sudo police hulchul
-
వ్యభిచారం నిర్వహిస్తున్నావంటూ..
సాక్షి, హైదరాబాద్: టాస్క్ ఫోర్స్ పోలీసులమంటూ ఓ వ్యక్తి ని బెదిరించి డబ్బులు వసూలు చేసిన నకిలీ పోలీసుల ముఠాని శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. మల్కాజిగిరి ఏసీపీ సందీప్ మీడియాతో మాట్లాడుతూ.. అమ్మాయిలతో వ్యభిచారం నిర్వహిస్తున్నావు అంటూ బాధితుడిని సూడో పోలీసుల ముఠా బెదిరించిందని తెలిపారు. బాధితుడు గ్రంధి శివానంద స్వామిని రూ. లక్ష డిమాండ్ చేసి 88 వేల రూపాయలు వసూలు చేశారని తెలిపారు. ఈ ముఠాకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేసినట్లు ఆయన వెల్లడించారు. నిందితుల్లో హైదరాబాద్ కమిషనరేట్‌లో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయి కుమార్‌తో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుంచి ఒక తుపాకీ , రూ. 63 వేల నగదు, ఒక పోలీస్ యూనిఫామ్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. -
రూ.7.50 లక్షలతో ఉడాయించిన సూడో పోలీసులు
హైదరాబాద్: పోలీసులమంటూ దుండగులు నగల వ్యాపారిని బెదిరించి రూ. ఏడున్నర లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి గోపీనాథ్ ఇటీవల వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లారు. మళ్లీ తిరిగి బుధవారం తెల్లవారుజామున రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు. ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన్ని ఆగంతకులు అటకాయించారు. తాము పోలీసులమంటూ బెదిరించి... బ్రౌన్‌షుగర్ అమ్ముతున్నావని సమాచారం ఉంది... తనిఖీ చేయాలని అతడిని నిలదీశారు. దీంతో వారు గోపీనాథ్ వద్ద ఉన్న రూ.20 లక్షల నగదు, 25 కిలోల వెండి సామగ్రిని తనిఖీ చేస్తున్నట్లు నటించి... రూ.7.5 లక్షల నగదుతో ఉడాయించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మహంకాళి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.