suger levels
-
ఈ స్మార్ట్ వాచ్ స్పెషాలిటీ ఇదే.. ధర ఎంతంటే?
డయాబెటిస్ బాధితులు ప్రతినిత్యం చక్కెర స్థాయి తెలుసుకుంటూ ఉండాలి. చక్కెర స్థాయి తెలుసుకోవాల్సి వచ్చినప్పుడల్లా వేలిని సూదితో గుచ్చి నెత్తుటిచుక్కలు బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ నెత్తుటిచుక్కల ద్వారానే ఇప్పుడు అందుబాటులో ఉన్న గ్లూకోమీటర్లు చక్కెర స్థాయిని నిర్ధారించగలుగుతున్నాయి. ఇప్పటి వరకు డయాబెటిస్ బాధితులకు ప్రతిరోజూ ఈ నొప్పి తప్పడంలేదు. ఎలాంటి నొప్పి లేకుండానే, నెత్తుటి చుక్క చిందించకుండానే చక్కెర స్థాయిని కచ్చితంగా చెప్పగలిగే స్మార్ట్‌వాచీని కొరియన్ కంపెనీ ‘శామ్సంగ్’ అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్‌వాచీ మీటల మీద చేతి మధ్యవేలు, ఉంగరంవేలు కొద్ది క్షణాలు అదిమిపెట్టి ఉంచితే చాలు, శరీరంలో చక్కెర స్థాయి ఎంత ఉందో స్క్రీన్ మీద చూపిస్తుంది. ‘శామ్సంగ్’ రూపొందించిన ఈ గెలాక్సీ స్మార్ట్‌వాచ్ చక్కెర స్థాయితో పాటు శరీరంలో కొవ్వు పరిమాణం, కండరాల పరిమాణం వంటి వివరాలను కూడా చెబుతుంది. దీని ధర 81.26 డాలర్లు (సుమారు రూ.6750) మాత్రమే! -
Apple watch: బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ ఇప్పుడు చాలా సింపుల్.. ఎలా?
మారుతున్న ప్రపంచంలో మనం వినియోగించే వస్తువులు కూడా అప్డేట్ అవుతూనే ఉన్నాయి, ఇప్పటికే అనేక ఆధునిక ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్న యాపిల్ వాచ్ ఇప్పుడు బ్లడ్ గ్లూకోజ్ ట్రాకింగ్ చేయడానికి ఉపయోగపడేలా తయారైంది. నిజానికి షుగర్‌బాట్ అనేది ఐఫోన్ యాప్. ఇది వినియోగదారులు తీసుకునే ఆహారంలో ఉన్న షుగర్ లెవెల్స్ ట్రాక్ చేస్తుంది. ఎప్పటికప్పుడు షుగర్ లెవెల్స్ ట్రాక్ చేయడం వల్ల ఆరోగ్యం పట్ల మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వాచ్ఓఎస్ వెర్షన్‌తో వస్తున్న లేటెస్ట్ అప్డేట్తో ఆపిల్ వాచ్ వినియోగదారులు నేరుగా యాక్సెస్ చేయవచ్చు. ఇక మీరు యాపిల్ వాచ్‌తో క్యాలరీలు, షుగర్ లెవెల్స్ తెలుసుకోవడంలో షుగర్‌బాట్ ఎంతగానో సహాయపడుతుంది. తెలియని వారు కూడా సులభంగా షుగర్‌బాట్ ఉపయోగించవచ్చు. యాప్ ఓపెన్ చేసిన వెంటనే రోజులో తీసుకున్న ఆహారం గురించి ప్రస్తావించాలి, ఇందులో చికెన్ సూప్ నుంచి బిగ్ మ్యాక్ వరకు అనేక ఆహారాల డేటాబేస్ ఉంటుంది. (ఇదీ చదవండి: Zomato Everyday: హోమ్ స్టైల్ మీల్స్.. కేవలం రూ. 89 మాత్రమే) మీరు తీసుకున్న ఆహరం యాప్‌లో లేకపోతే చింతించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మాన్యువల్‌గా కూడా మీరు తీసుకున్న ఆహారం గురించి జోడించవచ్చు. ఈ యాప్ క్యాలరీలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, సూక్ష్మపోషకాలు, విటమిన్లు వంటి డేటాకు సంబంధించిన అన్ని వివరాలు వెల్లడిస్తుంది. -
ముఖ్యమంత్రికి పెరిగిన షుగర్ లెవల్స్
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షుగల్ లెవల్స్ పెరిగాయి. ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు చికిత్స తీసుకునేందుకు ఈ నెల 7న బెంగళూరు వెళుతున్నారు. బెంగళూరులో కేజ్రీవాల్ గతంలోనూ ప్రకృతి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా 10 నుంచి 12 రోజులు ఆయన బెంగళూరులో గడిపే అవకాశముంది. చికిత్స ముగిసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారు.