Sudhir Gupta
-
‘తాత కావాల్సిన వయసులో మూడో భార్య కోసం వేట’
భోపాల్: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్-కిరణ్‌రావుల విడాకుల అంశంపై దేశవ్యాప్తంగా తెగ చర్చ నడుస్తోంది. రెండు వివాహాలు చేసుకున్న ఆమిర్ వైవాహిక జీవితం ఇలా మధ్యలోనే ముగిసిపోవడం.. ఇద్దరు భార్యలకు విడాకులు ఇవ్వడాన్ని పలువురు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నాయకుడు ఒకరు ఆమిర్ ఖాన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన లాంటి వల్లే దేశంలో జనాభా పెరుగుతుందని ఆరోపించారు. ఆ వివరాలు.. మధ్యప్రదేశ్ మంద్సోర్ బీజేపీ ఎంపీ సుధీర్ గుప్తా జనాభా పెరుగుదలకు, అసమానతలకు ఆమిర్ ఖానే బాధ్యుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సుధీర్ గుప్తా మాట్లాడుతూ.. ‘‘ఆమిర్ ఖాన్ తన మొదటి భార్య రీనా దత్తాకు విడాకులు ఇచ్చాడు.. ఆమెతో కలిగిన ఇద్దరు బిడ్డలను వదిలేశాడు. ఆ తర్వాత కిరణ్ రావ్‌ను రెండో వివాహం చేసుకున్నాడు. ఆమెతో ఓ బిడ్డను కన్నాడు. ఇప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. తాత కావాల్సిన వయసులో ఇప్పుడు మూడో భార్య కోసం వెతుకుతున్నాడు. దేశ జనాభాలో అసమానతలకు ఆమిరే కారణం’’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాక ‘‘దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌కు ఎక్కువ భూభాగం.. తక్కువ జనాభా లభించగా.. మనకు అందుకు రివర్స్‌లో జరిగింది. మన దగ్గర జనాభా పెరుగుతుంది తప్ప భూభాగం పెరగడం లేదని.. ఇది ఏమాత్రం మంచిది కాదు’’ అన్నారు సుధీర్ గుప్తా. కాగా తమ 15 ఏళ్ల వైవాహిక జీవితానికి ఆమిర్ ఖాన్- కిరణ్ రావులు చరమగీతం పాడారు. వీరికి సరోగసీ ద్వారా ఆజాద్ రావు అనే కుమారుడు ఉన్నాడు. కిరణ్ రావుని వివాహం చేసుకోకముందు ఆమిర్, రీనా దత్తాను వివాహం చేసుకోగా వారికి జునైద్ అనే కొడుకు, ఇరా అనే కుమార్తె ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా ఆమిర్ ఖాన్, కిరణ్ రావులు విడిపోతున్నట్లు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. -
తీరని అనుమానాలు.. తేలని వివాదాలు...
మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. ఏదో ఒకటి చేసి అందరి దృష్టినీ ఆకర్షించాలనుకుంటారు కొందరు... సంచలనం సృష్టించైనా అనునిత్యం వార్తల్లో ఉం డాలనుకుంటారు మరికొందరు... అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా వీటిలో రెండోకోవకు చెందినవానిగా కనిపిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శశిథరూర్ భార్య సునందా పుష్కర్ మృతిపై ఆయన రేకెత్తించిన తాజా వివాదం ఇందుకు నిదర్శనం. సునందది సహజమరణమే నంటూ నివేదిక ఇవ్వాలని తమపై ఒత్తిడి జరిగిందని, పోస్టు మార్టమ్ నివేదికలో మార్పు కోసం తమను ఒత్తిడి చేశారని సుధీర్ చెప్పడం మీడియాలో సంచలనం సృష్టించింది. పోస్టుమార్టమ్ నిర్వహించిన డాక్టర్ల బృందానికి డాక్టర్ సుధీర్ గుప్తానే నేతృత్వం వహించారు. నివేదిక ఆయనే ఇచ్చారు. అంటే ఆమెది సహజమరణం కాకపోయినా సహ జమరణంగా వారు నివేదిక ఇచ్చారా? అసలు సుధీర్‌గుప్తా మాటలకు ఇపుడు ఏం విలువ ఉంటుంది? ఇంతకాలం ఆయన ఎందుకు ఊరుకున్నారు? ఇప్పుడు ఆయన వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలున్నాయని ఈ ఆరోపణ చేస్తున్నారు? అసలు నివేదికను మార్చాల్సిందిగా సుధీర్‌పై ఒత్తిడి తీసుకువచ్చినవారెవరు? ఇలాంటి ప్రశ్నలకు మాత్రం సమా ధానాల్లేవు. సుధీర్‌గుప్తా చేస్తున్న ఆరోపణలను ఎయిమ్స్ ప్రతినిధులు నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నారు. సుధీర్ వ్యవహా రశైలి సరైంది కాదని, సంచలనాలకు ఆయన ప్రాధాన్యమి స్తుంటారని, అందుకే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంటారని ఎయిమ్స్ వర్గాలంటున్నాయి. అయితే సునంద ఉదంతం వివాదాలకతీతమేమీ కాదు నిజానికి ఆమె మరణంపై అప్ప ట్లోనే అనేక అనుమానాలొచ్చాయి. వాటిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరుగుతోంది కూడా. అప్పట్లో కాంగ్రెస్ అధికా రంలో ఉండడం వల్ల దర్యాప్తుపై అధికారపక్ష ప్రభావం ఉండి ఉంటుందన్న ఆరోపణలు వచ్చాయి. కానీ మితిమీరిన స్థాయిలో వ్యాధినిరోధక ఔషధాలను తీసుకోవడం వల్లనే సునంద మరణించారని ఎయిమ్స్ పోస్టుమార్టమ్ నివేదిక పేర్కొంది. అందుకే ఇపుడు సుధీర్‌గుప్తా ఆరోపణలకు విలువ లేకుండా పోయింది. అయితే అసలు ఈ సుధీర్‌గుప్తా ఎవరు... ఆయన వ్యవహారశైలి ఎలాంటిది అనేదానిపై ఆసక్తి కలగడం సహజమే. ఎయిమ్స్‌లో కీలకమైన స్థానంలో ఉన్న సుధీర్‌గుప్తా తన వార్షిక నివేదికలలో కూడా ఇలాంటి సంచలనాలకే ప్రాధాన్యమిస్తుంటారట. 1996లో సీనియర్ డిమాన్స్ట్రే టర్గా ఉన్న గుప్తా ఆనాటి ఎయిమ్స్ డెరైక్టర్‌పై ఆరోపణల వర్షం కురిపిస్తూ రాసిన లేఖలు అప్పట్లో పెను సంచలనం. సుధీర్‌ది సమతుల్యత లేని వ్యక్తిత్వమని 2010లో అప్పటి ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ టీడీ డోగ్రా లేఖరాశారు. అంతేకాదు సుధీర్ అలవోకగా అబద్ధాలాడేస్తారని, నమ్మ దగిన వ్యక్తి కాదని, గొడవలు పెట్టుకునే మనస్తత్వమని, అస్సలు క్రమశిక్షణ లేనివాడని ఆ లేఖలో డోగ్రా ఘాటు విమర్శలు చేశారు. మెడికల్ రిజిస్టర్ నుంచి గుప్తా పేరును తొలగించాలంటూ 2004లో మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎథిక్స్ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. ఆ వివాదం ఐదేళ్ల పాటు కొనసాగింది. అందుకే సుధీర్ చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలకు ఎయిమ్స్ అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఇక సునంద మరణంపై రేకెత్తిన తాజా వివాదాగ్నిలో బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి కూడా తోచినంత ఆజ్యం పోస్తున్నారు. ఆమెది సహజమరణం కాదని, ఆమెను రష్యా విషంతో హత్య చేశారని స్వామి పేర్కొంటున్నారు. అందుకు సంబంధించి తన వద్ద గట్టి సాక్ష్యాధారాలున్నాయని కూడా ఆయన అంటున్నారు. ఆధారాలుంటే ఆయన తక్షణం ఈ కేసు విచారిస్తున్న ఢిల్లీ పోలీసులకు అందజేయడం సబబు కదా! అసలు ఆధారాలున్నపుడు ఆయన ఇన్నాళ్లూ ఎందుకు ఊరుకున్నట్లు? అసలు సుధీర్ గుప్తా వివాదం రేకెత్తించే వరకు ఎందుకు ఆగినట్లు? నెహ్రూ గాంధీ కుటుంబంపై అనేక ఏళ్లుగా అటు న్యాయస్థానాల్లోనూ, ఇటు రాజకీయం గానూ పోరాడుతున్న స్వామి ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడంలో ఆశ్చర్యమేమీ లేదు. ఎందుకంటే సునంద మరణం వెనుక ఐపీఎల్ రహస్య ఒప్పందాల గుట్టుమట్లు న్నాయని, సోనియా అల్లుడు రాబర్ట్ వాధ్రా ఉన్నాడని స్వామి గతంలో పలుమార్లు ఆరోపణలు చేశారు. ఏది ఏమైనా సునందా పుష్కర్ మరణంలో లోకానికి తెలియని చీకటి కోణాలనేకం ఉన్నాయనే చర్చ ఇప్పటిది కాదు. అందుకే ఈ వ్యవహారంలో ఇప్పటికైనా నిష్పాక్షిక విచారణ జరిపించి నిజానిజాలు నిగ్గు తేల్చాలి. నిందితులను కఠినంగా శిక్షించాలి. సంచలనం కోసం, వ్యక్తిగత మైలేజీ కోసం పాకులాడకుండా సుధీర్‌గుప్తా, సుబ్రహ్మణ్యస్వామి వంటి వారు ఈ కేసు దర్యాప్తు సవ్యంగా సాగేందుకు సహకరిస్తే మంచిది. -పోతుకూరు శ్రీనివాసరావు -
సునంద పుష్కర్ మృతికి ముందు, తర్వాత ఆసక్తికర అంశాలు!
