న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు షుగల్ లెవల్స్ పెరిగాయి. ఆయన మధుమేహం వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకు చికిత్స తీసుకునేందుకు ఈ నెల 7న బెంగళూరు వెళుతున్నారు. బెంగళూరులో కేజ్రీవాల్ గతంలోనూ ప్రకృతి చికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే. చికిత్సలో భాగంగా 10 నుంచి 12 రోజులు ఆయన బెంగళూరులో గడిపే అవకాశముంది. చికిత్స ముగిసిన తర్వాత ఢిల్లీకి చేరుకుంటారు.