subdivision status
-
ఇక కుప్పం పోలీసు సబ్‌డివిజన్.. విడుదలైన రాజపత్రం
సాక్షి, పలమనేరు/కుప్పం: కుప్పం ఇక పోలీసు సబ్‌డివిజన్ కానుంది. ఆమేరకు కొత్తగా కుప్పం పోలీసు సబ్ డివిజన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.147 గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ సబ్ డివిజన్‌కు ఎస్పీడీఓ కార్యాలయం కుప్పంగా అందులో పేర్కొన్నారు. పలమనేరు పోలీసు సబ్‌డివిజన్‌లోని కుప్పం నియోజకవర్గంలో కుప్పం, గుడపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లితో కలిపి మొత్తం ఆరు స్టేషన్లు రూపొందించారు. సబ్ డివిజన్‌పరిధిలో కుప్పం, వీకోట రెండు సర్కిళ్లుంటాయి. త్వరలో ఇక్కడ డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పోస్టింగ్ ఇవ్వనున్నారు. చదవండి: (జనసేనకు కుప్పం ఇన్చార్జి రాజీనామా) -
పట్టాలెక్కేనా!
కేంద్ర మంత్రి సురేశ్ ప్రభుపై జిల్లావాసుల ఆశలు పెండింగ్ ప్రాజెక్టులు పరిష్కారమయ్యేనా? రైల్వే ఆస్పత్రికి సబ్ డివిజన్ హోదా దక్కేనా? నాలుగేళ్లుగా పెండింగ్‌లో వ్యాగన్ వర్క్‌షాప్ హన్మకొండ/కాజీపేట రూరల్ : రైల్వే బడ్జెట్ 2015-16పై జిల్లావాసులు గంపెడాశలు పెట్టుకున్నారు. గురువారం పార్లమెంట్లో రైల్వేశాఖ మంత్రి సురేశ్ ప్రభు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ప్రతిసారి బడ్జెట్లో జిల్లాకు అన్యాయం జరుగుతూనే ఉంది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేంద్రంలో ప్రవేశపెట్టే తొలి రైల్వే బడ్జెట్ కావడంతో జిల్లాకు తప్పకుండా న్యాయం జరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రధానంగా కాజీపేటకు న్యాయం జరగాలని కోరుతున్నారు. అప్పటిప్రధాని పీవీ నర్సింహారావు హయూంలో కాజీపేట-ఫాతిమానగర్ బ్రిడ్జి కింద న్యూఢిల్లీ-చెన్నై, హైదరాబాద్ ట్రంక్ మార్గంలో ట్రయాంగిల్ ప్లాట్‌ఫాం నిర్మాణానికి ప్రతిపాదనలు చేసి రైల్వే బోర్డుకు పంపించారు. తర్వాత ప్రజాప్రతినిధులు చొరవ చూపలేదు. ట్రయాంగిల్ వస్తే దేశంలో కాజీపేట మొదటి నిర్మాణం అవుతుంది. అన్ని రూట్ల నుంచి వచ్చే రైళ్లు ఆగే అవకాశం ఉండేది. కాజీపేట జంక్షన్లో మంజూరైన ఫిట్‌లైన్ల నిర్మాణం, కాజీపేట రైల్వే స్టేషన్లో అదనపు ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, జంక్షన్లో మూడో నంబర్ ప్లాట్‌ఫాంలో ఆఫ్రాన్ నిర్మాణానికి నిధులు మంజూరుకాక ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేయాలి. న్యూఢిల్లీ-చెన్నై, హైదరాబాద్ రూట్లో ఫాతిమానగర్ బ్రిడ్జి కింద 2006లో కాజీపేట టౌన్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు. ఈ స్టేషన్ నుంచి వందల సంఖ్యలో రైళ్లు వెళ్తాయి. కేవలం ఈ స్టేషన్లో భద్రాచలం-బల్లార్షా వెళ్లే ఒకే ఒక ప్యాసింజర్ రైలు అప్ అండ్ డౌన్ వెళ్తోంది. ఈ స్టేషన్‌ను అభివృద్ధి చేసి మరికొన్ని రైళ్లకు హాల్టింగ్ కల్పించాలి. కాజీపేట రైల్వేస్టేషన్ సమీపంలోని బోడగుట్ట ప్రజల చిరకాల కోరిక ఫుట్ ఓవర్‌బ్రిడ్జి నిర్మించాలి. ఈ ప్రాంత ప్రజలు ఆరు దశాబ్దాలుగా ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్టాలు దాటుతున్నారు. ఓవర్ బ్రిడ్జి నిర్మించాలి. గత బడ్జెట్లో రైల్వేశాఖ మంత్రి కాజీపేట నుంచి ముంబై వరకు కొత్త ఎక్స్‌ప్రెస్‌ను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటించినా మంజూరు కాలేదు. కాగా, వరంగ ల్ మీదుగా కరీంనగర్-తిరుపతి వెళ్లే వారాంతపు ఎక్స్‌ప్రెస్‌ను వారం రోజులు పొడిగించాలని వరంగల్, కరీంనగర్ జిల్లావాసులు కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో ప్రధాన రైల్వే స్టేషన్లు అయిన కాజీపేట జంక్షన్, వరంగల్ మీదుగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లే పద్మావతి ఎక్స్‌ప్రెస్ వారంలో ఐదు రోజులు మాత్రమే వెళ్తుంది. దీనిని వారం రోజుల పొడిగింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలి. అప్రంటిస్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఐటీఐ విద్యార్థులకు ఉద్యోగావకాశం ఉంటుంది. కాజీపేట రైల్వే ఆస్పత్రిని సబ్ డివిజన్‌గా అప్‌గ్రేడ్ చేయాలని ఐదేళ్ల నుంచి డిమాండ్ ఉంది. రైల్వే అధికారులు సబ్ డివిజన్‌స్థాయి హోదాకు సంబంధించిన నివేదికను రైల్వే బోర్డుకు పంపించారు. రైల్వే బోర్డులో డివిజన్ హోదా ఫైల్ పెండింగ్‌లో ఉంది. ఈ బడ్జెట్లో కాజీపేట సబ్‌డివిజన్ ఆస్పత్రి కావాలని రైల్వే కార్మికులు కోరుతున్నారు. కాగా, కాజీపేట జంక్షన్ మీదుగా అప్ అండ్ డౌన్ వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని ప్రయాణికులు కోరుతున్నారు. కాజీపేట జంక్షన్‌కు ఇక్కడి నుంచి పంజాబ్‌కు తరలిన కోచ్‌ఫ్యాక్టరీ నుంచి నేటి వ్యాగన్‌షెడ్ వరకు అన్యాయం జరుగుతూనే ఉంది. జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇస్తుందనుకున్న వ్యాగన్ వర్క్‌షాప్ పరిశ్రమ నిర్మాణం మరో అడుగు దూరంలో ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం స్థలం సేకరణ ప్రక్రియ పూర్తి చేసింది. తొలిదశ అడ్వాన్స్ కింద రూ.18 కోట్ల నిధులు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇక రైల్వేశాఖ వాటా నిధులు విడుదల కావడం మిగిలింది. ఈ బడ్జెట్లో రైల్వేశాఖ నిధులు కేటాయిస్తే వ్యాగన్ పరిశ్రమ పనులు త్వరగా ప్రారంభమయ్యేందుకు ఆస్కారం ఉంది. -
ఎంపీలదే భారం ఇప్పుడే మేల్కోవాలి
సాక్షి, హన్మకొండ : రైల్వే శాఖలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలకు ఒకేసారి పరిష్కారం లభించే అరుదైన అవకాశం వచ్చింది. వ్యాగన్ వర్క్‌షాప్, రైల్ కోచ్ ఫ్యాక్టరీ, కాజీపేటకు సబ్‌డివిజన్ హోదా వంటి పలు అభివృద్ధి పనులకు అనుమతులు... నిధులు సాధించేందుకు ఇదే అనువైన సమయం. రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే విభజన, ఇతర అభివృద్ధి కార్యక్రమాలపై నివేదిక ఇచ్చేం దుకు ఐదుగురు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని రైల్వే బోర్డు నియమించింది. జూలైలో నిర్వహించనున్న బడ్జెట్ సమావేశాలకు ముందు ఈ కమిటీ తన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి అందజేయనుంది. ఈ కమిటీ సిఫార్సులకనుగుణంగా దక్షిణ మధ్య రైల్వేకు కేటాయింపులు ఉండనున్నాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు అప్రమత్తమై కమిటీ ముందు కాజీపేటకు సంబంధించిన అంశాలను ప్రస్తావించి నిధులు సాధించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. కసరత్తు ప్రారంభించిన రైల్వేబోర్డు ఉత్తర, దక్షిణ భారతదేశాలకు గేట్వేగా ఉన్న కాజీపేట సబ్ డివిజన్ గడిచిన కొన్నేళ్లుగా నిరాదరణకు గురవుతోంది. ఇక్కడ అభివృద్ధి పనులు నత్తనడకన సాగుతున్నాయి. ప్రతి రైల్వే బడ్జెట్ సమయంలో మన ఎంపీలు సమర్పించే వినతిపత్రాలు బుట్టదాఖలు కావడం మినహా కార్యరూపం దాల్చడం లేదు. రాష్ట్ర విభజన సందర్భంగా రూపొందించిన ముసాయిదా