న్యూఢిల్లీ: ఆఫీసు అద్దెలు దేశవ్యాప్తంగా ఆరు ముఖ్య పట్టణాల్లో ఈ ఏడాది జూన్ త్రైమాసికంలో స్థిరంగా ఉన్నట్టు కొలియర్స్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలోని వివరాల ప్రకారం.. ఈ పట్టణాల్లో చదరపు అడుగు అద్దె సగటున రూ.95గా ఉంది. ఈ పట్టణాల్లో 32 శాతం అదనపు కార్యాలయ వసతి ఈ కాలంలో అందుబాటులోకి వచి్చంది. ఇక కార్యాలయ స్థలాల కోసం డిమాండ్ 2 శాతం పెరిగింది. హైదరాబాద్‌తో పాటు పుణె, బెంగళూరు, ముంబై, చెన్నై, ఢిల్లీ ఎన్‌సీఆర్ ప్రాంతాల వివరాలు ఈ నివేదికలో ఉన్నాయి. స్థూల ఆఫీసు స్పేస్ లీజు జూన్ క్వార్టర్‌లో క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలో పోలి్చచూసినప్పుడు, 2 శాతం పెరిగి 14.6 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది. టెక్నాలజీ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి లీజు కోసం డిమాండ్ పెరిగింది.
ఢిల్లీల్లో వృద్ధి
ఢిల్లీ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు 11 శాతం పెరిగి 3.1 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. కొత్తగా కార్యాలయ స్థలాల అందుబాటు. 43 శాతం పెరిగి 2.1 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ అద్దె చదరపు అడుగుకు రూ.94.20గా ఉంది. ముంబైలో ఆఫీస్ స్పేస్ లీజు 41 శాతం క్షీణించి 1.6 మిలియన్ చదరపు అడుగులకు పరిమితమైంది. నూతన సరఫరా 79 శాతం తగ్గి 0.2 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. కార్యాలయ అద్దె చదరపు అడుగుకు రూ.140.10గా నమోదైంది. పుణెలో లీజు పరిమాణం 1.7 మిలియన్ చదరపు అడులుగా ఉంటే, ఒక చదరపు అడుగు అద్దె రూ.76.70గా ఉంది. నూతర సరఫరా 52 శాతం పెరిగి 0.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది.
హైదరాబాద్‌లో డౌన్
హైదరాబాద్ మార్కెట్లో ఆఫీస్ స్పేస్ లీజు జూన్ త్రైమాసికంలో 22 శాతం క్షీణించి 1.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో లీజు పరిమాణం 1.9 మిలియన్ చదరపు అడుగులుగా ఉండడం గమనించొచ్చు. అయితే, కార్యాలయ స్థలాల నూతన సరఫరా క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 19 శాతం తగ్గి 3 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నెలవారీ కార్యాలయ వసతి అద్దె చదరపు అడుగుకు రూ.73.70గా ఉంది.
క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది రూ.73.60గా ఉండడం గమనార్హం. చెన్నై మార్కెట్లో అత్యధికంగా ఆఫీస్ స్పేస్ లీజు మూడు రెట్లు పెరిగి 3.3 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. ఇక్కడ కొత్త సరఫరా 2.4 మిలియన్ చదరపు అడుగులకు పెరిగింది. ఆఫీస్ అద్దె చదరపు అడుగుకు రూ.75.1గా ఉంది. బెంగళూరు మార్కెట్లో ఆఫీస్ అద్దె రూ.91.90గా నమోదైంది. ఆఫీస్ స్పేస్ లీజు పరిమాణం 22 శాతం తగ్గి 3.4 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. నూతన సరఫరా రెండింతలు పెరిగి 3.8 మిలియన్ చదరపు అడుగులకు చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment