Subsidized
-
జీవాలు తగ్గినయ్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గొర్రెలు, మేకల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. 2019తో పోలిస్తే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 32 శాతం జీవాలు తగ్గినట్టు సామాజిక, ఆర్థిక సర్వే–2024 గణాంకాలు చెబుతున్నాయి. ఈ గణాంకాల ప్రకారం.. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా 1,90,81,605 గొర్రెలు, 49,06,465 మేకలు కలిపి మొత్తం 2,39,88,070 జీవాలుండేవి. కానీ ఐదేళ్ల తర్వాత గణన చేపడితే ఆ సంఖ్య 1.62 కోట్లకు తగ్గిపోయిందని (32.40%) సర్వే వెల్లడించింది. రాష్ట్రంలోని 1,75,115 కుటుంబాల వద్ద ప్రస్తుతం 1,24,14,299 గొర్రెలు, 38,02,609 మేకలు కలిపి 1,62,16,908 జీవాలున్నాయని తెలిపింది.వరంగల్‌లో 5 లక్షలు గాయబ్జిల్లాల వారీగా పరిశీలిస్తే మేడ్చల్ జిల్లాలో అత్యధిక శాతం జీవాలు తగ్గాయని ఆర్థిక సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక్కడ గొర్రెలు, మేకలు కలిపి 2019లో 1.89 లక్షలు ఉంటే 2014కు వచ్చేసరికి ఆ సంఖ్య 74 వేలకు తగ్గిపోయింది. వరంగల్‌లో అత్యధికంగా ఐదేళ్లలో ఐదు లక్షల వరకు జీవాలు మాయమయ్యాయి. 2019లో వరంగల్ జిల్లాలో 8.3 లక్షలున్న జీవాలు 2024కు వచ్చేసరికి 3.33 లక్షలకు తగ్గిపోయాయి.అదే విధంగా సంగారెడ్డిలో 3.50 లక్షలు, మెదక్‌లో 3.9 లక్షలు, నిజామాబాద్‌లో 4.2 లక్షలు, సిద్దిపేటలో 4.5 లక్షలు.. ఇలా పెద్ద సంఖ్యలో జీవాలు తగ్గిపోయా యని గణాంకాలు చెబుతున్నాయి. ఇందుకు కారణాలేవైనా ఇంత పెద్ద సంఖ్యలో జీవాల తగ్గుదల మంచిది కాదని, ఆయా జిల్లాల్లో త్వరలోనే మాంసం సంక్షోభం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పశుసంవర్ధక అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో వనపర్తి, గద్వాల, మంచిర్యాల, నల్లగొండ జిల్లాల్లో కొంతమేర జీవాల సంఖ్య ఎక్కువగా కనిపిస్తోంది.గొర్రెలు కావాలి మహాప్రభోవాస్తవానికి 2017లో సబ్సిడీ గొర్రెల పంపిణీ పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. దాదాపు రూ.5వేల కోట్లకు పైగా వెచ్చించి 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసింది. దీంతో అటు జీవాల సంఖ్యలోనూ, మాంసం ఉత్పత్తిలోనూ తెలంగాణలో భారీ వృద్ధి కనిపించింది. ఆ గొర్రెలు ఇప్పుడు ఏమయ్యాయన్నది ఆసక్తి కలిగిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో ప్రారంభించిన ఈ గొర్రెల పథకంలో భారీ అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయి. ఇలావుండగా రెండోవిడత గొర్రెల పంపిణీ కోసం రాష్ట్రంలోని సుమారు 3 లక్షల మంది గొర్రెల కాపరులు ఎదురుచూస్తున్నారు. 85 వేలకు పైగా లబ్ధిదారులు ఇప్పటికే డీడీలు తీశారు. వారికి సంబంధించిన రూ.430 కోట్లు ఇంకా కలెక్టర్ల ఖాతాల్లోనే మూలుగుతున్నాయి. మరో 2.20 లక్షలకు పైగా లబ్ధిదారులు డీడీలు తీయాల్సి ఉంది. -
భారీగా పెరిగిన విద్యుత్ వినియోగం
సాక్షి, అమరావతి: దేశంలోనూ, రాష్ట్రంలోనూ గడచిన ఐదేళ్లలో ఎన్నడూ లేనంత అత్యధిక స్థాయిలో సెప్టెంబర్ నెల విద్యుత్ వినియోగం నమోదైంది. జాతీయ స్థాయిలో డిమాండ్‌తో పోటీ పడుతున్నది మన రాష్ట్రం. 2019 సెప్టెంబర్ నెల మొత్తం వినియోగం 4,855.8 మిలియన్ యూనిట్లు కాగా రోజువారీ సగటు డిమాండ్ 161.86 మిలియన్ యూనిట్లుగా ఉంది. అదే ఈ ఏడాది అదే నెల మొత్తం డిమాండ్ 6,550.2 మిలియన్ యూనిట్లుకాగా, రోజువారీ సగటు వినియోగం 218.34 మిలియన్ యూనిట్లకు చేరింది.అంటే మొత్తం వినియోగం ఐదేళ్లలో 1,694.4 మిలియన్ యూనిట్లు, సగటు వినియోగం 56.48 మిలియన్ యూనిట్లు పెరిగింది. విద్యుత్ వినియోగం పెరుగుతున్నదంటే ఆ మేరకు రాష్ట్రంలో ఆర్థిక కార్యకలాపాలు వృద్ధి చెందుతున్నాయని అర్థం. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, పేదలకు ఉచిత, సబ్సిడీ విద్యుత్‌ను ఇవ్వడంతో పాటు వ్యవసాయానికి పూర్తిగా ఉచిత విద్యుత్ ఇవ్వడం వల్ల కూడా విద్యుత్ వాడకం పెరిగింది. దీనివల్ల వ్యవసాయం సక్రమంగా జరిగి పంటలు సంవృద్ధి గా పండుతున్నాయి. వివిధ వర్గాల ప్రజలు తమ వృత్తులను నిర్వర్తిస్తూ, విద్యుత్ బిల్లుల భారం లేకుండా ఆర్థి కంగా స్థిరపడుతున్నారు. ఇవన్నీ రాష్ట్ర అభివృద్ధికి నిదర్శనాలుగా నిలుస్తున్నాయి. విదేశీ బొగ్గుకు అనుమతి పొడిగింపు.. దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ 142 బిలియన్ యూనిట్లకు చేరుకుంది. గడచిన ఐదేళ్లలో ఇదే గరిష్టం. ఆగస్టులో గరిష్ట విద్యుత్ డిమాండ్ 238 గిగావాట్లు జరిగితే సెప్టెంబరులో అది 240 గిగావాట్లకు చేరుకుంది. పెరుగుతున్న ఈ డిమాండ్‌ను తీర్చడానికి విద్యుత్ సంస్థలు స్వల్పకాలిక విద్యుత్ మార్కెట్లో తరచుగా విద్యుత్ కొనుగోలు చేయాల్సి వస్తోంది. అయితే ఆగస్టులో బహిరంగ మార్కెట్లో యూనిట్ రూ.9.60 ఉండగా సెప్టెంబర్‌లో యూనిట్ రూ.9.37గా ఉంది. థర్మల్ పవర్ ప్లాంట్లలో బొగ్గు నిల్వలు తగ్గాయి. రాష్ట్రంలోనూ, దేశంలోనూ వారం రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నాయి. దీంతో బొగ్గు కొరతను తీర్చేందుకు దిగుమతి చేసుకున్న బొగ్గు (విదేశీ బొగ్గు)ను సమకూర్చుకోవడానికి వచ్చే ఏడాది మార్చి 2024 వరకు కేంద్రం గడువు పొడిగించింది. -
రూ.390 సిమెంట్ బస్తా రూ.235కే!
