Sujala mainstream project
-
అడుగడుగునా నిర్లక్ష్యం
తిరుపతి తుడా: గాలేరు- నగిరి సుజల స్రవంతి ప్రాజెక్టుకు అడుగడుగునా నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఇప్పటికీ అటవీ అనుమతులు తీసుకోకుండా ప్రాజెక్టును ప్రారంభించాలని కోరడం ఆశ్చర్యం. గాలేరు-నగరి ప్రాజెక్టు ఎనిమిదో ప్యాకేజీ కింద కాలువ పనులు ప్రారంభించాలంటే తప్పనిసరిగా అటవీ అనుమతులు అవసరం. ఈ పరిధిలోని భూమికి బదులుగా ప్రత్యామ్యాయ భూములను ఇవ్వాలని అటవీశాఖ కోరుతోంది. ఆ భూములను కలెక్టర్ చూపించి అనుమతులు కోరితే ఇవ్వడానికి అటవీశాఖ సిద్ధంగా ఉంది. అయినా ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదు. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నపుడు చిత్తూరు జిల్లాకు తాగునీరు అందించేందకు గాలేరు-నగిరి ప్రాజెక్టుకు రూపకల్పన దిద్దారు. ఆయన మరణానంతరం 9 ఏళ్ల పాటు ఈ ప్రాజెక్టు ఊసే లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2007లో ఈప్రాజెక్టును మళ్లీ తెరపైకి తెచ్చారు. పనులు వేగవం తం చేయాలని ఆదేశించారు. అందుకు తగ్గట్టే నిధులను కేటాయించారు. ఆయన సీఎంగా ఉన్నంతకాలం కాలువ పనులు (ఒకటి నుంచి ఏడవ ప్యాకేజీ వరకు) శరవేగంగా పరుగులు తీశాయి. ఆయన మరణానంతరం ఈ ప్రాజెక్టు మళ్లీ మరుగున పడింది. 2009 నుంచి అనుమతులకు ప్రయత్నం గాలేరి-నగిరి ప్రాజెక్టుకు సంబంధించి రైల్వే కోడూరు ప్రాంతంలోని శెట్టిపల్లి నుంచి నగరి వరకు 94 కిలోమీటర్ల పరిధి తిరుపతి సర్కిల్‌లోకి వస్తుంది. శెటిపల్లి నుంచి తిరుపతి అలిపిరి ప్రాంతం వరకు 25 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతంలో కాలువ పయనిస్తుంది. 1225 హెక్టార్ల అటవీ భూమి అవసరమని, 2009లో అటవీశాఖ అనుమతుల కోసం ప్రతిపాదనలు పంపారు. అనుమతులు ఇచ్చేందుకు తమకు ఎలాంటి ఇబ్బందిలేదని అయితే అటవీ అభివృద్ధికి తమకు ప్రత్యామ్నాయంగా మరెక్కడైనా 1225 హెక్టార్ల భూమి ఇవ్వాలని అటవీశాఖ కోరింది. అయితే అదే ఏడాదిలో అప్పటి జిల్లా కలెక్టర్ అటవీ శాఖ కోరిన భూమిని ఇచ్చేందుకు 12 ప్రాంతాల్లో స్థలాన్ని చూపించారు. ఆ 12 ప్రాంతాల్లోని భూముల్లో అటవీ అభివృద్ధి చేయలేమని అటవీ శాఖ నిరాకరించింది. ఒకటి రెండు ప్రాంతాల్లో భూమిని చూపాలని తిరిగి 2010లో అటవీ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఆ తర్వాత ప్రభుత్వాలు ఈ విషయాలను విస్మరించాయి. అటవీశాఖ కోరిన భూమిని ప్రభుత్వం చూపించకపోగా అప్పటి నుంచి ఇప్పటివరకు అటవీశాఖ అనుమతుల కోసం ప్రయత్నం కూడా చేయలేదు. అటవీ అనుమతులు లేకనే మళ్లీ అడుగులు జూలై మూడో వారం గాలేరి-నగరి ప్రాజెక్టు మళ్లీ తెరపైకి వచ్చింది. తిరుపతి సర్కిల్ రీచ్‌ను ఎనిమిది నుంచి 14 ప్యాకేజీలుగా ప్రభుత్వం నిర్ణయించి పనులు చేయాలని సూచించింది. ఇందుకు కాం ట్రాక్టర్లు ముందుకు రావాలని కోరింది. ఎనిమిదో ప్యాకేజీకి ఓ ప్రముఖ సంస్థ పనులు చేసేందుకు ముందుకు వచ్చింది. అయితే పనులు ప్రారంభించాలంటే ముందు అటవీశాఖ అనుమతులు పొందాల్సిఉంది. జిల్లా కలెక్టర్ అటవీ శాఖకు ఇవ్వాల్సిన 1225 హెక్టార్ల భూమిని పరిశీలించి కేటాయిస్తే అనుమతులకు మార్గం దాదాపు దొరికినట్టే. అలాంటి ప్రయత్నాలు చేయకుండా పనులు ఎలా ప్రారంభిస్తారో తెలియడంలేదని ఓ అటవీ శాఖ అధికారి అనుమానం వ్యక్తం చేశారు. -
