sucied case
-
స్కూలు విద్యార్థి ఆత్మహత్య కేసులో దోషుల్ని విడిచిపెట్టం
చెన్నై: తమిళనాడులోని తంజావూరులో 17 ఏళ్ల విద్యార్థిని ఆత్మహత్యకు కారణమైన వారిని విడిచిపెట్టమని తమిళనాడు స్కూలు ఎడ్యుకేషన్ మంత్రి అంబిల్ మహేశ్ చెప్పారు. ఈ కేసులో తల్లిదండ్రులకు న్యాయం దక్కేలా చూస్తామన్నారు. ఈ కేసుపై విచారణ జరుగుతోందని సోషల్ మీడియాలో ప్రజలు దీనిని రాజకీయం చేయొద్దని అన్నారు. తంజావూర్ మిషనరీ స్కూల్లో ఇంటర్ చదివే విద్యార్థిని వార్డెన్ తన ఇంట్లో వెట్టిచాకిరి చేయించుకుంటూ ఉండడంతో దానిని భరించలేక జనవరి 9న విషం తీసుకుంది. చావు బతుకుల మధ్య ఆస్పత్రిలో పోరాడుతూ జనవరి 19న తుది శ్వాస విడిచింది. వార్డెన్ ఇంటి పనులు చెయ్యలేక విద్యార్థిని నిండు ప్రాణాన్ని బలి తీసుకోవడంతో సోషల్ మీడియా ఒక్కసారిగా భగ్గుమంది. -
అర్నాబ్‌కు బెయిల్ నో
ముంబై/న్యూఢిల్లీ: రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్ గోస్వామికి బాంబే హైకోర్టులో నిరాశే ఎదురైంది. మధ్యంతర బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్‌ను న్యాయస్థానం తిరస్కరించింది. సోమవారం అర్నాబ్ బెయిల్ అర్జీని పరిశీలించిన డివిజన్ బెంచ్..బెయిల్ కోసం దిగువ కోర్టుకు వెళ్లాలని సూచించింది. సెషన్స్ కోర్టు దీనిపై నాలుగు రోజుల్లోగా నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఓ ఇంటీరియర్ డిజైనర్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించారన్న 2018నాటి కేసులో ఆయన్ను ఈ నెల 4న పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాయిగఢ్ జిల్లా కోర్టు అర్నాబ్‌కు 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రిపబ్లిక్ టీవీకి ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇతరుల ప్రతిష్టకు భంగం కలిగించే అంశాలను టీవీ చానళ్లలో చూపడం, సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయడం ఆపివేస్తున్నామంటూ హామీ ఇవ్వాలని ఏజీఆర్ మీడియా, బెన్నెట్ కోల్మన్ కంపెనీలను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తమపై బాధ్యతరాహితంగా వ్యాఖ్యలు చేస్తున్నాయంటూ ఈ సంస్థలపై బాలీవుడ్ నిర్మాతలు వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది. సామాజిక మాధ్యమాలైన గూగుల్, ఫేస్బుక్, ట్విట్టర్లకు కూడా నోటీసులిచ్చింది. -
ప్రేమ విఫలమై యువకుడి ఆత్మహత్య
సాక్షి, తగరపువలస(విశాఖపట్టణం) : జీవీఎంసీ భీమిలి జోన్ 10వ వార్డు గ్రంథాలయం వీధికి చెందిన మాదాబత్తుల ప్రసాద్(23) 5వ వార్డు కొత్తపేటలోని తన స్నేహితుడు ఇస్పరి జగదీష్ ఇంట్లో శుక్రవారం ఉరిపోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం 10 గంటల సమయంలో స్నేహితుని ఇంటికి మాట్లాడడానికి వచ్చిన ప్రసాద్ కొంతసేపు అక్కడే గడిపాడు. తరువాత జగదీష్ అతడిని కూర్చోబెట్టి స్నానానికి వెళ్లిపోయాడు. తరువాత ప్రసాద్.. జగదీష్ స్నానం చేస్తున్న గదికి బయట నుంచి గడియపెట్టి వరండాలో లుంగీ తీసుకుని సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకున్నాడు. స్నానానికి వెళ్లిన జగదీష్ బయట గడియ పెట్టి ఉండటంతో తలుపులు బాదగా పక్కింటి వారు వచ్చి చూసేసరికి ప్రసాద్ ఉరి వేసుకుని కనిపించాడు. సీమెన్‌గా ఎంపికైన ప్రసాద్ మార్కెట్లో అరటి పండ్ల వ్యాపారం చేసుకునే మాదాబత్తుల వెంకటరావు, రమణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. నెల రోజులు క్రితం పెద్ద కుమారుడు గణేష్‌కు వివాహమైంది. రెండో కుమారుడైన ప్రసాద్ సీమెన్‌గా ఎంపికై ఈ నెల 18న ముంబయిలో విధుల్లో చేరనున్నాడు. దీనికోసం తల్లిదండ్రులు రూ.6 లక్షల వరకు ఖర్చు చేసినట్టు తెలిసింది. ప్రసాద్ భీమిలికి చెందిన ఓ యువతిని ప్రేమించాడని, ఆమె ఇంట్లో కోసం వస్తువులు కొని కూడా ఇచ్చాడని, తీరా ఆమె అతని ప్రేమను తిరస్కరించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు అతని స్నేహితులు చెబుతున్నారు. భీమిలి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో మోహన్‌రెడ్డి?
కరీంనగర్ క్రైం : కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన చాడ నారాయణరెడ్డి ఆత్మహత్య కేసులో మాజీ ఏఎస్సై మోహన్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి తన చావుకు మోహన్‌రెడ్డే కారణమని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. అయితే తమ తండ్రి ఆత్మహత్యతో మోహన్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని ఆయన కుమార్తె పోలీసులకు లిఖితపూర్వంగా రాసిచ్చిన విషయం విదితమే. అయినప్పటికీ ఈ కేసులో మోహన్‌రెడ్డిపై పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఎస్పీ ఆధ్వర్యంలోని ప్రత్యేక పోలీసు బృందం సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.