సాక్షి, అమరావతి: కేంద్ర విదేశాంగ మంత్రి సుబ్రమణ్యం జైశంకర్‌కు శనివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. విదేశాల్లో చిక్కుకున్న తెలుగు వారిని రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రిని వైఎస్ జగన్ కోరారు. కువైట్, దుబాయ్‌లలో వలస వచ్చిన వారి రిజిస్ట్రేషన్ జరుగుతోందని, రిజిస్ట్రేషన్ సందర్బంగా కువైట్‌లో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయన్నారు. వాటిని పరిష్కరించేందుకు సంబంధిత ఎంబసీ అధికారులకు సూచనలు చేయాలని సీఎం వైఎస్ జగన్ కోరారు. (అద్భుతం! ఉమ్మేయడం మళ్లీ మొదలవుతుంది)
ఇతర దేశాల్లో ఉన్న తెలుగు వారు, విద్యార్థులు స్వస్థలాలకు వచ్చేందుకు సహకరించాలని కోరారు. రిజిస్ట్రేషన్ వివరాలను రాష్ట్రాలకు అందించాలని, ఫలితంగా తాము వారి క్వారంటైన్ కోసం ఏర్పాట్లు చేసుకుంటామని ముఖ్యమంత్రి తెలిపారు. గల్ఫ్, ఇతర దేశాల్లో ఉన్న తెలుగు ప్రజలను సొంత ప్రాంతాలకు తీసుకువచ్చేందుకు ఏపీ సిద్ధంగా ఉందని, వారికి ఇబ్బందులు లేకుండా ఇండియాకు వచ్చేందుకు సహకరించాలని కేంద్ర మంత్రికి వైఎస్ జగన్ సూచించారు. (మద్యం దుకాణాలు మినహాయింపులు: క్లారిటీ)
Comments
Please login to add a commentAdd a comment