Subrahmanyam Jaishankar
-
దేశం కోసం.. ప్రజల కోసం ఆ పని: విదేశాంగ మంత్రి
బ్యాంకాక్/ఢిల్లీ: రష్యాతో భారత్ చమురు వాణిజ్యంపై అమెరికా చల్లబడినట్లుగానే అనిపిస్తోంది. ఉక్రెయిన్ యుద్దం తర్వాత అగ్రరాజ్యంతో పాటు చాలా పాశ్చాత్య దేశాలు భారత్ మీద మండిపడ్డాయి. అయినప్పటికీ భారత్ మాత్రం తగ్గేదేలే అన్నచందాన ముందుకు వెళ్తోంది. ఏప్రిల్ నుంచి గరిష్ఠ స్థాయిలో చమురు వాణిజ్యం జరుగుతోంది ఇరు దేశాల మధ్య. ఈ తరుణంలో రష్యాతో ఒప్పందం కొనసాగించాల్సిన అవసరం ఏంటనే ప్రశ్న మరోసారి ఎదురైంది భారత్‌కు. మంగళవారం బ్యాంకాక్‌లో ఓ కార్యక్రమానికి హాజరైన భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు ఈ ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన బదులిస్తూ.. భారతీయులు చమురుకు అధిక ధరలు చెల్లించలేరని, అందుకే రష్యాతో ముడి చమురు ఒప్పందాలను కొనసాగిస్తున్నామని విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ స్పష్టం చేశారు. ఈ ఒప్పందం మేలిరకమైంది. భారత ప్రజల ప్రయోజనాల దృష్ట్యా కొనసాగిస్తున్నామని ఆయన వెల్లడించారు. ప్రతీ దేశం అధిక ఇంధన ధరలను తగ్గించడానికి సాధ్యమైనంత మేరకు.. ఉత్తమమైన ఒప్పందాలపై వైపు మొగ్గు చూపిస్తుంది. అలాగే భారత్ కూడా అదే పని చేసింది. ప్రస్తుతం ఆయిల్, గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయి. సంప్రదాయ పంపిణీదారులంతా యూరప్‌కు తరలిస్తున్నారు. అలాంటప్పుడు భారత్ ముందర ఇంతకన్నా మార్గం మరొకటి లేదని ఆయన నొక్కి చెప్పారు. నైతిక బాధ్యతగా పౌరుల గురించి ఆలోచించే తాము రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామని తేల్చి చెప్పారాయన. అంతేకాదు ఈ విషయం అమెరికాకు కూడా అర్థమైందని ఆయన చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రష్యాతో భారత్ చమురు వాణిజ్యంలో మొదటి నుంచి అమెరికా అభ్యంతరాలు చెబుతూ వస్తోంది. అయితే.. ఈ ఏప్రిల్‌లో అమెరికా, భారత్ మధ్య జరిగిన 2+2 స్థాయి సమావేశంలో.. రష్యాతో వాణిజ్యం గురించి అమెరికా నిలదీయడంతో.. భారత్ గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇదీ చదవండి: హైదరాబాద్-బెంగళూరు మధ్య జర్నీ రెండున్నర గంటలే!! -
బ్రిటన్‌కు ‘తగిన’ జవాబిస్తాం!
న్యూఢిల్లీ: యూకే జారీ చేసిన నూతన రవాణా నిబంధనలపై భారత్ తీవ్రంగా ప్రతిస్పందించింది. కరోనా టీకా తీసుకున్నట్లు సర్టిఫికెట్ ఉన్నా సరే బ్రిటన్‌కు వచ్చే భారతీయులు క్వారంటైన్లో ఉండాలంటూ బ్రిటన్ కొత్త ప్రయాణ నిబంధనలు తెచ్చిన సంగతి తెలిసిందే! ఈ నిబంధనలు వివక్షపూరితమైనవంటూ కేంద్ర విదేశాంగ శాఖ కార్యదర్శి హర్ష వర్ధన్ శ్రింగ్లా మండిపడ్డారు. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ విషయాన్ని న్యూయార్క్ సందర్శనలో యూకే విదేశాంగ కార్యదర్శి ఎలిజబెత్ ట్రస్ దృష్టికి తెచ్చారు. కోవిషీల్డ్ టీకాను యూకే కంపెనీనే రూపొందించిందని, అదే టీకాను భారత్‌లో ఉత్పత్తి చేసి బ్రిటన్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు 50లక్షల డోసులు పంపించామని శ్రింగ్లా గుర్తు చేశారు. అలాంటి టీకానే గుర్తించమనే నిబంధనలు నిజంగానే వివక్షాపూరితమని, యూకేకు ప్రయాణించే లక్షలాది ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తాయని ఆయన దుయ్యబట్టారు. అక్టోబర్ 4(యూకేలో కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చే తేదీ)లోపు ఈ సమస్యను పరిష్కరించకుంటే భారత్ నుంచి ప్రతిచర్య తప్పదని సంబంధిత వర్గాలు అభిప్రాయపడ్డాయి. సమస్యను గుర్తించామని, తగు చర్యలు తీసుకుంటామని యూకే అధికార వర్గాల నుంచి ప్రస్తుతానికి హామీ లభించినట్లు షి్రంగ్లా చెప్పారు. అయితే హామీలు నిజం కాకుంటే భారత్ తనకున్న హక్కుల పరిధిలో తగిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఏమిటీ నిబంధనలు? బ్రిటన్‌కు వచ్చే విదేశీ ప్రయాణికుల కోసం నూతన ప్రయాణ నిబంధనలను యూకే ప్రభుత్వం రెండు రోజుల క్రితం ప్రకటించింది. వీటి ప్రకారం అక్టోబర్4 నుంచి భారత్‌తో పాటు మరికొన్ని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు కోవిషీల్డ్ రెండు డోసుల టీకా తీసుకున్నా సరే, వారిని టీకా తీసుకోనివారిగానే పరిగణిస్తామని పేర్కొంది. సదరు జాబితాలోని దేశాల ప్రయాణికులు, యూకేకు చేరుకున్న తర్వాత పీసీఆర్ పరీక్షలు చేయించుకోవాలని, పది రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని తెలిపింది. నిజానికి యూకేకు చెందిన ఆస్ట్రాజెనెకా కోవిషీల్డ్‌ను రూపొందించింది. దీన్ని భారత్‌లోని సీరమ్ ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. అలాంటి టీకానే గుర్తించమనే కొత్తనిబంధనలపై భారత్‌లోని అన్ని పక్షాలు మండిపడ్డాయి. బ్రిటన్ తీరుపై కాంగ్రెస్ సీనియర్ నేతలు జైరామ్ రమేశ్, శశిథరూర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బ్రిటన్ నిబంధనలు జాతి వివక్ష చూపేలా ఉన్నాయన్నారు. వెంటనే భారత ప్రభుత్వం తగిన స్పందన చూపాలని కోరారు. ట్రస్‌తో జైశంకర్ భేటీ పరిణామాలపై భారత్ తన స్పందనను బ్రిటన్‌కు తెలిపింది. మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ తన న్యూయార్క్ పర్యటనలో బ్రిటన్ కార్యదర్శి ట్రస్‌ను కలిశారు. రెండు దేశాల పరస్పర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఈ సమస్యకు సత్వర పరిష్కారం చూపాలని కోరినట్లు జైశంకర్ తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం భారత్ నుంచి వచ్చే ప్రయాణికులను రెడ్‌లిస్టులో పెడతారు. అంటే భారత్‌లో వేస్తున్న టీకాలను బ్రిటన్ గుర్తించదని పేర్కొన్నట్లయింది. భారత్‌తో తలెత్తిన ఇబ్బందిని సత్వరం పరిష్కరించే యత్నాల్లో ఉన్నామని ఇండియాలో బ్రిటిష్ హైకమిషన్ కార్యాలయం ప్రకటించింది. ట్రస్‌తో పాటు పర్యటనలో భాగంగా నార్వే, ఇరాక్ విదేశాంగ మంత్రులతో జైశంకర్ భేటీ అయ్యారు. ఆయా దేశాలతో వాణిజ్యపరమైన అంశాలను చర్చించారు. ఇండో పసిఫిక్, అఫ్గాన్ అంశాలు కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
కువైట్ నుంచి వలస కార్మికులను రప్పించండి
