Sticker
-
ఇంటింటికీ బాబు ఫొటో స్టిక్కర్లు
సాక్షి, అమరావతి: తమ వంద రోజుల పాలన గొప్పతనాలు అంటూ రాష్ట్రంలో టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం శుక్రవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనుంది. ఈనెల 20 నుంచి 26 వరకు వారం రోజులపాటు ‘ఇది మంచి ప్రభుత్వం’ అనే పేరుతో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది తమ పరిధిలోని ఇంటింటినీ సందర్శించి సీఎం చంద్రబాబు ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను ఇళ్ల తలుపులపై అంటించి.. ప్రభుత్వం అందజేసే కరపత్రాలను పంచిపెట్టాలని గ్రామ, వార్డు సచివాలయాల శాఖ డైరెక్టర్ శివప్రసాద్ బుధవారం రాత్రే అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీచేశారు.వారం రోజులపాటు జరగాల్సిన ఈ కార్యక్రమంపై గురువారం కూడా అన్ని జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం మెసేజ్‌లు పంపింది. ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల ఆధ్వర్యంలో ప్రజావేదికలు.. ఇక శుక్రవారం నుంచి మొదలుపెట్టే ఈ కార్యక్రమంలో సచివాలయాల సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రంలో పేర్కొన్న అంశాలను ప్రజలకు వివరించడంతో పాటు వారం రోజులపాటు అన్ని నియోజకవర్గాల్లో స్థానిక ఎమ్మెల్యే లేదా ఇన్చార్జి ఒక్కో మండలంలో రోజుకొక గ్రామంలో ప్రజావేదిక నిర్వహించాలి. కార్యక్రమాన్ని పర్యవేక్షించడానికి గ్రామ, మండల స్థాయిలో ప్రత్యేకాధికారులను నియమించుకోవాలని ప్రభుత్వం సూచించింది. గత ఐదేళ్లలో 39.30 లక్షల కుళాయిలు వైఎస్సార్సీపీ పాలనలో 2019–24 మధ్య రాష్ట్రంలో 39.30 లక్షల ఇళ్లకు కొత్తగా నీటి కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్ పథకం అమలుపై సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌తో కలిసి గురువారం సమీక్షించారు. అధికారులు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో 95.44 లక్షల ఇళ్లు ఉండగా.. 2019 ఆగస్టుకు ముందే 31.68 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఉన్నాయని చెప్పారు. ఇంకా 28 లక్షల ఇళ్లకు ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. రానున్న మూడేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరు అందించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని చెప్పారు. జల్ జీవన్ మిషన్ పథకాన్ని ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కేరళతో పాటు పలు రాష్ట్రాలు బాగా వినియోగించుకున్నాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ అలసత్వం కారణంగా రాష్ట్రంలో పనులు ముందుకు సాగలేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు పడాలన్నారు. తప్పులు సరిదిద్ది కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తామని, 28 లక్షల ఇళ్లకు కుళాయి కనెక్షన్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం కోరారు. -
ప్రతి ఇంటా విశ్వాసం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం ఆరవ రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసించారు. 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్ని వర్గాల ప్రజలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ తాము పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం వైఎస్ జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్’ అని నినదించారు. మళ్లీ వైఎస్ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు. ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్ కాల్స్ ఇచ్చారు. సీఎం వైఎస్ జగన్ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్ ఫోన్లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకున్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఐదో రోజు ముగిసేటప్పటికి అంటే మంగళవారానికి వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 37 లక్షల కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు 82960 82960 మిస్డ్ కాల్స్ ఇచ్చారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతుండటం సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు దర్పణంగా నిలుస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షాలు సంప్రదాయక ఓటర్లుగా భావించే కుటుంబాల నుంచి కూడా వైఎస్ జగన్ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుండటం విశేషం. -
