ఏవీఆర్ హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు రెండో దశకు ఉప కాలువల గ్రహణం పట్టింది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి పనులు పూర్తి కావాల్సి ఉన్నా ఒక్క అడుగూ ముందుకు పడడం లేదు. ఉప కాలువలు, వాటికి అవసరమైన భూ సేకరణ చర్యలే లేవు. గిట్టుబాటు ధర సమస్యపై కాంట్రాక్టర్లు చేతులెత్తేశారు. అందుకనుగుణంగా అధికారులు ప్రతిపాదనలు పంపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు.
బి.కొత్తకోట, న్యూస్‌లైన్: అనంత వెంకటరెడ్డి(ఏవీఆర్) హంద్రీ-నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ఉప కాలువల పనులు అటకెక్కారుు. చిత్తూరు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల్లో 4.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం 31 ప్యాకేజీల్లో ప్రాజెక్ట్ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించింది. చివరి పొలాల దాకా నీటిని అందించేందుకు ప్రధాన, బ్రాంచ్ కెనాళ్ల నుంచి ఉప కాలువల పనులు చేయాల్సి ఉంది. దీని బాధ్యత కాంట్రాక్టర్లదే. ప్రభుత్వం ఎకరాకు రూ.4,700తో పనులు చేపట్టేందుకు నిర్ణయించడంతో ఏజెన్సీలు (కాంట్రాక్టర్లు) అంగీక రించి ఒప్పందం చేసుకున్నాయి.
ఉప కాలువల నిర్మాణంలో కల్వర్టులు, రోడ్లు, వంతెనల అవసరం ఏర్పడితే కాంట్రాక్టర్లే నిర్మాణం చేయాలి. 200 6లో ప్రాజెక్టు కాలువల పనులు చేపట్టిన కాం ట్రాక్టర్లు దాదాపుగా పూర్తి చేశారు. పుంగనూరు, పెద్దపంజాణి మండలాల్లో ఉప కాలువల సర్వే పనులు నత్తనడకన సాగుతున్నారుు. తంబళ్లపల్లె నియోజకవర్గంలోని పెద్దమండ్యంలో నామమాత్రపు సర్వే జరుగుతోంది. మిగతా ఎక్కడా సర్వే ఊసేలేదు. వీటికి అవసరమైన భూ సేకరణ చర్యలూ లేవు. మొదట భూసేకరణ జరగాల్సి ఉన్నా అధికార యంత్రాంగం దృష్టి పెట్టడంలేదు.
అదనపు భారం రూ.246కోట్లు
ఒప్పందం మేరకు ఉప కాలువలను పనులు చేయలేమంటూ కాంట్రాక్టర్లు చేతులేత్తేశారు. ఇరవై ఏళ్ల క్రితం తెలుగుగంగ ప్రాజెక్టుకు ఇచ్చిన విధంగానే తమకూ విలువ పెంచాలన్న డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. దీనిపై ప్రభుత్వం ప్రతిపాదనలను పంపాలని సూచిం చింది. ఏడాది క్రితమే ఉన్నతాధికారులు ప్రభుత్వానికి కాంట్రాక్టర్ల డిమాండ్ మేరకు విలువ పెంచుతూ ప్రతిపాదనలను పంపారు. ఎకరాకు రూ.4,700తో ఒప్పందం జరగ్గా, దాన్ని రూ. 10,500కు పెంచాలని ఉన్నతాధికారులు ప్రతి పాదించారు. దీంతో ఎకరాకు రూ. 5,800 పెంచిన ట్లవుతుంది. దీన్ని ప్రభుత్వం సవరిస్తూ నిర్ణయం తీసుకుంటే అదనంగా రూ. 246.50 కోట్ల భారం భరించాల్సి ఉంటుంది. దాంతో అనుమతి ఇవ్వకుండా కాలయూపన చేస్తోంది.
అనుమతి రావాల్సి ఉంది
ఉప కాలువల నిర్మాణానికి గిట్టుబాటు ధరను పెంచుతూ పంపిన ప్రతిపాదనలకు ఇంకా ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదు. పాత ఒప్పందం రూ.4,700 మేరకు కాకుండా ఎకరాకు రూ.10,500 పెంచాలని నివేదించాం. ఉప కాలువల పనులు కొన్ని చోట్ల జరుగుతున్నాయి. ప్రభుత్వ నిర్ణయం కోసం కాంట్రాక్టర్లు వేచి ఉన్నారు.
-పి.కృష్ణ, ఎస్‌ఈ, ప్రాజెక్టు సర్కిల్-3
రైతుకు నిరాశ మిగిల్చిన
Published Tue, Oct 1 2013 4:19 AM | Last Updated on Fri, Sep 1 2017 11:12 PM
Advertisement
Advertisement