సాక్షి, అమరావతి: కువైట్‌లో చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన వలస కార్మికులను స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమానాలు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్‌లోని వలస కార్మికుల కోసం విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని కోరారు. సీఎం లేఖలోని అంశాలు ఇలా ఉన్నాయి. ఆశతో ఎదురు చూస్తున్నారు.. ► విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయులను వెనక్కు రప్పించేందుకు ‘వందే భారత్’ మిషన్ పేరుతో మీరు చేపడుతున్న చర్యలు ప్రశంసనీయం. దీని ద్వారా పలు దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ► అదే కోవలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది మంది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్లకు చార్జీలకు కూడా డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నారు. ► అయితే కువైట్‌లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశానికి రావడానికి అనుమతి పొందిన సుమారు 2,500 మందికి మాత్రం ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ రుసుము మాఫీ చేయడం ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్ కూడా ఇచ్చింది. రెండు వారాలుగా ఇక్కట్లు ► ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తల దాచుకుంటున్నారు. కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ► ఈ పరిస్థితిలో మీరు వెంటనే కువైట్ హై కమిషనర్‌కు సూచించి, అక్కడి అధికారులతో మాట్లాడి.. కువైట్ నుంచి రాష్ట్రంలోని విశాఖ, విజయవాడ, తిరుపతికి నేరుగా విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. ► వలస కూలీలందరికీ ఇక్కడ అవసరమైన వైద్య పరీక్షలు చేసి, క్వారంటైన్‌కు పంపించేందుకు అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారి కోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం. ► అందువల్ల కువైట్‌తో పాటు ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలస కార్మికులను వీలైనంత త్వరగా దశల వారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం. -
కేంద్ర మంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి : కువైట్‌లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రశ్కు చెందిన వలస కార్మికులును స్వదేశానికి రప్పించేందుకు అవసరమైన విమాన ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బుధవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. ఈ సందర్భంగా వలస కార్మికుల కోసం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి నుంచి నేరుగా విమానాలు ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు. అదే విధంగా విదేశాల్లో చిక్కుకుపోయిన భారతీయలను వెనక్కి రప్పించేందుకు ‘వందే భారత్’ మిషన్ పేరుతో కేంద్రం చేపడుతున్న చర్యలు ప్రశంసనీయమన్నారు.(టెలీమెడిసిన్ కోసం కొత్త బైక్‌లు : సీఎం జగన్) ఇతర దేశాల్లో చిక్కుకుపోయిన వేలాది మంది భారతీయులు వందే భారత్ మిషన్‌ను సద్వినియోగం చేసుకుని సొంత ఖర్చులతో స్వదేశానికి తిరిగి వస్తున్నారన్నారు. ఈ క్రమంలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోల్పోయి, అక్కడే చిక్కుకుపోయిన వేలాది వలస కార్మికులు కూడా స్వదేశానికి తిరిగి రావడానికి ఎంతో ఆశతో చూస్తున్నారని, అయితే వారంతా స్వదేశానికి రావడానికి అయ్యే ప్రయాణ ఖర్చు భరించే స్థితిలో లేరని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్ దేశాల్లో ఆమ్నెస్టీ ద్వారా స్వదేశాలకు వెళ్లడానికి అనుమతి పొందిన సుమారు 2500 మంది వలస కూలీలు వారి ప్రయాణ ఛార్జీలకు కూడా డబ్బులు లేని స్ధితిలో ఉన్నారని లేఖలో పేర్కొన్నారు. (చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 3 లక్షల కోట్ల రుణాలు ) ఇమ్మిగ్రేషన్ రుసుము మాఫీ చేయడం ద్వారా మన దేశ రాయబార కార్యాలయం, వారందరికీ ఎగ్జిట్ క్లియరెన్స్ కూడా ఇచ్చిందని, మరోవైపు వారి ప్రయాణ ఖర్చును భరించడానికి కువైట్ ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రస్తుతం వారంతా అక్కడ స్థానికంగా ఏర్పాటు చేసిన శిబిరాల్లో తలదాచుకుంటున్నారని, అరకొర భోజన వసతి, కనీస సదుపాయాలు కూడా లేకుండా రెండు వారాల నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతూ, స్వదేశానికి తిరిగి రావాలని ఆశతో ఎదురు చూస్తున్నారని వైఎస్ జగన్ లేఖలో తెలిపారు. (కరోనా: యోగీ ఆదిత్యనాథ్‌కు ప్రియాంక లేఖ) ''రాష్ట్రానికి చెందిన వలస కూలీల ప్రయాణ ఖర్చు భరించడానికి కువైట్ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నందున మీరు వెంటనే కువైట్ హైకమిషనర్‌కు సూచనలు జారీ చేసి, ఆ దేశం నుంచి రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతికి విమానాలు ఏర్పాటు చేసేలా చూడగలరు. వలస కూలీలందరినీ ఇక్కడ సొంత రాష్ట్రంలో రిసీవ్ చేసుకుని, వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయడం, క్వారంటైన్‌కు పంపించడంతో పాటు, అన్ని సదుపాయాలతో సిద్ధంగా ఉన్నాం. జిల్లా కేంద్రాల్లో క్వారంటైన్ సదుపాయంతో పాటు, విదేశాల నుంచి తిరిగొచ్చే వారికోసం తగిన వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశాం''. (20 ఏళ్లలో 5 వైరస్లు అక్కడినుంచే..! ) ''ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కువైట్‌తో పాటు మధ్య ఆసియా, అగ్నేయాసియా దేశాల నుంచి రానున్న వలస కార్మికులు కోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో సిద్ధంగా ఉన్నందున వారిని నేరుగా ఏపీకి వచ్చేలా అనుమతించాలని కోరుతున్నాను. విదేశాల్లో ఉన్న వలస కార్మికులు స్వరాష్ట్రానికి తిరిగి వస్తే వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉంది. అందువల్ల కువైట్‌తో పాటు తూర్పు మధ్య, ఆగ్నేయాసియా దేశాల్లో ఉన్న వలసకార్మికులును వీలైనంత త్వరగా దశలవారీగా రాష్ట్రానికి అనుమతించాలని కోరుతున్నాం''. అని విదేశాంగ మంత్రికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖలో సూచించారు. (లాక్డౌన్ 4.0 : మోదీ కీలక భేటీ ) (భారత్‌లో కరోనా కేసులు తక్కువే? ) -
తెలుగు వారిని రప్పించేందుకు సహకరించాలి
భారతదేశానికి రావడం కోసం కువైట్‌లో నమోదు ప్రక్రియలో మన వాళ్లు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ దృష్ట్యా వివిధ దేశాల నుంచి తిరిగి రావాలనుకుంటున్న వలసదారుల నమోదు ప్రక్రియ, వారిని పంపించే ఏర్పాట్లు సజావుగా సాగేలా ఆయా దేశాల్లోని మన రాయబార కార్యాలయాల అధికారులను ఆదేశించాలని కోరుతున్నాను. ఆయా దేశాల్లోని భారత రాయబార కార్యాలయాలు భారతదేశం వస్తున్న వలసదారుల సమాచారాన్ని (డేటా) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా ముందుగానే ఆంధ్రప్రదేశ్‌తో సహా అన్ని రాష్ట్రాలకు అందించేలా చూడాలి. తద్వారా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మరిన్ని ఏర్పాట్లతో వారి రాకకై సిద్ధంగా ఉంటాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరిం చాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్‌కు లేఖ రాశారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, ఆ సందర్భంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. ఆ లేఖలోని ఇతర అంశాలు ఇలా ఉన్నాయి. విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో రావొచ్చు ► కోవిడ్19 సంక్షోభం కారణంగా గల్ఫ్ దేశాలలో ఉద్యోగాలు కోల్పోయి, అంతర్జాతీయ విమానాలు తిరిగి ప్రారంభమయ్యాక భారతదేశానికి, ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి వచ్చేవారి సంఖ్య మరింత పెరగొచ్చు. ► దుబాయ్‌లో, ఇతర దేశాల్లో భారత దౌత్యకార్యాలయాలు స్వదేశానికి తిరిగి వెళ్లే భారతీయుల సమాచార సేకరణ కార్యక్రమం చేపట్టాయి. ఇతర రాష్ట్రాల వారితో పాటు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు వలసదారులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో అధికంగా ఉన్నారు. ► భారత ప్రభుత్వం అంతర్జాతీయ ప్రయాణ సదుపాయాలను తిరిగి ప్రారంభించాక గల్ఫ్ దేశాల నుండి తిరిగి వచ్చే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలసదారులు కొన్ని వేల మంది ఉంటారు. వీరి భద్రత, క్షేమం కోసం, క్వారంటైన్ గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఆ దిశగా చర్యలు తీసుకుంది. ► ఏప్రిల్ 30 గడువులోగా నమోదు చేసుకోవటానికి, ఏప్రిల్ 29న కువైట్‌లోని మన రాయబార కార్యాలయానికి వలస కార్మికులు భారీగా తరలివచ్చారు. ఈ నమోదు ప్రక్రియలో రాయబార కార్యాలయం వద్ద వారు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ► గత 6 వారాలుగా వివిధ దేశాలలో చిక్కుకున్న ఏపీ విద్యార్థులు, సందర్శకులు భారత ప్రభుత్వం అవకాశం ఇచ్చిన వెంటనే స్వదేశానికి తిరిగి రావడానికి వేచి ఉన్నారనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ► ముఖ్యమంత్రి లేఖను ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి వెంకట్ పత్రికలకు విడుదల చేశారు. -
విదేశాంగమంత్రికి సీఎం వైఎస్ జగన్ లేఖ
