Stella college
-
విజయవాడ : అదరహో.. మిస్ బ్లాక్ షో, ర్యాంప్ వాక్‌తో సందడి (ఫొటోలు)
-
ముత్యమంటి సొగసు
-
స్టెల్లాలో కల్చరల్ ఫెస్టివల్
-
30 మంది విద్యార్థినులకు ఒక్కసారిగా అస్వస్థత
సాక్షి, విజయవాడ: నగరంలోని ప్రముఖ మేరీ స్టెల్లా కళాశాలలో 30 మంది విద్యార్థినులు ఒకేసారి అస్వస్థతకు లోనవ్వటం కలకలం రేపుతోంది. గురువారం ఉదయంపూట సుమారు 30 మంది విద్యార్థినులు ఒక్కసారిగా అనారోగ్యం పాలవడంతో వారిని సెయింట్ ఆన్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ జరిగి ఉంటుందన్న అనుమానాన్ని కళాశాల యాజమాన్యం కొట్టిపారేసింది. వైరల్ ఫీవర్స్ వల్లే విద్యార్థినులు అస్వస్థతకు లోనయ్యారని కళాశాల యాజమాన్యం పేర్కొంది. ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ‘నిన్న రాత్రి 50 మంది స్టెల్లా కళాశాల విద్యార్థినులు వివిధ ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. అందులో 35 మందిని ఉదయానికల్లా పంపించేశాం. మిగతా 15 మంది ఇంకా కడుపు నొప్పితో బాధపడుతున్నారు. వారికి అన్ని టెస్ట్‌లు నిర్వహించాం. ఫుడ్ పాయిజన్ అని తేలలేదు. అయితే కలుషిత తాగునీటి వల్ల వాంతులు, విరేచననాలు, కడుపునొప్పితో బాధపడుతున్నారని భావిస్తున్నాం. అతికొద్దిమందికే గొంతునొప్పి, వైరల్ ఫీవర్స్ ఉన్నాయి. సాయంత్రం మరో పదిమంది విద్యార్థినులను డిశ్చార్జ్ చేస్తాం. ఎవరికి ఎటువంటి ప్రమాదం లేద’ని స్పష్టం చేశారు. -
విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలతో ఉండాలి
పటమట(విజయవాడ తూర్పు) : విద్యార్థులు ఉన్నతమైన ఆలోచనలుతో భవిష్యత్ ప్రణాళిక ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి విద్యార్థి లక్ష్య సాధనవైపు అడుగులు వేయాలని ప్రముఖ కరీంనగర్‌కు చెందిన ప్రతిమా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హెచ్‌వోడీ ఎల్ఎస్ఆర్ ప్రసాద్ అన్నారు. మంగళవారం నగరంలోని మారీస్స్టెల్లా కళాశాల ఇంగ్లీష్ విభాగం ఆ«ధ్వర్యంలో జాతీయస్థాయిలో జరిగే 'స్పార్క్‌లిట్–2కె17 కార్యక్రమం జరిగింది. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిత్వ వికాసంపై పట్టు సాధించాలని, సమాజంలో ఉన్న వివిధ రకాల వ్యక్తుల స్వభావాలు, ప్రవర్తలను గమనించాలని అన్నారు. విద్యార్థులు ప్రవర్తనను ప్రతి ఒక్కరూ గమనిస్తుంటారని, సమాజంలో ఉన్నతమైన స్థానం సాధించాలంటే వ్యక్తిత్వం కీలకమని అన్నారు. అనంతరం ఆయన వ్యక్తిత్వ నైపుణ్యంపై పలు వీడియోలు, పేపర్ ప్రజంటేషన్ను ప్రదర్శించి విద్యార్థులకు వివిధ అంశాలపై అవగాహన కల్పించారు. ఆయా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సిస్టర్ సిల్వ, ప్రిన్సిపాల్ సిస్టర్ రేఖ, ఆంగ్లవిభాగాధిపతి డాక్టర్ సంధా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు పాల్గోన్నారు. ఆకట్టుకున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో జరిగే ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు నిర్వహించిన పలు పోటీలు ఆసక్తికరంగా సాగాయి. వర్క్ ఆఫ్ ఫేత్ అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విద్యార్థుల్లో దాగున్న