వైఎస్సార్ సీపీదే భవిష్యత్తు
జహీరాబాద్, న్యూస్‌లైన్:
రానున్న రోజుల్లో వైఎస్సార్సీపీకే మంచి భవిష్యత్తు ఉంటుందని పార్టీ రాష్ట్ర నాయకుడు ఎస్.ఉజ్వల్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం జహీరాబాద్‌లోని అతిథి హోటల్లో నిర్వహించిన సమావేశంలో ఉజ్వల్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో పలువురు పార్టీలో చేరారు.
అనంతరం ఉజ్వల్‌రెడ్డి మాట్లాడుతూ రానున్న రోజుల్లో అనేక మంది పార్టీలో వచ్చి చేరనున్నారన్నారు. తెలంగాణలో సైతం పార్టీ ఎవరూ ఊహించని విధంగా బలపడడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి పేద ప్రజలకు అందించిన ఫలాలు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచాయన్నారు. ఎవరూ చేయని విధంగా పేదలకు రాజశేఖరరెడ్డి అనేక సంక్షేమ పథకాలను అందించారన్నారు.
రాజశేఖరరెడ్డి రోజులను స్వర్ణయుగంగా ప్రజలు చెప్పుకుంటున్నారని పేర్కొన్నారు. తిరిగి అలాంటి పాలన ఆయన తనయుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని ఆయన అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో సైతం పార్టీ అభ్యర్థులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభిస్తోందన్నారు.
ఎంపీటీసీ ఎన్నికల్లో సైతం పార్టీ ఆశించిన మేరకు విజయావకాశాలను సాధిస్తుందన్నారు. న్యాల్కల్ మండలంలోని గణేష్‌పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్, రవి, రాజు, జయప్ప, తుకారాంలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి ఉజ్వల్‌రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు అతార్ అహ్మద్, రాంరెడ్డి, ముబీన్, సమి, జగన్ తదితరులు పాల్గొన్నారు.