75 శాతం సబ్సిడీపై పందుల పంపిణీ
మంత్రి తలసాని వెల్లడి
సాక్షి, హైదరాబాద్: ఎరుకలకు 75 శాతం సబ్సిడీపై పందులను పంపిణీ చేస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ వెల్లడించారు. సుమారు 1.2 లక్షల ఎరుకల కుటుం బాలు తద్వారా లబ్ధి పొందుతాయన్నారు. ఎరుకల సామాజిక, ఆర్థికాభివృద్ధికి సంక్షేమ పథకాల అమలుపై శుక్రవారం సచివాల యంలో జరిగిన అవగాహన సదస్సులో మంత్రి మాట్లాడారు. 75 శాతం సబ్సిడీపై రూ.75 వేల విలువైన 5 ఆడ, ఒక మగ పంది ని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్న ట్లు చెప్పారు.
ఎన్‌సీడీసీ నిధులు లేదా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నేరుగా పథకాన్ని అమలు చేయాలని యోచిస్తున్నామన్నారు. పందుల పెంపకంపై ఉన్న అపోహలను తొలగిస్తూ.. పంది మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేసేలా సర్కారు సాయమంది స్తుందన్నారు. అమెరికా, బ్రిటన్, జపాన్ తదితర దేశాల్లో పందుల పెంపకం ప్రధాన వృత్తిగా ఉంద న్నారు. కులవృత్తులపై ఆధారపడి న కుటుంబాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ సంకల్పించారని, ఆయన ఆశయాల కు అనుగుణంగా సంక్షేమ పథకాలు రూపొం దించి అమలు చేస్తున్నట్లు చెప్పారు.
సొసైటీలు ఏర్పాటు చేసుకోండి
పందుల పెంపకంపై ఆధారపడి జీవిస్తున్న వారు 2నెలల్లో సొసైటీలు ఏర్పాటు చేసుకో వాలని, తద్వారా వృత్తిపై ఆధారపడినవారి వివరాలు తెలుస్తాయని మంత్రి అన్నారు. సశుసంవర్ధక శాఖ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య ఎండీ మంజువాణి, ఎరుకల సంఘం రాష్ట్ర అధ్యక్షు డు రాములు, ప్రధాన కార్యదర్శి రాజు, మహిళా అధ్యక్షురాలు భవాని పాల్గొన్నారు.