నా కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగొద్దు: కేశినేని చిన్ని
సాక్షి,న్యూఢిల్లీ/మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): రాజకీయ స్వప్రయోజనాల కోసం తన కుటుంబసభ్యుల పేర్లను వివాదంలోకి లాగవద్దని టీడీపీ ఎంపీ కేశినేని నానికి ఆయన సోదరుడు, టీడీపీ నేత కేశినేని చిన్ని సూచించారు. బుధవారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. తన కారుకు ఎంపీ స్టిక్కర్‌ను ఉపయోగిస్తున్నానంటూ పోలీసులకు కేశినేని నాని చేసిన ఫిర్యాదులో వాస్తవం లేదన్నారు. కారుకు ఆయన స్టిక్కర్‌ను అంటించుకుని దందా చేస్తే వెంటనే బహిర్గతం అయ్యేదని, తాను వ్యాపారులెవ్వరినీ బెదిరించలేదని చెప్పారు. వ్యాపారులను బెదిరిస్తే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చు కదా.. ఇప్పుడు ఎందుకు ఫిర్యాదు చేశారంటూ కేశినేని నానిని ప్రశ్నించారు. ఆయన్ని శత్రువుగా కాకుండా.. సొంత అన్నగానే భావిస్తున్నానని చెప్పారు. నాని చేసిన ఫిర్యాదు వ్యక్తిగతమైనదే తప్ప.. రాజకీయపరమైనది కాదన్నారు. దీనిపై పోలీసుల విచారణ ముగిసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. స్టిక్కర్‌ను ఫోర్జరీ చేశారు: ఎంపీ కేశినేని నాని విజయవాడ ఎంపీగా తనకు మంజూరు చేసిన కారు స్టిక్కరును ఫోర్జరీ చేసి టీఎస్ 07 హెచ్‌డబ్ల్యూ 7777 రిజిస్ట్రేషన్ ఉన్న కారుకు వినియోగిస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ అంశాన్ని కేంద్ర హోం శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. బుధవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. కారు స్టిక్కరును ఫోర్జరీ చేసిన సంగతి 2 నెలల క్రితం తన దృష్టికి వచ్చిందని.. వెంటనే లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. దీన్ని భద్రతాపరమైన అంశంగా పరిగణించాలన్నారు. -
వాట్సాప్‌లో వినూత్నంగా దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా!
దీపావళి పండుగ వచ్చిందంటేనే మన అందరిలో ఒక రకమైన ఉత్సాహం కనిపిస్తుంది. దీపావళి అంటేనే మన జీవితాల్లో వెలుగులు నింపే పండుగ. ఈ దీపావళి రోజున మన సంతోషాన్ని స్నేహితులు, కుటుంబసభ్యులతో శుభాకాంక్షలు తెలపడం ద్వారా పంచుకోవాలని భావిస్తూ ఉంటాం. మరి ఎప్పటిలాగానే దీపావళి శుభాకాంక్షలు టైపు చేసి తెలిపితే కిక్ ఏముంటుంది? అందుకే వాట్సాప్‌లో వినూత్నంగా స్టిక్కర్ల ద్వారా శుభాకాంక్షలు తెలపండి. వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్తగా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ ప్యాక్ ప్రవేశపెట్టింది. ఈ స్టిక్కర్ మీ మిత్రులకు, బందువులకు శుభాకాంక్షలు తెలపండి. ఎలా 'హ్యాపీ దీపావళి' స్టిక్కర్ పంపించాలని ఆలోచిస్తున్నారా?. ఈ కింద చెప్పిన విధంగా చేయండి. దీపావళి శుభాకాంక్షలు చెప్పండిలా! మొదట ఎవరికి మెసేజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ల చాట్ ఓపెన్ చేసి కీబోర్డ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు చాట్ బార్ లోని స్మైలీ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎమోజీ బోర్డు దిగువ నుంచి స్టిక్కర్ ఐకాన్ ఎంచుకోండి. తర్వాత 'ప్లస్' ఐకాన్ మీద నొక్కండి. హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ కోసం సర్చ్ చేయండి. మీకు కనబడకపోతే ఈ లింకు ద్వారా హ్యాపీ దీపావళి స్టిక్కర్ ప్యాక్ డౌన్ లోడ్ మీద క్లిక్ చేయండి. స్టిక్కర్ ప్యాక్ ఇప్పుడు మీ స్టిక్కర్ బోర్డులో చూపిస్తుంది. ఇప్పుడు మీరు మీకు నచ్చినవారికి "హ్యాపీ దీపావళి" స్టిక్కర్ పంపించవచ్చు. (చదవండి: జోరందుకున్న హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు) -
ఆరోగ్య వివరాలు ఇచ్చే సూపర్ స్టిక్కర్!