రైతుకు నిరాశ మిగిల్చిన
ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రెండో దశకు ఉప కాలువల గ్రహణం పట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. ఉప కాలువలు, వాటికి అవసరమైన భూ సేకరణ చర్యలే లేవు. గిట్టుబాటు ధర సమస్యపై కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అందుకనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బి.కొత్తకోట, న్యూస్‌లైన్: అనంత వెంకటరెడ్డి(ఏవీఆర్) హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఉప కాలువల పనులు అటకెక్కారుు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 31 ప్యాకేజీల్లో ప్రాజెక్ట్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. చివరి పొలాల దాకా నీటిని అందించేందుకు ప్రధాన, బ్రాంచ్ కెనాళ్ల నుంచి ఉప కాలువల పనులు చేయాల్సి ఉంది. దీని బాధ్యత కాంట్రాక్టర్లదే. ప్రభుత్వం ఎకరాకు రూ.4,700తో పనులు చేపట్టేందుకు నిర్ణయించడంతో ఏజెన్సీలు (కాంట్రాక్టర్లు) అంగీక రించి ఒప్పందం చేసుకున్నాయి. ఉప కాలువల నిర్మాణంలో కల్వర్టులు, రోడ్లు, వంతెనల అవసరం ఏర్పడితే కాంట్రాక్టర్లే నిర్మాణం చేయాలి. 200 6లో ప్రాజెక్టు కాలువల పనులు చేపట్టిన కాం ట్రాక్టర్లు దాదాపుగా పూర్తి చేశారు. పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో ఉప కాలువల సర్వే పనులు నత్తనడకన సాగుతున్నారుు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో నామమాత్రపు సర్వే జరుగుతోంది. మిగతా ఎక్కడా సర్వే ఊసేలేదు. వీటికి అవసరమైన భూ సేకరణ చర్యలూ లేవు. మొదట భూసేకరణ జరగాల్సి ఉన్నా అధికార యంత్రాంగం దృష్టి పెట్టడంలేదు. అదనపు భారం రూ.246కోట్లు ఒప్పందం మేరకు ఉప కాలువలను పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులేత్తేశారు. ఇరవై ఏళ్ల క్రితం తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇచ్చిన విధంగానే తమకూ విలువ పెంచాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ప్రతిపాదనలను పంపాలని సూచిం చింది. ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు విలువ పెంచుతూ ప్రతిపాదనలను పంపారు. ఎకరాకు రూ.4,700తో ఒప్పందం జరగ్గా, దాన్ని రూ. 10,500కు పెంచాలని ఉన్నతాధికారులు ప్రతి పాదించారు. దీంతో ఎకరాకు రూ. 5,800 పెంచిన ట్లవుతుంది. దీన్ని ప్రభుత్వం సవరిస్తూ నిర్ణయం తీసుకుంటే అదనంగా రూ. 246.50 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. దాంతో అనుమతి ఇవ్వకుండా కాలయూపన చేస్తోంది. అనుమతి రావాల్సి ఉంది ఉప కాలువల నిర్మాణానికి గిట్టుబాటు ధరను పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. పాత ఒప్పందం రూ.4,700 మేరకు కాకుండా ఎకరాకు రూ.10,500 పెంచాలని నివేదించాం. ఉప కాలువల పనులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం కాంట్రాక్టర్లు వేచి ఉన్నారు. -పి.కృష్ణ, ఎస్ఈ, ప్రాజెక్టు సర్కిల్-3