succide
-
విచారణ సమయంలో నిందితుడి ఆత్మహత్య
సాక్షి, చెన్నై: మాదక ద్రవ్యాల అక్రమ రవాణా విభాగం అధికారుల విచారణ సమయంలో ఓ నిందితుడు మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు తెలంగాణ వాసిగా గుర్తించారు. వివరాలు.. తమకు అందిన సమాచారం మేరకు శుక్రవారం చోళవరంలో చెన్నై మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నియంత్రణ విభాగం అధికారులు నిఘా పెట్టారు. ఈ క్రమంలో రాయప్పరాజు అనే వ్యక్తిని ఆ విభాగం సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి 8 కేజీల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అయపాక్కంలోని ప్రధాన కార్యాలయానికి తరలించి శుక్రవారం రాత్రంతా ప్రశ్నించారు. శనివారం వేకువ జామున రాయప్పరాజు హఠాత్తుగా మూడో అంతస్తులోని విచారణ గది నుంచి బయటకు పరుగులు తీసి అనంతరం కిందకి దూకేశాడు. తీవ్రగాయాలతో పడి ఉన్న రాయప్పరాజును అక్కడి సిబ్బంది ఆవడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యలో రాయప్ప రాజు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై తిరుముల్లైవాయిల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో మృతుడు తెలంగాణ రాష్ట్రం రామకృష్ణాపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. కుటుంబం పరువు పోతుందనే వేదనతో రాయప్పరాజు ఐటీ సంస్థలో పనిచేస్తున్నట్లు కుటుంబ సభ్యులకు చెప్పుకుంటూ, చెన్నై నుంచి మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలిస్తున్నట్లు విచారణలో తేలింది. తాను మాదక ద్రవ్యాలతో పట్టుబడడంతో కుటుంబం తీవ్ర అవమానం పాలవుతుందనే వేదనతో ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చునని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే ఇతని వద్ద పట్టుబడ్డ మాదక ద్రవ్యాలు విమానాశ్రయంలో సీజ్ చేసినవి కావడం గమనార్హం. అక్కడి అధికారులు, సిబ్బంది ఎవరో సీజ్ చేసిన మాదకద్రవ్యాలను ఇతని ద్వారా బయటకు పంపిస్తున్నట్టు తేలింది. దీంతో ఈ కేసును మరింత సమగ్రంగా విచారించేందుకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. మృతుడు 48 కేజీల మేరకు సీజ్ చేసిన మాదక ద్రవ్యాలను తెలంగాణకు తరలించినట్లు ప్రాథమికంగా గుర్తించారు. (చదవండి: దొంగతనం కోసం వచ్చి ఆత్మహత్య..) -
ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య:మహబూబ్‌నగర్
-
విద్యార్థి ఆత్మహత్య
మలికిపురం: మండలంలోని రామరాజులంక గ్రామంలో ఆదివారం రాత్రి మేడిచర్ల లక్ష్మీపతి(18) అనే విద్యార్థి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. బెదిరింపుల వల్లే లక్ష్మీపతి ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని బంధువులు ఆందోళన చేపట్టారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మోటార్ సైకిల్ విషయమై నెల్లాళ్లుగా అదే గ్రామానికి చెందిన దేశినీడి ప్రభాకర్, లక్ష్మీపతికి మధ్య గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం కూడా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, ప్రభాకర్ బెదిరించడం వల్లే లక్ష్మీపతి ఆత్మహత్యకు పాల్పడ్డాడని బంధువులు తెలిపారు. పురుగు మందు తాగిన లక్ష్మీపతిని బంధువులు అమలాపురం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. పోస్టుమార్టం అనంతరం సోమవారం మృత దేహాన్ని స్వగ్రామం తీసుకొచ్చారు. దేశినీడి ప్రభాకర్ ఇంటి ముందు లక్ష్మీపతి మృత దేహం ఉంచి అతని బంధువులు ఆందోళన చేపట్టారు. దాంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అమలాపురం డీఎస్పీ అంకయ్య, పోలీసులు అక్కడకు చేరుకుని చర్చలు జరిపారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. -
విద్యార్థి ఆత్మహత్య
తుని : స్థానిక రైల్వేస్టేషన్ అవుటర్‌లో రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి అచ్చా మోజేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తెలిపారు. కీమేన్ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం గోపాలపట్నం న్యూకాలనీకి చెందిన అచ్చా మోజేష్ (22) అన్నవరం సత్యదేవా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడని, ఆతర్వాత అతని అన్న దయానందం నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రం దగ్గరకు వెళ్లాడు. మోటార్ సైకిల్ వాయిదా చెల్లించేందుకు అక్కడ నుంచి తుని వచ్చాడు. రాత్రి మోజేష్ ఇంటికి తిరిగి రాక పోవడంతో తండ్రి నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మృతదేహం దగ్గర ఉన్న సెల్‌ఫోన్ నుంచి జీఆర్పీ పోలీసులు నాగేశ్వరరావుకు ఫోన్ చేశారు. దాంతో అక్కడకు వచ్చిన నాగేశ్వరరావు రైలు పట్టాలపై ఉన్న మృతదేహం మోజేష్దిగా గుర్తించారు. ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియ లేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు హెచ్‌సీ సింహాచలం తెలిపారు.