సాక్షి, అమరావతి: గత రెండేళ్లుగా దేశమంతా సిమెంట్ ధరలు పెరుగుతున్నా రాష్ట్రంలో తక్కువ ధరలకే కంపెనీలు సిమెంట్ సరఫరా చేస్తున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు, వివిధ అభివృద్ధి పనులకు సబ్సిడీ ధరకే సిమెంట్‌ను అందిస్తున్నాయి. రూ.390 సిమెంట్ బస్తాను రూ.235కే ఇస్తున్నాయి. ప్రభుత్వం కూడా కాంట్రాక్టర్లకు కాకుండా నేరుగా సిమెంట్ కంపెనీలకే మొత్తాన్ని చెల్లిస్తోంది. దీంతో ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.970 కోట్లు వరకు ఆదా అయ్యింది. ధరల్లో వ్యత్యాసమున్నా తక్కువ ధరకే.. దేశంలో గత రెండేళ్లలో ఇళ్ల నిర్మాణాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో సిమెంట్ బస్తా ధర దేశమంతా దాదాపు రూ.400కు చేరుకుంది. కంపెనీ, దూరాభారం ఆధారంగా ఈ మొత్తంలో రూ.10–20 వరకు తేడా ఉంటోంది. మన రాష్ట్రంలో రూ.380–390 మధ్య సిమెంట్ బస్తా ధర ఉంది. అయితే.. రాష్ట్రంలో సిమెంట్ కంపెనీలు ప్రభుత్వ భవన నిర్మాణ పనులకు గత రెండున్నరేళ్లుగా రూ.235కే సిమెంట్ బస్తాను అందిస్తున్నాయి. సిమెంట్ రేటులో భారీ తేడాల వల్ల అభివృద్ధి పనులు మధ్యలో ఆగిపోవడం, లేదంటే ఆటంకం కలగకూడదని అప్పట్లోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయా సిమెంట్ కంపెనీలతో చర్చలు జరిపింది. దీంతో అప్పుడు మార్కెట్లో రూ.330 దాకా ఉన్న సిమెంట్ బస్తాను రూ.235కే కంపెనీలు సరఫరా చేశాయి. అప్పటి నుంచి «సిమెంట్ ధరల్లో ఎన్ని వ్యత్యాసాలు ఉన్నా అదే ధరకు అందిస్తున్నాయి. ఇప్పటిదాకా 38.83 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా.. రాష్ట్రంలో వివిధ ప్రభుత్వ శాఖల నిర్మాణ పనులకు ఇప్పటిదాకా 38,83,894 టన్నుల సిమెంట్‌ను రూ.235 సబ్సిడీ ధరకే ఆయా కంపెనీలు అందించాయి. గ్రామాల్లో ప్రస్తుతం ఒక్క పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పరిధిలోనే దాదాపు 44,522 భవన నిర్మాణ పనులు సాగుతున్నాయి. వీటిలో రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్స్, డిజిటల్ లైబ్రరీలు, బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ల భవనాలు ఉన్నాయి. వీటిలో కొన్ని నిర్మాణాలు పూర్తి చేసుకోగా.. మరికొన్ని ముగింపు దశకు చేరుకున్నాయి. గ్రామాల్లో భవన నిర్మాణ పనులకే 14,98,941 టన్నుల సిమెంట్‌ను కంపెనీలు సరఫరా చేశాయి. మరో 2.19 లక్షల టన్నుల సిమెంట్ సరఫరా ప్రస్తుతం పురోగతిలో ఉందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు వెల్లడించారు. 14.98 లక్షల టన్నుల్లో అత్యధికంగా 2.10 లక్షల టన్నులను భారతి సిమెంట్స్ సరఫరా చేయగా, ఆ తర్వాత 2.04 లక్షల టన్నులు అల్ట్రాటెక్ కంపెనీ సరఫరా చేసిందని తెలిపారు. అలాగే కేసీపీ, పెన్నా సిమెంట్స్ కంపెనీలు లక్ష టన్నులకుపైగా సరఫరా చేశాయన్నారు. బాబు ప్రభుత్వంలో నాసిరకం పనులు.. