store clerk
-
రిచర్డ్ మూర్కు మరణశిక్ష అమలు
కొలంబియా: స్టోర్ క్లర్క్‌ను కాల్చి చంపిన 1999నాటి కేసులో నల్ల జాతీయుడు రిచర్డ్ మూర్(59)కు సౌత్ కరోలినా జైలు అధికారులు శుక్రవారం మరణ శిక్ష అమలు చేశారు. అతడికి క్షమాభిక్ష ప్రసాదించిన శిక్షను జీవిత కారాగారంగా మార్చాలంటూ కేసును విచారించిన ముగ్గురు జ్యూరర్లు, ఒక జడ్జితోపాటు పాస్టర్లు, జైలు మాజీ డైరెక్టర్, మూర్ కుటుంబం చేసిన వినతిని గవర్నర్ హెన్రీ మెక్‌మాస్టర్ తోసిపుచ్చారు. దీంతో, జైలు అధికారులు శుక్రవారం సాయంత్రం రిచర్డ్ మూర్కు విషం ఇంజెక్షన్ ఇచ్చి శిక్షను అమలు చేశారు. 1999 సెపె్టంబర్లో స్పార్టన్బర్గ్లోని ఓ రిటైల్ స్టోర్‌కు వెళ్లిన మూర్‌ను జేమ్స్ మహోనీ అనే వ్యక్తి తుపాకీతో కాల్చాడు. చేతికి గాయం కాగా వెంటనే స్పందించిన మూర్ అతడి మరో చేతిలోని తుపాకీని లాక్కుని ఛాతీపై కాల్చడంతో మహోనీ అక్కడికక్కడే చనిపోయాడు. కేసు విచారణ చేపట్టిన కోర్టు.. ఘటన సమయంలో మూర్ డ్రగ్స్ ప్రభావంతో ఉన్నాడని పేర్కొంటూ మరణ శిక్ష విధించింది. అయితే, మూర్ నేర చరితుడు కాడని, జైలులో ఉన్న సమయంలో స్రత్పవర్తనతో మెలిగినట్లు తోటి ఖైదీలు తెలిపారంటూ అతడి తరఫు లాయర్లు గవర్నర్ మెక్ మాస్టర్‌కు తెలిపారు. అటువంటి వ్యక్తి మరణశిక్ష బదులుగా క్షమాభిక్ష ప్రసాదించాలని, పెరోల్‌కు అవకాశం లేని జీవిత ఖైదుగా మార్చాలని విజ్ఞప్తి చేశారు. ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపిన మూర్కు మరణ శిక్ష విధించడం అన్యాయమని వాదించారు. మూర్ కేసును విధించిన జ్యూరీలో ఆఫ్రికన్ అమెరికన్లు ఒక్కరూ లేని జ్యూరీలో మరణ శిక్ష పడిన ఏకైక నల్లజాతీయుడు మూర్ అని వారు శుక్రవారం రాసిన లేఖలో గుర్తు చేశారు. అయినా క్షమాభిక్ష ఇచ్చేందుకు మెక్ మాస్టర్ నిరాకరించారు. మూర్ కుమారుడు, కుమార్తె ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తమ తండ్రి తమ జీవితాలపై ఎంతో సానుకూల ప్రభావం చూపారన్నారు. తండ్రి కోరిక మేరకే ఎయిర్ ఫోర్స్‌లో చేరానంటూ అలెగ్జాండ్రా మూర్ తెలిపింది. స్పెయిన్ మిలటరీ బేస్‌లోని తమ నివాసంలో ఫోన్ మోగినప్పుడల్లా ‘తాత ఫోన్ చేశాడా?’అంటూ తన ఐదేళ్ల కూతురు అడుగుతూ ఉంటుందని అలెగ్జాండ్రా అన్నారు. సౌత్ కరోలినాలో 50 ఏళ్ల క్రితం మరణ శిక్షను పునరుద్ధరించాక 45 మందికి ఆ శిక్షను విధించారు. ఇందులో ఒక్కరికి కూడా క్షమాభిక్ష ఇచి్చన దాఖలాలు లేవు. -
జార్జియాలో క్లర్క్ గా పనిచేస్తోన్న భారతీయుడి హత్య..