సృజనాత్మకతను వెలికితీసేలా సాగింది. భాషపై ఉన్న పట్టుత్వాని పరిక్షించేందుకు నిర్వహించిన లిటరసీ మేనియూ–క్విజ్ పోటీలు విద్యార్థుల భాషా ప్రావీణ్యాన్ని నిరూపించింది. సిల్వర్ టంగ్ పేరుతో నిర్వహించిన ఉచ్ఛారణపోటీలు విద్యార్థులకు వ్యాకరణపై ఉన్న ఆసక్తిని వివరించేలా సాగింది. విద్యార్థుల్లో నిఘూడంగా దాగిఉన్న కళాత్మక అంశాన్ని నిరూపించేలా సాగిన మినీ ధియోటర్–ఒన్ఆర్ట్ప్లే కార్యక్రమం ఆద్యాంతం ఆసక్తికరంగా సాగింది. చివరగా నిర్వహించిన చోర్పైప్– సంగీత ప్రదర్శన, రోలీక్లి–నృత్య ప్రదర్శన కార్యక్రమానికి హాజరైనవారిని ఉత్తేజపరిచింది. -
కృష్ణా యూనివర్సిటీ బాస్కెట్‌బాల్ జట్టు ఎంపిక
పటమట (ఆటోనగర్) : కృష్ణా విశ్వవిద్యాలయం బాస్కెట్ బాల్ జట్టు ఎంపికైంది. ఇటీవల యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల జట్ల మధ్య జరిగిన బాస్కెట్ బాల్ టోర్నీలో ప్రతిభచాటిన క్రీడాకారులతో యూనివర్సిటీ జట్టు ఎంపిక గురువారం మారిస్ స్టెల్లా కళాశాల ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఈ పోటీలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కుల్రేఖ ఆధ్వర్యంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా స్పోర్ట్స్ బోర్డు సెక్రటరీ నల్లూరు శ్రీనివాసరావు, గౌరవ అతిథిగా ఆల్ ఇండియా బాస్కెట్ బాల్ గోల్డ్ మెడలిస్ట్ జి.ఎస్.సి.బోసు హాజరయ్యారు. మ్యారీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో జరిగిన కృష్ణా విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల బాస్కెట్ బాల్ టోర్నమెంట్లో సిద్ధార్ధ మహిళా కళాశాల మొదటి స్థానం, మ్యారీస్ స్టెల్లా కళాశాల రెండో స్థానం, కేబీఎన్ కాలేజీ మూడవ స్థానం, నున్న విజయ కాలేజీ నాలుగో స్థానంలో నిలిచాయి. ఎంపికైన జట్టు సిద్ధార్థ మహిళా కళాశాల నుంచి ఎస్.కె.ఎస్తేరు రాణి, ఎస్.దివ్యవల్లి, వి.ఎల్.భవ్య, చంద్రలేఖ, తారాబాయి, మ్యారిస్ స్టెల్లా కళాశాల నుంచి రూబి అమూల్య, మౌనిక, నిహారిక, కె.భానుశ్రీ , కేబీఎన్ కాలేజీ నుంచి వాణి, కల్యాణి, నున్న విజయ కళాశాల నుంచి శ్రీలక్ష్మి ఎంపియ్యారు. సెలెక్షన్ కమిటీ సభ్యులుగా ఆంధ్రా లయోల కళాశాల ఫిజికల్ లెక్చరర్ జె.వి.ఎన్.ప్రసాద్, నూజివీడు డీఏఆర్ కళాశాల మహమ్మద్ అంజాద్ ఆలీ వ్యవహరించారు. -
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
-
భానుప్రీతి మృతి కేసులో కీలక సమాచారం
విజయవాడలోని మేరీ స్టెల్లా విద్యార్థిని భాను ప్రీతి అనుమానాస్పద మృతి కేసులో కీలక సమాచారం లభ్యమైంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడేనికి చెందిన భానుప్రీతి చేతి రాతతో ఉన్న మూడు పేర్లు, నాలుగు ఫోన్ నంబర్లు ఉన్న పేపర్ ఒకదాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది డస్ట్‌బిన్‌లో దొరికింది. అయితే రూంలో మరో ముగ్గురు కూడా ఉంటారు. దాంతో ఈ ఫోన్ నంబర్లున్న కాగితాన్ని భానుప్రీతే రాసిందా, మరెవరైనా రాశారా అనే విషయాన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, ఆ ఫోన్ నెంబర్లు ఎవరివన్న సమాచారాన్ని ఇంకా బయటపెట్టలేదు. ఆమె తన తెలుగు పుస్తకంలో