ప్రొద్దుటూరులో భారీ వర్షం..
వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో శుక్రవారం రాత్రి నుంచి భారీ వర్షం కురుస్తుండడంతో వీధులన్నీ నీటమునిగాయి. వర్షం శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. వర్షంలోనే పారిశుద్ధ్య సిబ్బంది నాలాల్లో పూడికను తొలగిస్తున్నారు. మరోవైపు మండలంలోని మడూరు, కానపల్లె తదితర గ్రామాల్లో పంటలు పూర్తిగా నీటమునిగాయి. సుమారు 80 ఎకరాల్లో మినుము, పత్తిపంటలకు నష్టం వాటిల్లింది. పట్టణంలో 30 భారీ వృక్షాలు నేలకొరిగినట్లు అధికారులు తెలిపారు.