సాక్షి, అమరావతి: కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్ జగన్ కోరారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. (అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది) ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు, విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, ఫలితంగా తాము వారి క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, వారికి ఇబ్బందులు లేకుండా ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రికి వైఎస్ జగన్ సూచించారు. (మద్యం దుకాణాలు మినహాయింపులు: క్లారిటీ) -
తెలుగు విద్యార్థులకు సర్కారు అండ
సాక్షి, అమరావతి/యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): కరోనా వైరస్ కారణంతో మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయంలో చిక్కుకుపోయి తీవ్ర అవస్థలు పడుతున్న తెలుగు విద్యార్థులను స్వస్థలాలకు రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. వారందరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. పార్టీ నేతలను అప్రమత్తం చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి హుటాహుటిన కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌ను సంప్రదించారు. విద్యార్థులందరినీ తీసుకువచ్చేందుకు అవసరమైన ఏర్పాట్లుచేయాలని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేయడంతో కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు. కౌలాలంపూర్ నుంచి విశాఖపట్నం, ఢిల్లీకి ఎయిర్ ఏషియా విమానాలు నడిపేందుకు ఆయన అనుమతించారు. ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు ఎయిర్ ఏషియా సంస్థను సంప్రదించాలన్నారు. మరోవైపు.. ఎప్పటికప్పుడు ఇందుకు సంబంధించిన విషయాలు నివేదించాలని ఢిల్లీ ఏపీ భవన్ అధికారులను సీఎం ఆదేశించారు. కౌలాలంపూర్‌లో విద్యార్థుల అవస్థలు అంతకుముందు.. కోవిడ్–19 వల్ల ఫిలిప్పీన్స్ దేశంలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించడంతో అక్కడ చదువుతున్న తెలుగు విద్యార్థులు సొంతూళ్లకు బయల్దేరారు. ఏపీ, తెలంగాణతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు ఫిలిప్పీన్స్ రాజధాని మనీలా, అలాగే కావైట్ పట్టణంలో చదువుతున్నారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 120 మంది ఉన్నట్లు సమాచారం. మనీలాలో ఇప్పటివరకు 100 పాజిటివ్ కేసులు.. కావైట్‌లో ఐదు కేసులు నమోదయ్యాయి. దీంతో తమకు ఏప్రిల్ 30 వరకు సెలవులు ప్రకటించారని అక్కడి విద్యార్థులు తెలిపారు. తమను కళాశాల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని.. లేనిపక్షంలో నిర్బంధిస్తామని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అంతేకాక.. అనుమతి లేకుండా వీధుల్లో సంచరిస్తే కాల్చివేస్తామని కూడా హెచ్చరికలు చేసిందని వాపోయారు. దీంతో వారంతా మలేసియా రాజధాని కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ, అక్కడ భారత్ వెళ్లే విమానాలన్నీ రద్దు చేయడంతో వీరంతా ఎయిర్‌పోర్టులోనే చిక్కుకుపోయారు. వీరిలో కృష్ణా, గుంటూరు, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులున్నారు. వీరంతా ఇప్పుడు స్వస్థలాలకు చేరుకుంటామా లేదా అని ఆందోళన చెందుతున్నారు. సరైన ఆహారం దొరక్క అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవతో కేంద్రం ప్రత్యేక విమానాలు నడిపేందుకు అంగీకరించడంతో వారంతా స్వస్థలాలకు సురక్షితంగా వచ్చేందుకు మార్గం సుగమమైంది. -
కర్నూలు యువతిని ఇండియాకు తీసుకోస్తామని మంత్రి హామీ
-
జ్యోతి కుటుంబానికి కేంద్ర మంత్రి భరోసా
సాక్షి, న్యూఢిల్లీ : చైనాలో చిక్కుకున్న కర్నూలు యువతి జ్యోతిని కర్నూలుకు రప్పించాలని నంద్యాల, అనకాపల్లి ఎంపీలు పోచా బ్రహ్మానంద రెడ్డి, డాక్టర్ వెంకట సత్యవతి పార్లమెంటులో విదేశీ వ్యవహారాలశాఖ మంత్రి జయజంకర్‌ను కలిశారు. ఈ సందర్భంగా చైనాలో ఉన్న జ్యోతితో మంత్రి జయశంకర్ ఫోన్లో మాట్లాడారు. విద్యార్థి ఆందోళన చెందవద్దని, త్వరలోనే ఇండియాకు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అనంతరం చైనా ఎంబసీతోనూ మంత్రి జయశంకర్, ఎంపీ పోచా బ్రహ్మనంద రెడ్డి మాట్లాడారు. దీంతో జ్యోతి కుటుంబ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు కర్నూలులో జ్యోతి తల్లి ప్రమీలాదేవి మాజీ మంత్రి భూమా అఖిల ప్రియతో మాట్లాడుతుంటే అస్వస్థతకు గురయ్యారు.