న్యూయార్క్: జార్జియాలోని రెన్స్ ఫుడ్ మార్ట్ లో గుమాస్తాగా పనిచేస్తోన్న భారతీయుడు మణిందర్ సింగ్ ను ఇద్దరు ఆగంతకులు కాల్చి చంపారు. 36 ఏళ్ల మణిందర్ సింగ్ అనే భారతీయుడు అగస్టాలోని రైసర్ రోడ్డులో ఉన్న రెన్స్ ఫుడ్ మార్ట్ లో పని చేస్తున్నాడు. నెలరోజుల క్రితమే మణిందర్ ఇక్కడ క్లర్క్ గా చేరాడు. అతడి భార్య, తల్లితో కలిసి అక్కడ దగ్గర్లోనే నివాసముంటున్నాడు. జూన్ 28న మణిందర్ యధావిధిగా ఫుడ్ మార్ట్ లో విధులు నిర్వర్తిస్తుండగా 15 ఏళ్ల వయసుండే ఇద్దరు టీనేజర్లు స్టోర్ లోకి తుపాకులతో వచ్చి మణిందర్ ను మొదట బెదిరించి దోచుకోవాలనుకున్నారు. కానీ మణిందర్ వారిని అడ్డుకోబోవడంతో వారిద్దరూ కాల్పులు జరిపారు. దీంతో మణిందర్ సింగ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానిక రెన్స్ పోలీసులు మాట్లాడుడుతూ.. హంతకులిద్దరి వయసు 15 ఏళ్ళు ఉంటుంది, పరిపక్వత లేని కారణంగా వారు మాస్కులు ధరించలేదు. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా వారిని చాలా తేలిగ్గా గుర్తించాము. ఒకతన్ని కేవలం నాలుగు గంటల్లోనే పట్టుకున్నామని రెండో వ్యక్తిని ఎనిమిది గంటల్లో పట్టుకుని జువైనల్ కోర్టులో హాజరుపరచినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా మణిందర్ సింగ్ మృతికి సంబంధించిన వార్త అమెరికాలోని భారతీయులకు దావానలంలా విస్తరించింది. మణిందర్ కుటుంబాన్ని ఆదుకునేందుకు వారు "గో ఫండ్ మి" ద్వారా ఫండ్ రైజ్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: స్పైడర్ మ్యాన్ ను పట్టుకొని చితక్కొట్టేశారు.. -
దటీజ్ .. భూమిక
ఓ దొంగోడు వచ్చి తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి బెదిరిస్తే.. ఎవరైనా ఏం చేస్తారు? భయపడతారు. ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు. దొంగ ఏది అడిగితే అది ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ ఓ భారతీయ మహిళ మాత్రం అలా భయపడలేదు. తుపాకీ చూసినా దొంగకు లొంగిపోలేదు. క్యాష్ బాక్స్ ఎత్తుకుపోవడానికి ప్రయత్నించిన అతడిపై అపర కాళికలా విరుచుకుపడింది. తుపాకీని పక్కకు తోసి ఆ కుర్ర దొంగను చితకబాదింది. అంతటితో ఆగకుండా చేతికందిన సుత్తితో రాణిరుద్రమ్మలా దాడికి యత్నించడంతో బెదిరిపోయిన దొంగ.. క్యాష్ బాక్స్ అక్కడే వదిలేసి కాళ్లకు బుద్ధి చెప్పాడు. ఈ ఘటన అమెరికాలోని కీస్విల్లేలో జరిగింది. కీస్వెల్లేలోని ఓ కిరాణా దుకాణంలో భూమిక పటేల్ అనే భారతీయ మహిళ క్యాషియర్‌గా పనిచేస్తోంది. 17 ఏళ్ల క్రిస్టియన్ డకోటా.. ఆమె పనిచేస్తున్న దుకాణంలో దొంగతనానికి యత్నించాడు. తుపాకీని పాయింట్ బ్లాక్‌లో పెట్టి డబ్బు ఇచ్చేయమంటూ బెదిరించాడు. కానీ భూమిక వాడిని బెంబేలెత్తించింది. ‘నన్ను కాలుస్తావా.. సరే కాల్చేయ్’ అంటూ ఎదురుదాడి చేసింది. తుపాకీని బేఖాతరు చేస్తూ చేతికందిన వస్తువుతో చితకబాదింది. వీరోచిత సాహసాన్ని ప్రదర్శించిన భూమిక పటేల్ ఇప్పుడు స్థానికంగా పెద్ద ఐకాన్ అయ్యారు. ఆమె గురించి స్థానిక మీడియా గొప్పగా కథనాలు ప్రచురిస్తోంది. ఆమె దొంగను చితకబాదిన సీసీటీవీ కెమెరా వీడియో ఫుటేజీని స్థానికులు ప్రత్యేకంగా వచ్చి తిలకిస్తున్నారు. ఆమె ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు.