రూ.7.50 లక్షలతో ఉడాయించిన సూడో పోలీసులు | sudo police hulchul in mahankali police station limits | Sakshi
Sakshi News home page

రూ.7.50 లక్షలతో ఉడాయించిన సూడో పోలీసులు

Published Wed, Aug 3 2016 1:54 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

sudo police hulchul in mahankali police station limits

హైదరాబాద్: పోలీసులమంటూ దుండగులు నగల వ్యాపారిని బెదిరించి రూ. ఏడున్నర లక్షలను దోచుకెళ్లారు. ఈ ఘటన బుధవారం మహంకాళి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... సికింద్రాబాద్‌కు చెందిన బంగారం వ్యాపారి గోపీనాథ్ ఇటీవల వ్యాపార నిమిత్తం చెన్నై వెళ్లారు. మళ్లీ తిరిగి బుధవారం తెల్లవారుజామున రైలులో సికింద్రాబాద్ చేరుకున్నారు.

ఇంటికి వస్తున్న క్రమంలో ఆయన్ని ఆగంతకులు అటకాయించారు. తాము పోలీసులమంటూ బెదిరించి... బ్రౌన్‌షుగర్ అమ్ముతున్నావని సమాచారం ఉంది... తనిఖీ చేయాలని అతడిని నిలదీశారు. దీంతో వారు గోపీనాథ్ వద్ద ఉన్న రూ.20 లక్షల నగదు, 25 కిలోల వెండి సామగ్రిని తనిఖీ చేస్తున్నట్లు నటించి... రూ.7.5 లక్షల నగదుతో ఉడాయించారు. తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు మహంకాళి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement