరిమాణం 1.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనించొచ్చు. అయితే, కార్యాలయ స్థలాల నూతన సరఫరా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 19 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ కార్యాలయ వసతి అద్దె చదరపు అడుగుకు రూ.73.70గా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.73.60గా ఉండడం గమనార్హం. చెన్నై మార్కెట్లో అత్యధికంగా ఆఫీస్ స్పేస్ లీజు మూడు రెట్లు పెరిగి 3.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ కొత్త సరఫరా 2.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఆఫీస్ అద్దె చదరపు అడుగుకు రూ.75.1గా ఉంది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్ అద్దె రూ.91.90గా నమోదైంది. ఆఫీస్ స్పేస్ లీజు పరిమాణం 22 శాతం తగ్గి 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నూతన సరఫరా రెండింతలు పెరిగి 3.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. -
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం
బ్యాంక్ ఆఫ్ జపాన్ కీలక నిర్ణయం తీసుకుంది. రెండు రోజుల ద్రవ్య విధానం సమావేశం ముగిసిన అనంతరం మార్కెట్ అంచనాలను అనుగుణంగానే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. తమ వడ్డీ రేట్లను ఎలంటి మార్పులలేకుండా యధాతథంగా ఉంచినట్టు సెంట్రల్ బ్యాంకు తెలిపింది బ్యాంక్ ఆఫ్ జపాన్ మంగళవారం మానిటరీపాలసీ విధానాన్ని ప్రకటించింది. రెండు రోజుల సమావేశం ముగిసిన తరువాత విడుదలైన ఒక ప్రకటనలో డిపాజిట్ రేట్లను -0.1శాతం వద్ద 10 సంవత్సరాల లక్ష్యాన్ని జీరో శాతంగాను నిర్ణయించినట్టు పేర్కొంది. ఈ నెలలోనే దీర్ఘకాల ప్రభుత్వ బాండ్ల కొనుగోళ్లను స్వల్పంగా తగ్గించింది. కాగా ఆర్థిక వ్యవస్థ స్థిరీకరణకు ప్రపంచ కేంద్ర బ్యాంకుల అడుగుజాడలను అనుసరిస్తుందనే ఊహాగానాలొచ్చాయి. దీనికి అనుగుణంగానే బీఓజే తన పాలసీ విధానాన్ని వెల్లడించింది. వినియోగదారుల ధర సూచిక నవంబరులో సంవత్సరం ప్రాతిపదికన 0.9 శాతం పెరిగింది, వరుసగా 11 వ నెల పెరుగుదల నమోదయింది. కాగా మెట్రిక్ ఒక రాయిటర్స్ పోల్ ప్రకారం, డిసెంబర్ లో అదే స్థాయి పెరుగుతుందని అంచనా. డిసెంబర్ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది. అయితే ఆహార, ఇంధనం ధరలను మినహాయించిన వినియోగదారుల ధరలు నవంబర్‌లో కేవలం 0.3 శాతం పెరిగాయి. -
ఎక్కడ ఫెడ్ రేట్లు అక్కడే కానీ..
పెట్టుబడిదారులు ఎంతో నిశితంగా పరిశీలించిన ఫెడ్ రిజర్వు రేట్ల ప్రకటన వెలువడింది. వడ్డీరేట్లలో ఎలాంటి మార్పులు లేకుండా యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు ప్రకటించింది. కానీ అగ్రరాజ్య ఆర్థిక వ్యవస్థ వేగంగా వృద్ధి చెంది, ద్రవ్యోల్బణం మరింత పెరిగితే డిసెంబర్లో వడ్డీరేట్లను పెంచుతామనే సంకేతాలను ఫెడరల్ రిజర్వు వెలువరిచింది. బుధవారంతో ముగిసిన రెండు రోజుల ఫెడ్ ద్రవ్యపరపతి విధాన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం వెల్లడించింది. అమెరికా ఎన్నికలు ఇంకా వారమైనా గడువు లేనిపక్షంలో, ఈ సమయంలో వడ్డీరేట్లను ఆ దేశ రిజర్వుబ్యాంకు మార్పులు చేయదని మార్కెట్ విశ్లేషకులు ముందస్తుగానే అంచనావేశారు. వారి అంచనాలకు అనుగుణంగానే వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడ్ రిజర్వు తెలిపింది. ఇప్పటికే అమెరికా ఎన్నికల ప్రకంపనాలతో ప్రపంచమార్కెట్లన్నీ అతలాకుతలమవుతున్నాయి. దీనికి తోడు ఫెడ్ రేట్లను పెంచితే మరింత మార్కెట్లు క్షీణించే అవకాశాలుండేవని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే అమెరికా ఆర్థికవ్యవస్థ లాభపడిందని, ఉద్యోగాల వృద్ధి మాత్రం అలా స్థిరంగా ఉండిపోయిందని అమెరికా సెంట్రల్ బ్యాంకు రేట్ సెట్టింగ్ కమిటీ తెలిపింది. వారు నిర్దేశించిన ద్రవ్యోల్బణం 2 శాతం టార్గెట్ సాధించే దిశగా అమెరికా ఆర్థిక వ్యవస్థ పయనిస్తుందనే దానికి సంకేతంగా మరింత ఆశావాదం కావాలని పాలసీమేకర్స్ వ్యక్తంచేశారు. దీనికోసం మరికొన్ని రోజులు వేచిచూస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే మిడ్ డిసెంబర్లో జరిగే పాలసీ మీటింగ్‌లో రేట్లపెంపు ఉండొచ్చనే సంకేతాలను ఇచ్చారు. వడ్డీరేట్లను యథాతథంగా ఉంచుతున్నట్టు ఫెడరల్ రిజర్వు చేసిన ప్రకటనతో అమెరికా మార్కెట్లు కిందకి దిగజారాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ 52.32 పాయింట్లు, ఎస్ అండ్ పీ 500 ఇండెక్స్ 11.29 పాయింట్లు, నాస్డాక్ కాంపొజిట్ 40.60 పాయింట్లు నష్టపోయింది. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్నందున్న ఆ దేశ మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. -
ఉల్లి ధరలకు రెక్కలు