బిల్లులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు తెలంగాణలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం చేసే అంశాలను పరిశీలించాలంటూ కేంద్ర ప్రభుత్వం రైల్వేబోర్డుకు ఆదేశాలు జారీ చేసింది. అందుకనుగుణంగా ఐదుగురు సభ్యులతో కూడిన కమిటిని 2014 ఏప్రిల్ 15న రైల్వేబోర్డు నియమించింది. ఈ కమిటీ మూడు నెలల్లో తన నివేదికను రైల్వేబోర్డుకు సమర్పించాల్సి ఉంది. మే 16 వరకు దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి ఉండడంతో ఈ కమిటీ క్రియాశీలకంగా పని చేయలేదు. ఇప్పటికే సగం సమయం గడిచిపోయింది. దీంతో అందుబాటులో ఉన్న 45 రోజుల్లో ఈ కమిటీ తన నివేదికను రూపొందించనుంది. జూలైలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు రైల్వే మంత్రి సదానందగౌడ ఇప్పటికే ప్రకటించారు. రైల్వే బోర్డు నియమించిన ఐదుగురు సభ్యుల కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగానే రైల్వే బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి కేటాయింపులు ఉంటాయి. ఈ నేపథ్యంలో మన ఎంపీలు తమ వంతు ప్రయత్నం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. రికార్డు స్థాయిలో ఐదుగురు సభ్యులు తెలంగాణలోని పది జిల్లాలలో ఏ జిల్లాకు రాని అరుదైన అవకాశం వరంగల్ జిల్లాకు వచ్చింది. ముగ్గురు రాజ్యసభ సభ్యులు గుండు సుధారాణి, రాపోలు ఆనంద భాస్కర్, గరికపాటి మోహన్‌రావు... ఇద్దరు ఎంపీలు కడియం శ్రీహరి, సీతారాం నాయక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పార్టీలకతీతంగా జిల్లా ప్రయోజనాలు, పారిశ్రామిక అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని వీరందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడాల్సి ఉంది. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ, సబ్ డివిజన్ ఏర్పాటుకు అనుమతులు సాధించడంతోపాటు వ్యాగన్ వర్క్‌షాపునకు నిధుల కేటాయింపు వంటి అంశాలను అందరూ కలిసి సమష్టిగా రైల్వే బోర్డు నియమించిన కమిటీ దృష్టికి తీసుకెళ్లాలని... కాజీపేట సబ్ డివిజన్‌ను అభివృద్ధి పట్టాలు ఎక్కించేందుకు ఇదే అనువైన సమయని రైల్వే కార్మిక సంఘాల నాయకులు అభిప్రాయపడుతున్నారు. దశాబ్దాల కల మాజీ ప్రధాని పీవీ.నర్సింహారావు హయూంలో కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు సన్నాహాలు చేశారు. అయితే రాజకీయ కారణాలతో ఆ ప్రాజెక్ట్ పంజాబ్‌కు తరలిపోయింది. ఆ తర్వాత దీని ఊసెత్తేవారే కరువయ్యారు. అదేవిధంగా... అన్ని అర్హతలు ఉన్నప్పటికీ కాజీపేటకు ఇంతవరకు డివిజన్ హోదా దక్క లేదు. ప్రతి సంవత్సరం రైల్వే బడ్జెట్ సమయంలో డిమాండ్ చేయడం.... ఆ తర్వాత మిన్నకుండిపోవడం మన నేతలకు షరామామూలుగా మారింది. ఒకవేళ విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లతో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను కేటాయిస్తే దక్షిణ మధ్య రైల్వే పరిధిలో హైదరాబాద్, సికింద్రాబాద్, నాందేడ్ మూడు జోన్లు మాత్రమే ఉంటాయి. అంటే తెలంగాణ రాష్ట్రంలో రైల్వేకు సంబంధించిన రెండు డివిజన్లు రాష్ట్ర రాజధానిలోనే ఉంటాయి. ఈ నేపథ్యంలో పరిపాలన సౌల భ్యం కోసం సికింద్రాబాద్ డివిజన్‌ను విభజించి కాజీపేట కేంద్రంగా మరో డివిజన్ ఏర్పాటు చేసేం దుకు అస్కారం ఉంది. వ్యాగన్ వర్క్‌షాప్ నిర్మాణం అంటూ నాలుగేళ్లుగా బడ్జెట్లలో ప్రకటనలు తప్పితే.. ఇంతవరకు ఎటువంటి నిధులు కేటాయించలేదు.