విద్యార్థి ఆత్మహత్య
Published Fri, Aug 12 2016 10:26 PM | Last Updated on Fri, Nov 9 2018 5:02 PM
తుని :
స్థానిక రైల్వేస్టేషన్ అవుటర్‌లో రైలు కింద పడి డిగ్రీ విద్యార్థి అచ్చా మోజేష్ ఆత్మహత్య చేసుకున్నట్టు తుని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ సింహాచలం తెలిపారు. కీమేన్ ఇచ్చిన సమాచారం మేరకు శుక్రవారం సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించామన్నారు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తొండంగి మండలం గోపాలపట్నం న్యూకాలనీకి చెందిన అచ్చా మోజేష్ (22) అన్నవరం సత్యదేవా డిగ్రీ కళాశాలలో చదువుతున్నాడు. గురువారం ఉదయం కళాశాలకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చాడని, ఆతర్వాత అతని అన్న దయానందం నిర్వహిస్తున్న మీ సేవ కేంద్రం దగ్గరకు వెళ్లాడు. మోటార్ సైకిల్ వాయిదా చెల్లించేందుకు అక్కడ నుంచి తుని వచ్చాడు. రాత్రి మోజేష్ ఇంటికి తిరిగి రాక పోవడంతో తండ్రి నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. మృతదేహం దగ్గర ఉన్న సెల్‌ఫోన్ నుంచి జీఆర్పీ పోలీసులు నాగేశ్వరరావుకు ఫోన్ చేశారు. దాంతో అక్కడకు వచ్చిన నాగేశ్వరరావు రైలు పట్టాలపై ఉన్న మృతదేహం మోజేష్‌దిగా గుర్తించారు. ఆత్మ హత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియ లేదని కుటుంబ సభ్యులు కన్నీరు పెట్టుకున్నారు. మృతదేహాన్ని తుని ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు హెచ్‌సీ సింహాచలం తెలిపారు.
Advertisement
Advertisement