
కొత్తగా ఏర్పాటైన కుప్పం సబ్‌డివిజన్ మ్యాప్
సాక్షి, పలమనేరు/కుప్పం: కుప్పం ఇక పోలీసు సబ్‌డివిజన్ కానుంది. ఆమేరకు కొత్తగా కుప్పం పోలీసు సబ్ డివిజన్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ నం.147 గెజిట్ నోటిఫికేషన్‌ను జారీచేసింది. ఈ సబ్ డివిజన్‌కు ఎస్‌పీడీఓ కార్యాలయం కుప్పంగా అందులో పేర్కొన్నారు.
పలమనేరు పోలీసు సబ్‌డివిజన్‌లోని కుప్పం నియోజకవర్గంలో కుప్పం, గుడపల్లి, రాళ్లబూదుగూరు, రామకుప్పంతో పాటు పలమనేరు నియోజకవర్గంలోని వీకోట, బైరెడ్డిపల్లితో కలిపి మొత్తం ఆరు స్టేషన్‌లు రూపొందించారు. సబ్ డివిజన్‌పరిధిలో కుప్పం, వీకోట రెండు సర్కిళ్లుంటాయి. త్వరలో ఇక్కడ డీఎస్పీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసి పోస్టింగ్ ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment