strecher
-
తీవ్ర గాయం.. స్ట్రెచర్‌పై వెస్టిండీస్ ప్లేయర్
వెస్టిండీస్ మహిళా సీనియర్ క్రికెటర్ స్టెఫానీ టేలర్ తీవ్రంగా గాయపడింది. మహిళల టి20 ప్రపంచకప్‌లో భాగంగా టీమిండియాతో మ్యాచ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయంలోకి వెళితే.. టీమిండియా ఇన్నింగ్స్ సమయంలో 8వ ఓవర్ రమ్హాక్రాక్ వేసింది. ఓవర్ ఆఖరి బంతిని హర్మన్‌ప్రీత్ కౌర్ షార్ట్‌ఫైన్ దిశగా ఆడింది. షార్ట్ఫైన్లోనే ఫీల్డింగ్ చేస్తున్న స్టెఫానీ టేలర్ బంతిని త్రో వేద్దామని ప్రయత్నించింది. అయితే పట్టు తప్పి జారిపడడంతో కాలు బెణికినట్లయింది. దీంతో మైదానంలో కూలబడింది. టేలర్ పైకి లేవడానికి ఇబ్బంది పడడంతో వెంటనే మెడికల్ సిబ్బంది స్ట్రెచర్‌పై ఆమెను గ్రౌండ్ నుంచి బయటకు తీసుకెళ్లారు. ఈ సమయంలో ఆటకు కాసేపు విరామం ఇచ్చారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే మహిళల టి20 ప్రపంచకప్‌లో టీమిండియా మరో విజయం నమోదు చేసింది. బుధవారం గ్రూప్-బిలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 119 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా మరో 11 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్‌ను అందుకుంది. రిచా ఘోష్ 44 నాటౌట్, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (33) జట్టునువ విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం నమోదు చేయగా.. విండీస్‌కు ఇది రెండో పరాజయం. చదవండి: చరిత్ర సృష్టించిన దీప్తి శర్మ.. టీమిండియా తొలి బౌలర్‌గా -
ట్రాలీల్లేక తిప్పలు!
సోమాజిగూడ: చేవెళ్లకు చెందిన కిషన్ అనే యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక ఆసుపత్రిలో చికిత్సనందించిన అనంతరం కుటుంబసభ్యులు బుధవారం నిమ్స్‌కు తీసుకొచ్చారు. అయితే ట్రాలీలు లేని కారణంగా అతడు దాదాపు గంటన్నర అంబులెన్స్‌లోనే ఉండాల్సి వచ్చింది. అక్కడి వైద్యులకు ఎంత మొరపెట్టుకున్నా ‘ట్రాలీలు ఖాళీ అయ్యే వరకు ఉండండి. లేని పక్షంలో వెళ్లిపోండంటూ’ చెప్పారు. దీంతో ఏం చేయాలో తెలియక మిన్నకుండిపోయారు. ఇటాంటి సంఘటనలు నిమ్స్ అత్యవసర విభాగం వద్ద నిత్యం జరుగుతూనే ఉంటాయి. అయినా ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడనే కాదు నిమ్స్‌లో నిత్యం ఏదో ఒక సమస్య వేధిస్తూనే ఉంది. నిన్నటి వరకు నీటి కొరతతో సర్జరీలు నిలిపివేసిన విషయం విదితమే. ఇక ఇప్పుడు ట్రాలీలు సరిపడా లేక రోగికి నిమ్స్ అత్యవసర సర్వీసు విభాగంలో అడ్మిషన్ దొరకడం లేదు. గతరెండు రోజులుగా నిమ్స్ అత్యవసర విభాగానికి రోగుల తాకిడి పెరిగింది. దూరప్రాంతాల నుంచి ఇక్కడికి చికిత్సకు వచ్చిన రోగులు గంటల తరబడి వారు వచ్చిన వాహనంలోనే ఉండాల్సి వస్తోంది. సకాలంలో రోగికి వైద్యం అందకపోవడంతో బంధువులు వైద్యులతో ఘర్షణకు దిగుతున్నారు. ఎంతో ప్రఖ్యాతి గాంచిన నిమ్స్ ఆసుపత్రిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమవుతోంది. దీనికి కారణం ఉన్నతస్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడమేనని తెలుస్తోంది. 