ఆరోగ్యంగా ఉన్న వారికి పెద్దగా సమస్యల్లేవుగానీ... రోజూ బీపీ, గ్లూకోజ్, హార్ట్‌రేట్ వంటివి పరీక్షించుకోవాలనే వారికి మాత్రం బోలెడన్ని ఇబ్బందులు. సూదితో పొడుచుకుని రక్తంలో చక్కెర ఎంత ఉందో తెలుసుకోవాలి. బీపీ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ సమస్యలేవీ లేకుండా చేసేందుకు స్టాన్‌ఫర్డ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఓ వినూత్నమైన పరికరాన్ని అభివృద్ధి చేశారు. ఫొటోలో కనిపిస్తున్న స్టిక్కర్‌ను చర్మానికి అతికించుకుంటే చాలు.. మన ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. గుండె కొట్టుకునే తీరుకు, ఉఛ్ఛ్వాస, నిశ్వాసలకు అనుగుణంగా మన చర్మంపైభాగం సంకోచ వ్యాకోచాలకు గురవుతుందన్నది మనకు తెలుసు. ఈ అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ స్టిక్కర్ పనిచేస్తుంది. కీళ్ల వద్ద అతికించుకుంటే కాలి కదలికలను గుర్తించి సమస్యలను ఏకరవు పెడుతుంది. బాడీ నెట్ అని పిలుస్తున్న ఈ సరికొత్త పరికరాన్ని ఉష్ణోగ్రత, ఒత్తిడి వంటి వివరాలను సేకరించేందుకు వాడుకోవచ్చునని గుండె పరిస్థితిని, నిద్రలోపాలను గుర్తించేందుకూ వాడుకోవచ్చునని అంటున్నారు జెనాన్ బావ్ అనే శాస్త్రవేత్త. ఈ స్టిక్కర్లను స్మార్ట్ వస్త్రాలతో కలిపి వాడుకునేలా చేయాలన్నది తన లక్ష్యమని.. తద్వారా స్మార్ట్ఫోన్లు, ఫిట్నెస్ గాడ్జెట్ల కంటే కచ్చితమైన సమాచారం సేకరించగలమని వివరించారు. పరిశోధన వివరాలు నేచర్ ఎలక్ట్రానిక్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
జీఎస్టీ కొత్త రీటైల్ ధరలను పత్రికల్లో ప్రకటిస్తాం
న్యూఢిల్లీ: రెవెన్యూ సెక్రటరీ హస్ముక్ ఆదియా,ఇతర సీబీఈసీ అధికారులు న్యూఢిల్లీలో మంగళవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎస్టీ అమలుకు సంబంధించిన పలు అంశాలను మీడియాకు వివరించారు. జమ్ము కశ్మీర్ తప్ప మిగతారాష్ట్రాలన్నీ జీఎస్టీకి ఆమోదం తెలిపినట్టు రెవిన్యూ కార్యదర్శి హస్ముక్ ఆదియా ప్రకటించారు. ముఖ్యంగా జీఎస్టీఎన్లో సుమారు 2 లక్షల క్రొత్త రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని చెప్పారు. వీటిల్లో 39వేలు ఇప్పటికే ఆమోదం పొందాయన్నారు. రానున్న మూడు రోజుల్లో మిగిలినవాటిని కూడా ఆమోదించినున్నట్టు చెప్పారు. పరిస్థితిని ఎప్పటికపుడు కేంద్రప్రభుత్వం మానిటర్ చేస్తోందని చెప్పారు. జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటినుంచీ ఇప్పటివరకూ ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాలేదని చెప్పారు. ఫిర్యాదులు, సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో ఫీడ్ బ్యాక్ అండ్ యాక్షన్ రూంను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. సోమవారం క్యాబినెట్ సెక్రటరీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఒక కమిటి నియమించినట్టు తెలిపారు. వివిధ డిపార్ట్మెంట్లలో సెక్రటరీలు ఇందులో సభ్యులుగా ఉంటారు. టాప్ కార్యదర్శులతో కూడిన 15మందితో సెంట్రల్ పర్యవేక్షణ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఒక్కో అధికారికి నాలుగు, అయిదు జిల్లాల బాధ్యతలను అప్పగించామని చెప్పారు. ప్రతి మంగళవారం భేటీ ఉంటుందని తెలిపారు. తద్వారా వివిధ జిల్లాలనుంచి జీఎస్టీపై అమలు తీరుపై ఫీడ్ బ్యాక్ తీసుకొని సమీక్షించనున్నునట్టు చెప్పారు. 