Strengthen activities
-
పెద్దలూ ఒళ్లువంచాల్సిందే..
లండన్ : దీర్ఘకాలం ఆరోగ్యంగా, చురుగ్గా ఉండాలంటే మధ్యవయస్కుల నుంచీ వృద్ధులూ ఓ మాదిరి కఠిన వ్యాయామాలు చేయాల్సిందేనని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. రోజుకు పదివేల అడుగులు నడవడం కూడా సరిపోదని పెద్దలు దృఢంగా, బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మరింత శ్రమించాల్సిందేనని పరిశోధకులు హెచ్చరించారు. పోల్ డ్యాన్స్, థైచీ, టెన్నిస్, క్రికెట్ వంటి ఆటలతో పాటు జిమ్‌లో బరువులు ఎత్తడం, భారీ బ్యాగ్‌లు మోయడం వంటి కఠిన వ్యాయామాలు చేపట్టాలని సూచించారు. పెద్దలు తమ శారీరక ఆరోగ్యానికి అవసరమైన స్ధాయిలో వ్యాయామం చేయడం లేదని పబ్లిక్ హెల్త్ ఇంగ్లండ్(పీహెచ్ఈ) పేర్కొంది. స్ర్తీ, పురుషులు వారానికి కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామంతో పాటు రెండు సెషన్స్ స్ర్టెంథ్ ట్రైనింగ్ చేపట్టాలని ప్రభుత్వ మార్గదర్శకాలను పలువురు విస్మరిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ తరహా వ్యాయామాలతో కండరాలు, ఎముకలు పటిష్టమై శరీరం మంచి సమతూకంతో ఉంటూ తరచూ పడిపోవడం, ఫ్రాక్చర్లు, వెన్ను నొప్పి, అకాల మరణం వంటి ముప్పులను నిరోధిస్తుందని పీహెచ్ఈ, ఛారిటీ ది సెంటర్ ఫర్ ఏజింగ్ బెటర్‌తో కలిసి నిర్వహించిన అథ్యయనంలో వెల్లడైంది. వేగంగా నడవడం వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు ప్రతి ఒక్కరూ వారానికి రెండు సార్లు బరువులు ఎత్తడం వంటి కఠిన వ్యాయామాలు చేయాలని పీహెచ్ఈకి చెందిన డాక్టర్ అలిసన్ టెడ్స్టోన్ సూచించారు. ముఖ్యంగా మహిళలు గర్భం దాల్చినప్పుడు, మొనోపాజ్ దశలో, పురుషులు పదవీవిరమణ అనంతరం ఈ తరహా వ్యాయామాలు చేయడం ద్వారా తదుపరి దశల్లో వారు చురుకుగా ఉంటారని చెప్పారు. -
ఇక గట్టి నిఘా
* బాలికల వసతిగృహాలలో భద్రత పెంపు * మొదటి దశగా గిరిజన హాస్టళ్లలో సీసీ కెమెరాలు * త్వరలోనే బీసీ, ఎస్సీ వసతి గృహాలలో అమలు * నివేదిక తయారు చేస్తున్న అధికారులు * త్వరలో బయోమెట్రిక్ మిషన్లు కూడా ఏర్పాటు * సిబ్బంది విధి నిర్వహణపైనా దృష్టి ఇందూరు : సంక్షేమ వసతి గృహాలలో బాలికల భద్రత కోసం పటిష్ట చర్యలు తీసుకోనున్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. బాలికలుండే వసతిగృహాలలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండాలనేది దీని ఉద్దేశం. అనుమతి లేకుండా ఎవరైనా లోనికి చొరబడితే సీసీ కెమెరాలు ఇట్టే పట్టేస్తాయి. వార్డెన్, వర్కర్ల పనితీరు, బాలికల హాజరు శాతాన్ని పరిశీలిస్తారు. మొదటి దశలో గిరిజన బాలికల వసతి గృహాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు జిల్లాలో ఎన్ని గిరిజన వసతి గృహాలున్నాయి.. అందులో బాలికల హాస్టళ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి.. వసతి గృహాలలో ఉంటున్న బాలికల సంఖ్య త దితర వివరాలు తెలుపాలని జిల్లా అధికారులకు సంబంధిత శాఖ కమిషరేట్ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో అధికారులు నివేదికను సిద్ధం చేస్తున్నారు. తనిఖీలు ఇక తేలిక జిల్లాలో మొత్తం 17 గిరిజన సంక్షేమ వసతి గృహా లున్నాయి. ఇందులో నాలుగు బాలికల వసతి గృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల వసతి గృహాలు ఐదు ఉ న్నాయి. వీటిలో బాలికలకు భద్రత కరువైందని, ఆగంతకులు చొరబడటంతో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వార్డెన్లు సక్రమంగా విధులకు వస్తున్నారా.. వర్కర్లు, బాలికలు ఏం చేస్తున్నారు.. ఎంత మంది ఉంటున్నారనే విషయాలను ఉన్నతాధికారులు తనిఖీలకు వెళ్లకుండా కార్యాలయం లోనే కూర్చుని పరిశీలించే అవకాశం ఉంటుంది. జిల్లాలో ఉన్న తొమ్మిది బాలికల వసతిగృహాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి జిల్లా అధికారుల కార్యాలయానికి అను సంధానం చేస్తా రు. ఈ నిఘా వ్యవస్థ ద్వారా బాలికలకు భద్రత పెరుగుతుంది. కొన్ని బాలికల వసతిగృహాలకు ప్రహరీలు నిర్మించకపోవడం మూలంగా రాత్రుల లో ఆ కతాయిల బెడద ఉంటుందని, దీంతో బాలి కలు భయం భయంగానే గడపాల్సి వస్తోందని పలువురు పేర్కొంటున్నారు. గిరిజన బాలికల వసతిగృహాల తర్వాత రెండో దశలో బీసీ, ఎస్సీ బాలికల వసతిగృహాలలోనూ సీసీ కెమెరాలు ఏర్పా టు చేసిన ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచి స్తోంది. బయోమెట్రిక్ మెషిన్లు ఇదిలా ఉండగా, జిల్లాలోని 67 ఎస్సీ, 60 బీసీ వసతి గృహాలలో విద్యార్థుల మెస్ బిల్లుల అక్రమాలను అరికట్టేందుకు బయోమెట్రిక్ మిషన్లు అందజేయనున్నట్లు రెం డు నెలల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. ఈ విధానాన్ని జిల్లాలోని 17 గిరిజన సంక్షేమ వసతిగృహాలలో కూడా అమలు చేసేం దుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు రాకున్నప్పటికీ హాజరు శాతం చూపించి వార్డెన్లు మెస్ బిల్లులను అక్రమంగా డ్రా చేసుకుంటున్నారనే అరోపణలు ముందునుంచి ఉన్నాయి. చాలా మం ది వార్డెన్లు దొరికిపోయారు కూడా. ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టేందుకు బయోమెట్రిక్ మెషిన్లు ఏర్పాటు చేయడానికి చర్యలు చేపడుతున్నారు. విద్యార్థులు హాస్టల్‌కు వెళ్లగానే ముందుగా మెషిన్ ద్వారా వేలి ముద్రలు ఇవ్వాలి, సాయంత్రం మరోసారి వేలి ముద్రలు ఇవ్వాలి. బయోమెట్రిక్ మెషిన్లో నమోదైన విద్యార్థుల సంఖ్య ఆధారంగానే సరుకులను వార్డెన్లు వాడాల్సి ఉంటుంది. బిల్లులు అదేవిధంగా విడుదల అవుతాయి.