30 ట్రాలీలు ఫుల్... ఎవరైనా ఆత్మహత్మలకు పాల్పడినా, ప్రమాదానికి గురైనా మరేదైనా సంఘటనలో తీవ్రంగా గాయపడిన వారికి స్థానిక ఆస్పత్రుల్లో చికిత్స అందించి నిమ్స్‌కు తీసుకొస్తారు. అలా వచ్చిన వారంతా అత్యవసర విభాగంలో అడ్మిషన్ పొందుతారు. అడ్మిషన్ పొందిన రోగి సుమారు 10 రోజులు ట్రాలీపైనే ఉంటున్నాడు. ముందుగా అడ్మిషన్ పొందిన రోగి డిశ్చార్జ్ కాకపోవడంతో ఈ సమస్య తెలెత్తుతోంది. అత్యవసర విభాగానికి వచ్చిన రోగిని ట్రాలీలపై లోపలకు తీసుకెళ్తారు. సంబంధిత రోగిని ట్రాలీపైనే ఉంచి వైద్యం అందిస్తారు. అప్పటికే అక్కడ బెడ్‌పై చికిత్స పొందుతున్న రోగి డిశ్చార్జ్ అయితేనే ట్రాలీ నుంచి బెడ్డుకు మార్చుతారు. ఇతర ఆసుపత్రుల నుంచి వచ్చిన రోగులు ఎక్కువ రోజులు చికిత్స పొందడం, ఉన్న బెడ్స్, ట్రాలీలు ఖాళీ కాకపోవడంతో కొత్తగా వస్తున్న వారికి ఇబ్బందులు తప్పడం లేదు. అత్యవసర విభాగానికి రోజుకు సుమారు 30 మంది రోగులు వస్తుంటారు. అయితే మంగళవారం అత్యవసర సర్వీసు విభాగానికి వివిధ కారణాలతో సుమారు 50 మంది రోగులు వచ్చారు. దాంతో అక్కడనున్న ట్రాలీలు సరిపోకపోవడంతో మరో 20 ట్రాలీలను ఓపీ నుంచి తీసుకొచ్చారు. -
స్ట్రెచర్‌పై నుంచే తాళి కట్టిన వేళ..!
వరంగల్, న్యూస్‌లైన్: అందమైన పెళ్లిపందిరి.. మేళతాళాలతో కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితుల మధ్య ఘనంగా పెళ్లి చేసుకోవాలనుకున్న ఆ వరుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరాడు. మంచంపై నుంచి లేవలేని దయనీయ పరిస్థితి అతనిది. అయినా ఆ పెళ్లి అనుకున్న ముహూర్తానికే జరిగి ఆనందాన్ని పంచుకున్న సంఘటన వరంగల్ జిల్లా ఉర్సు నాగమయ్య గుడిలో శనివారం జరిగింది. గూడూరు మండలం నాయక్‌పల్లికి చెందిన గోపిశెట్టి పెద్ద మల్లయ్య కుమారుడు శ్రీనివాస్‌కు నెల్లికుదురు మండలం రామన్నగూడెంకు చెందిన పుప్పాల లింగయ్య కుమార్తె సౌజన్యతో పెళ్లి కుదిరింది. శనివారం ఉదయం 8.30 గంటలకు ముహూర్తం పెట్టుకున్నారు. వివాహ పనుల్లో భాగంగా వరుడు శ్రీనివాస్ ఆహ్వాన పత్రికలు పంచేందుకు గతనెల 30న కేసముద్రం వెళ్లాడు. తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో అతని కాలు విరిగింది. శ్రీనివాస్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే శనివారం పెళ్లి ముహూర్తం సమయానికి శ్రీనివాస్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్సులో నేరుగా ఉర్సు సుభాష్‌నగర్ నాగమయ్యగుడి వద్దకు స్ట్రెచర్‌పై తీసుకొచ్చారు. స్ట్రెచర్పైనుండే వధువు సౌజన్య మెడలో తాళి కట్టాడు. వివాహం అనంతరం నూతన వధూవరులు అంబులెన్స్‌లో అస్పత్రికి వెళ్లారు.