the storm
-
కేరళను ముంచెత్తనున్న భారీ వర్షాలు!
తిరువనంతపురం: కేరళ రాష్ట్రాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తనున్నాయి. ఆగస్టులో సంభవించిన వరద విషాదం నుంచి ప్రజలు తేరుకోకమునుపే ఈ నెల 7న మరోసారి తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమయింది. భారత వాతావరణ విభాగం బులెటిన్ ప్రకారం..‘ఈనెల 6 కల్లా అరేబియా సముద్రంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయి. అది మరింతగా బలపడి తుఫానుగా మారి ఒమన్ తీరం వైపుగా సాగే అవకాశం ఉంది. దీని ప్రభావంతో కేరళలోని చాలా ప్రాంతాల్లో అతిభారీ, తీవ్ర భారీ వర్షాలు కురుస్తాయి. పొరుగునే ఉన్న కర్ణాటక, తమిళనాడు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరీలోనూ వానలు కురుస్తాయి’. ఈ నేపథ్యంలో కేరళ ప్రభుత్వం ఇడుక్కి, మలప్పురం జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. జలాశయాల పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని అధికారులకు ఆదేశాలిచ్చింది. త్రిస్సూర్, పలక్కడ్ జిల్లాల్లోని జలాశయాల్లో అదనంగా చేరిన నీటిని కిందికి వదిలేయాలని ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు తమిళనాడులో చెన్నై, పుదుచ్చేరిలోని చాలా ప్రాంతాల్లో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తోంది. తీవ్ర భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని తమిళనాడు ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని హెచ్చరించింది. కర్ణాటక ప్రభుత్వం దక్షిణ ప్రాంతంలోని 12 జిల్లాల అధికారులను అప్రమత్తం చేసింది. -
మరో 24గంటలు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీన పడిందని విశాఖ పట్టణం తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. అయినా.. రెండు కిలోమీటర్ల వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతూ ఉందని తెలిపింది. దీనివల్ల మరో 24 గంటల పాటు కోస్తాంధ్రలో వర్షాలు కురుస్తాయని, ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉదని పేర్కొంది. కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. మత్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. -
అమావాస్య చీకట్లే
ఈసారి దీపావళి లేనట్టే.. బాణసంచా విక్రయాలపై నిషేధం అప్రమత్తం కాకుంటే మరో ‘అగ్ని’తుపాను విరిగిన చెట్లతో పొంచిఉన్న పెనుముప్పు విశాఖ రూరల్: దీపావళి ఆనందాన్ని హుదూద్ దూరం చేసింది. అంతేకాదు మేలుకోకపోతే మరింత ప్రమాదం పొంచి ఉంది. తుపాను వల్ల ఎక్కడ చూసిన మోడు వారిన చెట్లు, ఎండిన మానులుదర్శనమిస్తున్నాయి. ఏ చిన్న నిప్పు వీటికి అంటుకుంటే భారీ మూల్యం చెల్లించుకోవల్సి ఉంటుంది. తుపానుకు మించిన నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. బాణా సంచాకు దూరంగా ఉండాలని ముఖ్యమంత్రి కూడా స్పష్టం చేశారు. బాణసంచా అమ్మకాలను సైతం నిషేదించారు. తొలిసారిగా దీపావళికి దూరంగా ఉండాలంటూ ప్రభుత్వం ప్రకటించిం దంటే ఎంత ప్రమాదం పొంచి ఉందో అర్ధం చేసుకోవచ్చు. తుపాను ధాటికి జిల్లాలో చెట్లన్నీ నేలకొరిగాయి. ఆరు రోజులుగా వాటి తొలగింపు ప్రక్రియను చేపడుతున్నా కనీసం 50 శాతం కూడా పూర్తి కాలేదు. విశాఖ శివారులో ఉన్న డంపింగ్‌యార్డుకు ఇప్పటి వరకు 500 మెట్రిక్ టన్నుల వ్యర్ధాన్ని తరలించినప్పటికీ.. ఇంకా పదింతలు రోడ్లమీదే ఉంది. నిర్జీవ వృక్షాలకు ప్రూనింగ్ చేసిన నాలుగు సంవత్సరాలకు తిరిగి పచ్చదనంతో కళకళలాడుతాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బాణాసంచా కారణంగా ఏ చెట్టుకు నిప్పు అంటుకున్నా మంటలు దావానంలా వ్యాపిస్తాయి. నీటి కొరత నేపథ్యంలో వాటిని అదుపు చేయడంఅసాధ్యమైన పనే. ఈ నేపథ్యంలో జిల్లాలో బాణ సంచా అమ్మకాలపై నిషేదాజ్ఞలు విధించింది.