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు సిమెంట్ ధరల్లో వ్యత్యాసం కారణంగా ప్రభుత్వ కాంట్రాక్టు పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంది. దీంతో నాసిరకం పనులు జరిగాయని అధికారులు తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో వేసిన అంతర్గత సిమెంట్ రోడ్లలో కొన్నింటిని ఇంజనీరింగ్ విజిలెన్స్ అధికారులు పరిశీలించగా మూడింట రెండొంతులు రోడ్లు ఏ మాత్రం నాణ్యత లేనివిగా తేలింది. ప్రభుత్వానికి భారీగా ఆదా.. గ్రామాల్లో నిర్మాణ పనులకు కంపెనీలు తక్కువ ధరకే సిమెంట్ సరఫరా చేయడంతో ప్రభుత్వానికి రూ.375 కోట్లు దాకా ఆదా అయిందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో అన్ని శాఖల ద్వారా జరిగిన పనుల్లో మొత్తం రూ.970 కోట్లు దాకా ఆదా జరిగిందన్నారు. మరోవైపు సబ్సిడీ ధరకు సిమెంట్ సరఫరాలో ఎక్కడా ఎటువంటి అవినీతి చోటు చేసుకోకుండా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. ఇందుకోసం ‘వైఎస్సార్ నిర్మాణ్’ పేరుతో ప్రత్యేకంగా వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసింది. -
భారతీయులకు శుభవార్త..! 'జియో' కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్..!
భారతీయులకు శుభవార్త. త్వరలో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు జియో కంటే తక్కువ ధరకే లభించనున్నాయి. ఇప్పటికే జియో భారత టెలికాం రంగంలో సంచలనాలను నమోదుచేసింది.అతి తక్కువ ధరలో 4జీ ఇంటర్నెట్ను అందించిన మొబైల్ నెట్వర్క్ సంస్థగా జియో నిలిచింది. పలు కంపెనీలు తమ టారిఫ్ వాల్యూలను తగ్గించాల్సి వచ్చింది. జియో రాకతో ఇంటర్నెట్ రంగంలో పెనుమార్పులే వచ్చాయి. అయితే ఇప్పుడు జియో కంటే తక్కువ ధరకే శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సిద్ధమయ్యారు. ఈ మేరకు ఎలన్ మస్క్ కేంద్రం ప్రభుత్వంతో చర్చలు జరపనున్నారు. ఆ చర్చలు కొలిక్కి వస్తే మనదేశంలో ఇంటర్నెట్ యూజర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు అతితక్కువ ధరకే లభించనున్నాయి. భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ త్వరలో ఎలన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలు భారత్‌లో అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు ఎలా ఉంటాయనే అంశంపై చర్చ జరుగుతుండగా.. స్టార్ లింక్ స్పందించింది. భారతీయులకు అనుగుణంగా శాటిలైట్ ఇంటర్నెట్ను సబ్సిడీకి అందివ్వనున్నట్లు తెలిపింది. వెలుగులోకి వచ్చిన పలు నివేదికల ప్రకారం..మనదేశంలో స్టార్‌లింక్ తన సబ్స్క్రిప్షన్ ప్లాన్లను సబ్సిడీ రేట్లతో అందించే ఆలోచనలో ఉన్నట్లు స్టార్లింక్కి ఇండియా హెడ్ సంజయ్ భార్గవ తెలిపారు. భారత్‌లో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ధర తక్కువగా ఉంటాయని అన్నారు. వినియోగదారులు చెల్లించే ధరలకంటే అందించే సేవలు ఎక్కువగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. స్టార్ లింక్ ప్రస్తుతం దేశంలోని అంతర్గత ప్రాంతాలపై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఇక్కడ ఇంటర్నెట్ సేవల్ని యాక్సెస్ చేయడం చాలా కష్టం. తక్కువ ధర, సరైన సదుపాయల్ని కల్పించడం ద్వారా శాటిలైట్ ఇంటర్నెట్ రూపురేకల్ని మార్చవచ్చని అన్నారు. శాటిలైట్ ఇంటర్నెట్ ధరలు స్పేస్ఎక్స్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. బుకింగ్‌లో భాగంగా కొనుగోలుదారులు రూ.7,500 డిపాజిట్ చెల్లించాలి.అలా చెల్లించిన వారికి ప్యాకేజీలో భాగంగా, స్టార్‌లింక్ డిష్ శాటిలైట్, రిసీవర్, సెటప్ చేయడానికి అవసరమైన అన్ని పరికరాలను అందిస్తుంది. ప్రారంభంలో ఇంటర్నెట్ స్పీడ్ 100-150ఎంబీపీఎస్ పరిధిలో ఉంటుంది. అయితే, తక్కువ భూ కక్ష్యలో మరిన్ని స్టార్‌లింక్ శాటిలైట్లను పంపడం ద్వారా ఇంటర్నెట్ వేగం జీబీపీఎస్‌కి చేరుకోవచ్చని స్టార్‌లింక్ ప్రతినిధులు భావిస్తున్నారు.ప్రస్తుతం ఈ ప్రయోగం ప్రారంభదశలోఉండగా..వచ్చే ఏడాది జూన్ జులై నాటికి కమర్షియల్ సర్వీసులు అందుబాటులోకి తీసుకొని రానున్నారు. 100 స్కూళ్లకు ఉచితం నివేదికలో భాగంగా శాటిలైట్ ఇంటర్నెట్ సెటప్‌ను స్టార్‌లింక్ సంస్థ 100 పాఠశాలలకు ఉచితంగా అందజేస్తుందని, వాటిలో 20 సెటప్‌లు ఢిల్లీ పాఠశాలలకు, మిగిలిన 80 సెటప్‌లు ఢిల్లీ చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ చేయనున్నట్లు స్టార్‌లింక్ ఇండియా బాస్ సంజయ్ భార్గవ స్పష్టం చేశారు. -
టీడీపీని వెంటాడుతున్న పాపాలు
చిత్తూరు అగ్రికల్చర్: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఎస్సీ, ఎస్టీ రైతులకు దక్కాల్సిన సబ్సిడీ ట్రాక్టర్లను జిల్లాలోని టీడీపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు యథేచ్ఛగా దోచుకున్నారు. దీనిపై గత నెల 16న సాక్షిలో ‘ట్రాక్టర్లు మింగేశారు’ అనే కథనంతో వార్త ప్రచురితమైంది. ఈ కథనంలో ఓ ఎమ్మెల్సీ కూడా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. దీనిపై వాస్తవ నివేదిక రూపొందించే పనిలో వ్యవసాయశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. అందులో భాగంగా కలికిరిలో ట్రాక్టర్‌ను అక్రమంగా మంజూరు చేసుకున్న జన్మభూమి కమిటీ సభ్యుడిపై వ్యవసాయశాఖాధికారి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లావ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అనేకం వెలుగులోకి రానున్నాయి. కాగా టీడీపీ ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ కార్యాలయానికి చేరుకొని మంతనాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఏకపక్షంగా స్వాహా.. ప్రభుత్వ పథకాలను తెలుగుతమ్ముళ్లు ఏకపక్షంగా స్వాహా చేశారు. 2015–16 ఏడాదిలో ఆర్కేవీవై కింద జిల్లాలోని రైతు సంఘాలకు 75 శాతం సబ్సిడీపై ట్రాక్టర్లను మంజూరు చేసింది. ఒక రైతు సంఘానికి ఒక యూనిట్ కింద ట్రాక్టర్, రోటోవేటర్, విత్తనాలు వేసే మడకలు తదితరాలను మంజూరు చేసింది. ఒక యూనిట్ విలువ రూ.8.60 లక్షలకు రాయితీ కింద రూ.6.02 లక్షలు ప్రభుత్వం అందించగా, మిగిలిన మొత్తాన్ని రైతులు చెల్లించారు. ఈ విధానం ద్వారా జిల్లాలోని మొత్తం 470 యూనిట్లను ప్రభుత్వం మంజూరు చేసింది. అదేవిధంగా రైతురథం పథకం ద్వారా ఒక్కో ట్రాక్టర్‌కు రూ.1.50 లక్షలు సబ్సిడీతో మొత్తం 1,047 ట్రాక్టర్లను మంజూరు చేసింది. వీటిని మంజూరు చేయడంలో జన్మభూమి కమిటీలు కీలకపాత్ర పోషించాయి. దీన్ని ఆసరాగా తీసుకున్న టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు ట్రాక్టర్లను అర్హతతో ప్రామాణికం కాకుండా అక్రమంగా దోచుకున్నారు. ఆర్కేవీవై పథకం కింద ఎస్సీ, ఎస్టీ రైతు సంఘాలకు అందాలి్సన ట్రాక్టర్లను టీడీపీ నాయకులే దక్కించుకున్నారు. అదేవిధంగా రైతురథం పథకం కింద కూడా ట్రాక్టర్లను బినామీ పేర్లతో సొంతం చేసుకున్నారు. టీడీపీ నేతపై కేసు నమోదు.. సబ్సిడీ ట్రాక్టర్ల మంజూరులో చోటు చేసుకున్న అక్రమాలపై వ్యవసాయశాఖాధికారుల విచారణలో అసలు రంగు బయటపడింది. ఇందులో భాగంగా కలికిరి మండలం కె.కొత్తపల్లెలోని ఏసుప్రభు రైతుమిత్ర సంçఘానికి అందాలి్స న ట్రాక్టర్‌ను టీడీపీ నాయకుడు, జన్మభూమి కమిటీ సభ్యుడు మున్నాఫ్ సాహెబ్ మంజూరు చేసుకుని, తర్వాత విక్రయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో అతడిపై గత నెల 22న వ్యవసాయ అధికారిణి హేమలత పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారు. టీడీపీ నేతల్లో గుబులు.. గత ప్రభుత్వ హయంలో అక్రమంగా మంజూరు చేసుకున్న ట్రాక్టర్లపై విచారణ ప్రారంభం కావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. అప్పట్లో మంజూరైన ట్రాక్టర్లను దాదాపు రైతుల ముసుగులో టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు చేజిక్కించుకున్నారు. ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రాతినిథ్యం వహించే కుప్పం నియోజకవర్గంలోనే ఎక్కువగా అక్రమాలు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. అధికారుల విచారణను ముమ్మరం చేయడంతో ప్రస్తుతం పలువురు టీడీపీ నాయకులు వ్యవసాయశాఖ కార్యాలయాల చుట్టూ తిరగుతున్నారు. అక్రమంగా దోచుకున్న ట్రాక్టర్ల జాబితాలో తమ పేర్లు లేకుండా చూసుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చర్చనీయాంశమైన ఎమ్మెల్సీ రాక.. ట్రాక్టర్ల అక్రమ దోపిడీలో ఓ ఎమ్మెల్సీ ఏకంగా రెండు ట్రాక్టర్లను మంజూరు చేసుకుని క్వారీల్లో, వ్యవసాయ పనుల్లో ఉపయోగించుకుంటున్నట్లు ‘సాక్షి’లో వార్తాకథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు బుధవారం జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయానికి వచ్చినట్లు సమాచారం. ఆయన దాదాపు అరగంట పాటు ఉండి పలువురు అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్సీనే నేరుగా జిల్లా కార్యాలయానికి వచ్చి అధికారులను సంప్రదించడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. -
మలేసియాలోనూ ఆధార్ తరహా వ్యవస్థ
న్యూఢిల్లీ: ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రాయితీల్లో నకిలీ లబ్ధిదారులు, మోసాలను అరికట్టేందుకు మలేసియా కూడా మన ఆధార్ తరహా కార్డులను తమ పౌరులకు జారీచేయాలనుకుంటోంది. ఈ ఏడాది మేలో ప్రధాని నరేంద్ర మోదీ మలేసియాలో పర్యటించినప్పుడు ఈ విషయంలో సాయం చేస్తామని మాటిచ్చారు. దీంతో మలేసియాలో ఆధార్ కార్డులను జారీ చేసే విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఆ దేశ మానవ వనరుల మంత్రి కులా సెగారన్ నేతృత్వంలోని ఓ బృందం గతవారం భారత్‌లో పర్యటించింది. -
75 శాతం సబ్సిడీపై పందుల పంపిణీ