రాసుకున్న ఒక వాక్యాన్ని కూడా పోలీసులు గుర్తించారు. వీటి ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక మరో వైపు మంగళవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో భానుప్రీతి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు. కాలేజి యాజమాన్యం, పోలీసులు దీన్ని ఆత్మహత్యగా చెబుతున్నా, తమ కూతురు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదని, ఇందులో ఏదో కుట్ర ఉందని ఆమె తండ్రి సుబ్బారావు అంటున్నారు. దీనిపై సీఐడీ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. -
కాలేజీ హాస్టల్లో విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ (పటమట): ఏపీలోని విజయవాడలో మారిస్‌స్టెల్లా కళాశాలలో ఇంటర్ చదువుతున్న ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం సమీపంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన దొమ్మేటి భానుప్రీతి (16) సోమవారం కళాశాల హాస్టల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. జంగారెడ్డిగూడేనికి చెందిన సుబ్బారావు తన రెండో కుమార్తె భానుప్రీతిని మొదటి సంవత్సరం ఇంటర్ ఎంపీసీలో చేర్పించి అక్కడే హాస్టల్లో ఉంచారు. అనారోగ్య కారణాలతో 20 రోజుల కిందట ఇంటికి వెళ్లిన ఆమె ఆదివారం రాత్రి హాస్టల్‌కు తిరిగివచ్చింది. సోమవారం యూనిట్ టెస్ట్‌ల్లో భాగంగా చివరి పరీక్ష జరుగుతుండగా హాజరుకాకుండా రూమ్‌లోనే ఉండిపోయింది. మధ్యాహ్నం తోటివిద్యార్థులతో కలసి భోజనం చేసిన తరువాత విద్యార్థులందరూ పరీక్ష రాసేందుకు వెళ్లారు. తిరిగి సాయంత్రం ఐదున్నర గంటలకు తిరిగొచ్చిన విద్యార్థులు తలుపు తట్టగా ఎంతకీ తీయకపోవడంతో పగులగొట్టి చూడగా భానుప్రీతి ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది. సమాచారం అందుకున్న మృతురాలి తల్లిదండ్రులు హాస్టల్‌కు చేరుకుని భోరున విలపించారు. అనారోగ్య కారణంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు హాస్టల్ నిర్వాహకులు, పోలీసులు చెబుతున్నారు. నా కుమార్తె పిరికిది కాదు ‘నా బిడ్డ పిరికిది కాదు.. ఎవరో కావాలని చేశారు. ఉరి వేసుకున్న ఫ్యానుకు, బెడ్‌కు మధ్య చాలా తేడా ఉంది. సోమవారం సాయంత్రం కళాశాల యాజమాన్యం ఫోన్ చేసి భానుప్రీతి ఉరేసుకుందని, వచ్చి తీసుకెళ్లమని ఫోన్ పెట్టేశారు. కళాశాల యాజమాన్యం వైఖరిపై అనుమానం ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. - డి.సుబ్బారావు, మృతురాలి తండ్రి -
స్టెల్లా కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
-
స్టెల్లా కాలేజీ విద్యార్థిని ఆత్మహత్య
విజయవాడ : విజయవాడ స్టెల్లా కళాశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం చదువుతున్న భానుప్రీతి సోమవారం హాస్టల్లోని తన గదిలో (రూం నెంబర్ 127) ఉరి వేసుకుంది. మృతురాలి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డి గూడెం. భానుప్రీతి ఇంటినుంచి ఆదివారమే హాస్టల్‌కు వచ్చింది. కాగా విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కళాశాల యాజమాన్యం సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.