Sub collecter
-
సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలు సీజ్!
వేలూరు: వేలూరులో రూ.50 వేలు లంచం తీసుకొంటూ పట్టుబడిన సబ్ కలెక్టర్ బ్యాంకు ఖాతాలను సీజ్ చేసేందుకు ఏసీబీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. తిరువణ్ణామలై జిల్లా పోలూరు సమీపంలోని ఇరుంబులి గ్రామానికి చెందిన రంజిత్‌కుమార్ పూరీ్వకుల ఆస్తులను తన పేరుపై మార్చుకొని పత్రాలు తీసుకునేందుకు సబ్‌కలెక్టర్ దినకరన్ సంప్రదించారు. ఆయన రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. వేలూరు ఏసీబీ అధికారులు వలపన్ని సబ్‌కలెక్టర్ దినకరన్‌తో పాటు ఆయన డ్రైవర్ సురేష్‌కుమార్‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. అనంతరం ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. ఆ సమయంలో సుమారు రూ.80 లక్షల నగదు పట్టుపడిన విషయం తెలిసిందే. కార్యాలయంలో ఆయనకు సహకరిస్తున్న 11 మంది ప్రభుత్వ ఉద్యోగులు, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. (లంచం డబ్బుతో సబ్‌కలెక్టర్ రాసలీలలు) వారి వద్ద విచారణ చేపట్టారు. విచారణలో సబ్ కలెక్టర్ దినకరన్ లంచాలు తీసుకుని అవినీతికి పాల్పడడంతో పాటు పలువురి మహిళలతో రాసలీలలు జరిపిన విషయం వెలుగులోకి వచ్చింది. ఆయనకు సంబంధించిన బ్యాంకు ఖాతాలను సీజ్ చేసి ఏయే బ్యాంకుల్లో ఎంత నగదు ఉంది, ఈ నగదు ఎక్కడ నుంచి వచ్చింది అనే కోణంలో విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఏసీబీ అధికారి మాట్లాడుతూ సబ్‌కలెక్టర్‌గా పనిచేసిన కాలంలో దినగరన్ పలు కోట్ల రూపాయలను బ్యాంకులో పొదుపు చేయడంతో పాటు అనేక చోట్ల ఆస్తులు కొనుగోలు చేసినట్లు విచారణలో తెలిసిందన్నారు. వెంటనే ఆయన బ్యాంక్ ఖాతాలను సీజ్ చేసి, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి.. అనే కోణంలోనూ విచారణ చేస్తున్నట్లు వివరించారు. -
మానవత్వం చాటిన గూడూరు సబ్‌కలెక్టర్
సాక్షి, నెల్లూరు: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి హైవే పక్కన నిస్సహాయ స్థితిలో పడిఉన్న ఓ మహిళను అదే మార్గంలో వస్తున్న గూడూరు సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ గమనించి తన వాహనంలో ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. ఈ ఘటన మనుబోలు మండల పరిధిలో శనివారం చోటు చేసుకుంది. వివరాలు..ఇందుకూరుపేటకు చెందిన ఇటుకల ప్రసన్న తన తమ్ముడు చందుతో కలిసి మోటార్‌బైక్‌పై గూడూరుకు బయలుదేరింది. ఈ క్రమంలో మనుబోలు పోలీస్‌స్టేషన్ సమీపంలో మోటారుసైకిల్‌పై వెనకగా కూర్చుని ఉన్న ప్రసన్న అదుపుతప్పి కింద పడిపోయింది. ఇది గమనించని సోదరుడు ముందుకు వెళ్లిపోయాడు. కొద్దిసేపటి తరువాత అదే మార్గంలో నెల్లూరు నుంచి గూడూరు వస్తున్న సబ్‌కలెక్టర్ గోపాలకృష్ణ హైవే పక్కన పడిపోయి ఉన్న ప్రసన్నని గమనించి వాహనం ఆపారు. గాయపడి అపస్మారక స్థితిలో ఉన్న ప్రసన్నను తన సిబ్బంది సాయంతో వాహనంలో మనుబోలు పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక చికిత్స చేశారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సబ్‌కలెక్టర్ నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి వెంటనే మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలించేలా చర్యలు తీసుకున్నారు. అంతకుముందే సమాచారం అందుకున్న తమ్ముడు పీహెచ్‌సీకి చేరుకుని అక్క వెంట వెళ్లాడు. కళ్ల ముందే ప్రమాదం జరిగినా మనకెందుకులే అని చేతులు దులుపుకొని వెళ్లే రోజుల్లో గాయపడిన మహిళను ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటుకున్న సబ్‌కలెక్టర్‌ను పలువురు అభినందించారు. -
‘ప్రజావాణి’కి దరఖాస్తుల వెల్లువ
బెల్లంపల్లి : పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి దరఖాస్తులు వెల్లువెత్తాయి. అసెంబ్లీ నియోజకవర్గంలోని మారు మూల గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సబ్ కలెక్టర్ రాహుల్‌రాజ్‌కు అర్జీలు అందజేశారు. అర్జీలను స్వీకరించిన సబ్ కలెక్టర్ సంబంధిత శాఖలకు బదలాయింపు చేశారు. మొత్తం 40 వరకూ అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. -
కేసీఆర్ కుటుంబానికే సంబరాలు
► మెట్పల్లి సబ్‌కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతుల ఆందోళన ► చక్కెర ఫ్యాక్టరీ తెరవాలని డిమాండ్ మెట్పల్లి(జగిత్యాల): తెలంగాణ ఆవిర్భావాన్ని పురస్కరించుకొని శుక్రవారం మెట్‌పల్లిలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద చెరుకు రైతులు నిరసన వ్యక్తం చేశారు. ముత్యంపేట చక్కెర ఫ్యాక్టరీని తెరవడంతో పాటు గత సీజన్‌కు సంబంధించిన రవాణా చార్జీలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ డివిజన్‌కు చెందిన రైతులు ఆర్టీసీ డిపో నుంచి ర్యాలీగా సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చెరుకు రైతుల సమస్యలపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదన్నారు. నిజాందక్కన్ చక్కెర ఫ్యాక్టరీలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఆ తర్వాత వాటిని మూసివేసి రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రాప్రాంతానికి చెందిన వ్యక్తి ఫ్యాక్టరీకి ప్రయోజనం కలిగించడానికే ఎన్‌డీసీఎల్ ఫ్యాక్టరీలు మూసివేశారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటుతో రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబం మాత్రమే సంతోషంగా ఉందని.. ప్రభుత్వ విధానాలతో ఉన్న ఫ్యాక్టరీలు మూతబడడంతో రైతాంగం తీవ్రంగా ఆందోళన చెందుతుందన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఆవిర్భావ వేడుకల పేరుతో సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. ఇకనైనా కేసీఆర్ మేల్కొని ఫ్యాక్టరీలు తెరవాలని.. లేకుంటే వచ్చే ఎన్నికల్లో ఓట్లతో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నా సందర్భంగా కేసీఆర్, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కార్యాలయ ఏవో సత్యనారాయణకు వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో చెరుకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు నారాయణరెడ్డి, సీడీసీ మాజీ చైర్మన్ కంది బుచ్చిరెడ్డితో పాటు రైతు సంఘం నాయకులు నల్ల గంగారెడ్డి, బాపురెడ్డి, లింగారెడ్డి, లింబారెడ్డి, మల్లారెడ్డి, ధర్మారెడ్డి, రాజేందర్ తదితరులు ఉన్నారు.