మంత్రి తలసాని వెల్లడి సాక్షి, హైదరాబాద్: ఎరుకలకు 75 శాతం సబ్సిడీపై పందులను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సుమారు 1.2 లక్షల ఎరుకల కుటుం బాలు తద్వారా లబ్ధి పొందుతాయన్నారు. ఎరుకల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం సచివాల యంలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. 75 శాతం సబ్సిడీపై రూ.75 వేల విలువైన 5 ఆడ, ఒక మగ పంది ని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్న ట్లు చెప్పారు. ఎన్సీడీసీ నిధులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నామన్నారు. పందుల పెంపకంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. పంది మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా సర్కారు సాయమంది స్తుందన్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల్లో పందుల పెంపకం ప్రధాన వృత్తిగా ఉంద న్నారు. కులవృత్తులపై ఆధారపడి న కుటుంబాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పించారని, ఆయన ఆశయాల కు అనుగుణంగా సంక్షేమ పథకాలు రూపొం దించి అమలు చేస్తున్నట్లు చెప్పారు. సొసైటీలు ఏర్పాటు చేసుకోండి పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారు 2నెలల్లో సొసైటీలు ఏర్పాటు చేసుకో వాలని, తద్వారా వృత్తిపై ఆధారపడినవారి వివరాలు తెలుస్తాయని మంత్రి అన్నారు. సశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ మంజువాణి, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షు డు రాములు, ప్రధాన కార్యదర్శి రాజు, మహిళా అధ్యక్షురాలు భవాని పాల్గొన్నారు. -
475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యం పట్టివేత
బనగానపల్లె, న్యూస్‌లైన్:అక్రమంగా సరిహద్దులు దాటుతున్న సబ్సిడీ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బనగానపల్లె పట్టణంలోని యోగీశ్వర రైస్ మిల్లు యజమాని శ్రీనివాసులు టర్బో వాహనంలో 210 క్వింటాళ్లు, డీసీఎం వాహనంలో 80 క్వింటాళ్ల బియ్యాన్ని కర్ణాటకలోని తుమ్ముకూరు, బంగారుపేటకు తరలించే ఏర్పాట్లు చేశారు. ఆదివారం ఉదయం వాహనాలు రైస్ మిల్లు నుంచి బయలుదేరగా సమాచారం అందుకున్న విజిలెన్స్ సీఐలు పవన్‌కిషోర్, శ్రీనివాసులు, వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, సిబ్బంది శ్రీనివాసులు, నజీర్, శివ ఆకస్మిక దాడి చేసి యాగంటిపల్లె వద్ద వాహనాలను అడ్డుకున్నారు. రెండు వాహనాల్లోని సబ్సిడీ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక సివిల్ సప్లయ్ స్టాక్ పాయింట్‌కు తరలించారు. అనంతరం యోగీశ్వర రైస్‌మిల్లులో తనిఖీలు చేయగా అక్కడ కూడా 185 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా నిల్వ చేసినట్లు గుర్తించి సీజ్ చేశారు. రూ. 10 లక్షల విలువైన 475 క్వింటాళ్ల సబ్సిడీ బియ్యాన్ని సీజ్ చేసినట్లు సీఐ పవన్ కిషోర్ తెలిపారు. ప్రభుత్వ రేషన్‌కార్డుల ద్వారా పంపిణీ చేసే కిలో రూపాయ బియ్యం అక్రమంగా ఎలా తరులుతున్నాయని, అందుకు బాధ్యులు ఎవరన్న విషయం దర్యాప్తులో వెలుగు చూస్తుందన్నారు.