మీది ఆండ్రాయిడ్ ఫోనా... జర భద్రం
న్యూఢిల్లీ: ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు వాడే వారు జాగ్రత్తగా ఉండాలంటా ? అదికూడా అలా ఇలా కాదు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 'ఓ ట్రోజన్' వైరస్... ఫోన్ నుంచి కీలక సమాచారాన్ని చోరీ చేసి... అంతటితో ఆగకుండా మొబైల్ ఫోన్లోని నంబర్లకు ఎస్ఎంఎస్ పంపుతుందంటా. ఇది అత్యంత ప్రమాదకరమైన వైరస్ అని నిపుణులు తెలుపుతున్నారు. 'ఓ ట్రోజన్' వైరస్‌ను ఆండ్రాయిడ్ ఎస్ఎంఎస్సెండ్గా గుర్తించామని... దీనికి మరో నాలుగు పేర్ల కూడా ఉన్నాయని చెప్పారు. ఈ వైరస్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్‌తో పని చేసే ఫోన్లను ఉపయోగించే వినియోగదారులను ఏమార్చి విధ్వంసానికి పాల్పడుతుందని తెలిపారు.
అదికాక ఈ వైరస్ చట్టబద్దమైన అనువర్తనాలను ఆధారంగా చేసుకుని వ్యాపించి ఫోన్లను దెబ్బతీస్తుందని వెల్లడించారు. ఈ వైరస్ ఒక్కసారి ఫోన్ వ్యవస్థలోకి వెళ్లాక.... జాబితాలోని నెంబర్లనకు సందేశాలను పంపుతుందని సీఈఆర్టీ - ఇన్ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించేవారు జర భద్రంగా ఉండాలని తెలిపింది.