20 లక్షల లోపు పన్నులు పరిస్థితి, బిల్లులు ఎలా యిస్తారనే దానిపై అనేక ప్రశ్నలు తమకెదురైనట్టు చెప్పారు. వీటికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. అలాగే త్వరలోనే ఏ ఏ వస్తువుపై జీఎస్టీకి ముందు, అమలు తర్వాతి ధరలను స్పష్టంగా వివరించ నున్నట్టు తెలిపారు. ధరల మార్పు, సవరించిన ధర పాత ధర వివరాలను తయారీదారులు వార్తాపత్రికల్లో ప్రకటించాలని స్పష్టం చేశారు. టోల్, మండి చార్జీలు, రాష్ట్రాలకు వాహనాల ఎంట్రీపై ఫీజు కొనసాగుతుందనీ,అయితే సరుకులపై ఎంట్రీ పన్నుపై ఎటువంటి లెవీ ఉండదని తెలిపారు. రెవిన్యూ సీసీజీఎస్టీ అమలు తీరుపై వివిధ అంశాలపై డీడీ లైవ్ లో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తామని ప్రకటించారు. మీడియాకోసం, వ్యాపారస్తులు, ఇతర ప్రజల కోసం 6రోజుల పాటు దూదర్శన్‌లో ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఉంటుందని చెప్పారు. మొదటి మూడురోజులు హిందీలో, తరువాత ఆంగ్లంలోఉంటుందనీ, ఈ కార్యక్రమానికి ప్రశ్నలను ముందుగానే పంపవచ్చని చెప్పారు. -
స్టిక్ ఫ్రేమ్స్
ఎవరి ఇంటికి వెళ్లినా.. ఎదురుగా కనిపించేది ఫొటో ఫ్రేమే. దేవుడిదో.. తాతయ్యదో.. బామ్మదో.. ఎవరెవరి ఫొటోలో గోడకు వేలాడుతూ పలకరిస్తాయి. ఓసారి ఇల్లంతా కలయ తిరిగితే లామినేటెడ్ ఫ్రేమ్ రూపంలో చిలిపి చిన్నారుల చిత్రాలు హాయ్ అంటాయి. జమానా బదల్ గయా.. అన్నింటా కొత్తందాలకు చోటిస్తున్న ఈ తరం.. ఫొటోలను కూడా వెరైటీగా పదిలపరుచుకోవాలని ఫిక్సవుతోంది. ఇలాంటి వారిని స్టిక్ ఫ్రేమ్స్ కట్టిపడేస్తున్నాయి. జ్ఞాపకాలను పది కాలాలు ఉంచేది ఫొటో. అందుకే తీపి గుర్తుల ప్రతిబింబాన్ని ఆల్బమ్‌లో దాచుకుంటాం. వుది దోచిన వుధుర క్షణాలను ఫ్రేమ్‌లలో బంధించి గోడలపై అలంకరించుకుంటాం. ఒక్కసారి ఫ్రేమ్ ఫిక్సరుుతే.. ఏళ్లకేళ్లు అలాగే ఉంటారుు. కొత్త ట్రెండ్స్ ఎన్ని వచ్చినా.. పాత ఫ్రేమ్‌ను అలాగే గోడకు వేలాడుతూనే ఉంటుంది. ఇప్పుడా చింత లేదు. మీ అందమైన ఫొటోలకు పొందికైన రూపాన్నిస్తుంది ఫ్రేమ్ స్టిక్కర్స్. డిఫరెంట్ స్టిక్కర్స్‌లో ఫొటోలను నగరవాసులు సరికొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. చెట్టు కొమ్మలకు రెమ్మలుగా ఫ్రేమ్స్ స్టిక్ చేసి ఫ్యామిలీ మెమరీస్‌ను ఇంపుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఉడెన్, ఐరన్, ప్లాస్టిక్, గ్లాస్ ఫొటో ఫ్రేమ్‌లతో పోల్చుకుంటే వీటి ఖరీదు తక్కువే. అతికిస్తే సరి : వేరు వేరు సైజుల్లో ఉండే ఈ స్టిక్కర్ ఫ్రేమ్‌ల మధ్యలో ఖాళీ ఉండి, వెనుక భాగమంతా జిగురు ఉంటుంది. కావాల్సిన ఫొటోను ఈ స్టిక్కర్ల వెనుక వైపు మధ్యలో పెట్టి నొక్కితేఅది స్టిక్కర్‌కి అతుక్కుపోతుంది. ఆ తరువాత ఈ ఫ్రేమ్‌ని నచ్చిన చోట గోడకు అతికిస్తే సరి. డిఫరెంట్ కలర్స్, థీమ్స్‌తో అందుబాటులో ఉన్న స్టిక్కర్ ఫ్రేమ్స్ సిటీ వాసులకు బాగా కనెక్ట్ అవుతున్నారుు. పైగా, ఈ ఫ్రేమ్‌లను ఎన్ని సార్లరుునా తీసి కావల్సిన చోట మళ్లీ అతికించుకోవచ్చు. మేకులతో గోడలు పాడవుతాయునే దిగులూ ఉండదు. ఈ ఫొటో ఫ్రేమ్స్ ఫర్నిషింగ్, వాల్ డెకార్ స్టోర్స్‌లో, ఫ్యాబ్ ఫర్నిష్ ఆన్లైన్ స్టోర్లలో లభిస్తున్నారుు. - విజయారెడ్డి -
మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళిక
సైబరాబాద్ సీపీ ఆనంద్ వెల్లడి ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఆవిష్కరణ సైబరాబాద్, న్యూస్‌లైన్: మహిళల భద్రత కోసం పంచసూత్ర ప్రణాళికను అమలు చేస్తున్నట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. కమిషనరేట్ ఆవరణలో శుక్రవారం ఆయన ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్‘ స్టిక్కర్‌ను ఆవిష్కరించారు. అనంతరం ఆనంద్ మాట్లాడుతూ...అభయ ఘటన అనంతరం అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సైబరాబాద్ పరిధిలో తిరిగే క్యాబ్‌ల యజమానులు, డ్రైవర్లు తమ పూర్తి వివరాలను పోలీసుల వద్ద నమోదు చేసుకోవాలని మార్చి 1న నోటిఫికేషన్‌ను జారీ చేశామన్నారు. దీనికి స్పందించి 2 వేల మంది తమ వివరాలను పొందుపర్చుకున్నారని, వీరందరికీ ‘మై వెహికిల్ ఈస్ సేఫ్’ స్టిక్కర్ అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జాయింట్ సీపీ గంగాధర్, ట్రాఫిక్ డీసీపీ అవినాష్ మహంతి, సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి పీఎస్‌కె వర్మ పాల్గొన్నారు. నమోదు చేసుకోని వారికి జరిమానా... కమిషనరేట్ పరిధిలో 10 వేల క్యాబ్‌ల వరకు తిరుగుతున్నట్టు గుర్తించామని, వీటిలో 2 వేల మంది మాత్రమే తమ వివరాలు పోలీసుల వద్ద నమోదు చేసుకున్నారని కమిషనర్ ఆనంద్ తెలిపారు. రిజిస్ట్రేషన్ గడువు మే 1తో ముగిసిందని, వివరాలు నమోదు చేసుకొని క్యాబ్‌లకు రూ. 500 జరిమానా విధిస్తామన్నారు. సోమవారం నుంచి శనివారం వరకు.. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య కూకట్పల్లి ట్రాఫిక్ ఠాణాలో క్యాబ్ డ్రైవర్లు తమ వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. స్టిక్కర్లో పూర్తి వివరాలు.... సైబరాబాద్ పోలీసులు జారీ చేస్తున్న ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్లో క్యూ ఆర్ కోడ్ (క్విక్ రె స్పాన్స్ కోడ్). అందులో క్యాబ్ యజమాని, డ్రైవర్ వివరాలు, క్యాబ్‌కు సంబంధించిన పత్రాల పూర్తి వివరాలు ఉంటాయి. స్టిక్కర్‌పై వాహనం, దానికి కేటాయించిన ఐడీ నెంబర్లను పెద్ద అక్షరాల్లో ప్రింట్ చేశారు. ఈ స్టిక్కర్ల గడువు ఏడాది ఉంటుంది. ఆపై రెన్యూవెల్ చేసుకోవాలి. స్టికర్ ఉన్న వాహనాల్లోనే ప్రయాణించాలి... సైబరాబాద్ పరిధిలో క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలు, యువతులు, ఐటీ ఉద్యోగినిలు ‘మై వెహికిల్ ఈజ్ సేఫ్’ స్టిక్కర్ ఉన్న వాటిలోనే వెళ్లాలని కమిషనర్ కోరారు. క్యాబ్ ఎక్కే ముందు స్టిక్కర్‌పై ఉన్న వివరాలు తప్పనిసరిగా రాసి పెట్టుకోవాలన్నారు. కాగా, ఓ క్యాబ్ డ్రైవర్- ‘సార్....మేం తప్పు చేస్తే యాక్షన్ తీసుకుంటున్నారు సరే....మమ్మల్ని క్యాబ్‌లో ఎక్కిన ప్రయాణికులు వేధిస్తే ఏం చేయాలని అని ప్రశ్నించాడు. దీంతో ఒక్కసారిగా అందరూ నవ్వారు. ఫిర్యాదు చేస్తే ఆ ప్రయాణికుడిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్ బదులిచ్చారు.