అంతా సద్దుమణిగిందనుకుంటున్న మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మరణంపై మరోసారి దుమారం రేపుతోంది. సునందా పుష్కర్ మృతిపై తాము చెప్పినట్లుగా నివేదిక ఇవ్వాలని ఉన్నతస్థాయి నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వచ్చినట్లు ఎయిమ్స్ పోర్సెన్సిక్ విభాగం అధిపతి డాక్టర్ సుధీర్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేయడంతో సునంద పుష్కర్ మృతి చుట్టు తాజాగా వివాదం ముసురుకుంది. సునంద, ఆమె మృతి వెనుక కొన్ని ఆసక్తికరమైన అంశాలున్నాయి. అక్టోబర్ 2009లో ఓ పార్టీలో సునంద, థరూర్ లు కలుసుకున్నారు. థరూర్ ఎంపీగా ఎన్నికైన తర్వాత 2010లో సునంద, థరూర్ లు పెళ్లి చేసుకున్నారు. గతంలో థరూర్ తిలోత్తమ ముఖర్జీని పెళ్లి చేసుకోగా, సునంద సంజయ్ రైనా అనే కాశ్మీరీని పెళ్లి చేసుకున్నారు. అయితే థరూర్, సునందలు తొలి వివాహానికి ముగింపు పలికి విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత ఐక్యరాజ్యసమితిలో సేవలందిస్తుండగా సహ ఉద్యోగి క్రిస్టా జైల్స్ ను వివాహం చేసుకున్నారు. 2010లో ఐపీఎల్ లో కోచి జట్టును సునంద కొనుగోలు చేయడం వెనుక 70 కోట్ల అవినీతి జరిగిందనే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. సునంద పుష్కర్ 2014 జనవరి 17 తేదిన ఢిల్లీలోని హోటల్ లీలాలోని నంబర్ 345 గదిలో మరణించింది. సునంద పుష్కర్ మధ్యాహ్నం 3.30 గంటలకు చివరిసారిగా కనిపించింది. సునంద మరణించినట్టు రాత్రి 9 గంటల ప్రాంతంలో శశి థరూర్, ఇద్దరు హోటల్ సిబ్బంది గుర్తించారు. సునంద మృతదేహంపై 12 గాయాలున్నట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అయితే ఆ గాయాలు ప్రాణాంతకం కాదని చెప్పడం అనేక సందేహాలు రేకెత్తాయి. సునందపై దాడి జరిగిందా అనే అనుమానాలు తలెత్తాయి. సునంద మరణించడానికి ముందు రోజు పాకిస్థానీ జర్నలిస్ట్ మెహర్ తరార్ తో సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లో గొడవ జరిగినట్టు తెలిసింది. శశి థరూర్, మెహర్ తరార్ ల మధ్య వివాహేతర సంబంధం కొనసాగుతుందనే విధంగా సునంద ట్విటర్ లో సందేశాల్ని పోస్ట్ చేశారు. సునంద పుష్కర్ ది ఆత్మహత్య కాదు. హత్యే అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి ఆరోపించారు. సునంద మరణం తర్వాత థరూర్ తీరుపై సుబ్రమణ్య స్వామి పలు అనుమానాలను వ్యక్తం చేశారు. రష్యాలో తయారైన విషం కారణంగానే సునంద మరణించిందని స్వామి అన్నారు. సునంద మరణంపై మూడవ అభిప్రాయాన్ని సేకరించాలని ఢిల్లీ పోలీసులు సూచించడం అనేక సందేహాలకు తెరతీసాయి. ఏయిమ్స్, సీఎఫ్ఎస్ఎల్ నివేదికల మధ్య పొంతన లేకపోవడంతో మరో నివేదిక అవసరమని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆమెది సహజ మరణం కాదని ఫోరెన్సిక్ నిపుణులు పలు విధాలు అనుమానాలు వ్యక్తం చేశారు. సునంద మృతిపై అనేక సందేహాలున్నాయనే ఆరోపణలు వచ్చినప్పటికి.. యూపీఏ ప్రభుత్వంలోని కొందరు పెద్దలు ఈ కేసును మరుగునపడేసేందుకు అనేక ఒత్తిడులు వచ్చాయని విమర్శలు చెలరేగాయి. అయితే ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగానే కొన్ని వాస్తవాలు వెలుగు చూడలేకపోయాయని వార్తలు వెలువడ్డాయి. అయితే తాజాగా ఎయిమ్స్ వైద్యుడు సుధీర్ గుప్తా సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ (క్యాట్) కు ఓ నివేదికను అందిచేస్తూ తమపై అనేక ఒత్తిళ్లు వచ్చాయని మీడియాతో చెప్పడం వివాదంగా మారింది. సునంద మృతిపై మరుగున పడిన వాస్తవాలు ఈసారైనా వెలుగులోకి వస్తాయా అనే ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజులాగితే తెలుస్తుందేమో!Follow @sakshinews