Subhash Barala Son
-
వేధింపుల కేసు: బీజేపీ చీఫ్ కుమారుడికి బెయిల్
సాక్షి, చండీగఢ్: యువతిపై వేధింపుల కేసులో హర్యానా బీజేపీ అధ్యక్షుడు సుభాష్ బరాలా కుమారుడు వికాస్ బరాలాకు బెయిల్ మంజూరైంది. గతంలో కింది కోర్టులో నాలుగుసార్లు వికాస్ బెయిల్ పిటీషన్ కొట్టివేయగా, ఐదోప్రయత్నంగా పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టును ఆశ్రయించగా ఎట్టకేలకు బెయిల్ లభించింది. యువతి కారు అడ్డగింత, వేధింపులు, కిడ్నాప్ యత్నం కేసులో గతేడాది ఆగస్టు 9న వికాస్‌ను, అతడి స్నేహితుడు ఆశిష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం నాడు బాధితురాలు వర్ణికా కుందును బరాలా కౌన్సిల్ దాదాపు ఐదు గంటలపాటు కొన్ని వందల ప్రశ్నలు అడిగారు. అనంతరం రెండు రోజులకు గురువారం నిందితుడు వికాస్ బరాలకు పంజాబ్, హర్యానాల ఉమ్మడి హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. గతేడాది ఆగస్టు 4న చండీగఢ్‌లోని సెక్టార్ 8లో వర్ణికా కుందు తన కారులో వెళ్తుండగా మద్యం మత్తులో ఉన్న వికాస్ తన స్నేహితుడు ఆశిష్‌తో కలిసి తమ ఎస్యూవీ వాహనంతో 8 కిలోమీటర్లు ఫాలో అవుతూ వెంబడించి వేధించారు. పోలీస్ హెల్ప్‌లైన్‌కు కాల్ చేయగా వారు అక్కడికి చేరుకుంటుండగా వికాస్, ఆశిష్‌లు తమ వాహనంలో అక్కడి నుంచి పరారయ్యారు. కాగా, ఆ మరుసటిరోజు రాత్రి జరిగిన వేధింపులు, కిడ్నాప్ యత్నం ఘటనను ఫేస్బుక్లో పోస్ట్ చేయగా వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నిందితులపై 354డీ తోపాటు మోటారు వెహికల్ యాక్ట్‌లోని ఐపీసీ 185 సెక్షన్ కింద కేసులు నమోదు చేసి విచారణ చేపట్టి నిందితులను అరెస్ట్ చేశారు. -
వేధింపుల కేసు: షాకిచ్చిన వికాస్
- యూరిన్, బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేందుకు నిరాకరణ - నోటీసులు కూడా తీసుకోని నిందితుడు ఛంఢీగడ్: యువతిని వెంటాడి వేధించిన కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న హరియాణా బీజేపీ చీఫ్ తనయుడు వికాస్ బరాలా పోలీసులకు షాకిచ్చాడు. విచారణలో భాగంగా వెళ్లిన అధికారులకు రక్త, మూత్ర నమునాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. నిందితులిద్దరూ న్యాయ విద్యార్థులు, పైగా చట్టాల అవగాహన ఉండటంతో అందుకు నిరాకరించారని డీజీపీ లుథారా మీడియాకు తెలిపారు. కేసును నీరుగార్చేందుకు యత్నిస్తున్నారంటూ వస్తున్న ఆరోపణలను ఆయన ఖండించారు. ఆరు ప్రాంతాల్లోని సీసీటీవీ పుటేజీలను పరిశీలించాం. అందులో యువతిని నిందితులు వెంబడించినట్లు స్పష్టమయ్యింది. అదనపు సాక్ష్యాలను సేకరించే పనిలో ఉన్నామని ఆయన అన్నారు. విచారణను వేగవంతం చేశామని, త్వరగతిన బాధితురాలికి న్యాయం చేకూరుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు నిందితులు వికాస్ బరాలా మరియు అశిశ్ కుమార్ లను బుధవారం ఉదయం తమ ఎదుట హాజరుకావాల్సిందిగా పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే వికాస్ మాత్రం నోటీసులు అందుకునేందుకు నిరాకరించటంతో ఇంటి గేటుకు అంటించారు. మొత్తం వ్యవహారంపై స్పందించిన వికాస్ తండ్రి, హరియానా బీజేపీ చీఫ్ సుభాష్బరాలా.. బాధిత యువతి వర్ణికా కుంద్రా తన కూతురులాంటిదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. విచారణ పారదర్శకంగా జరిగేందుకు సహకరిస్తానని, తనవైపు నుంచి ఎలాంటి (అధికార) ఒత్తిళ్లు ఉండబోవని స్పష్టం చేశారు కూడా. వేధింపులతోపాటు ర్యాష్ డ్రైవింగ్ సెక్షన్ల కింద వికాస్ పై కేసులు నమోదు అయ్యాయి.