Sulabh Complex
-
సులభ్ కాంప్లెక్స్‌లోకి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం..
సాక్షి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. బడంగ్పేట్లో స్థానికంగా ఉండే పండ్ల వ్యాపారి కూతురుపై పక్కనే ఉండే సులభ్ కాంప్లెక్స్‌లో పనిచేసే వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. రవిందర్ అనే వ్యక్తి 10 ఏళ్ల బాలికను సులభ్ కాంప్లెక్స్ లోపలికి తీసుకెళ్లి న్యూడ్ వీడియో చూపిస్తూ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. అయితే ఇంతలో తన కూతురు కనపడటం లేదని గుర్తించిన తల్లి.. అనుమానంతో సులభ్ కాంప్లెక్స్‌లోకి వెళ్లి వెతకగా చిన్నారి ఏడుపు వినిపించింది. వెంటనే డోర్ తీయడంతో రవిందర్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించాడు. దీంతో నిందితుడిని పట్టుకున్న స్థానికులు అతన్ని చితకబాదారు. అనంతరం మీర్పేట్ పోలీసులకు అప్పగించారు. చదవండి: ఇద్దరితోనూ సన్నిహితం.. అక్కపై మరిగిన నూనె పోసిన చెల్లెలు -
సులభ్ కాంప్లెక్స్‌లో తపంచాల కలకలం
నాంపల్లి: హైదరాబాద్ రైల్వే స్టేషన్ (నాంపల్లి) సమీపంలోని ఓ సులభ్ కాంప్లెక్స్‌లో రెండు రివాల్వర్లు దొరికాయి. శుక్రవారం రాత్రి మరుగుదొడ్లను శుభ్రం చేసే సిబ్బంది వీటిని గుర్తించారు. దీంతో సులభ్ కాంప్లెక్స్ నిర్వాహకులు నాంపల్లి పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన పోలీసులు సంఘటనాస్ధలానికి చేరుకుని వాటిని స్వా«దీనం చేసుకున్నారు. స్వాదీనం చేసుకున్నవి రివాల్వర్లు కాదని, తపంచాలని పోలీసులు నిర్ధారించారు. తపంచాలు వదిలిపెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. అందుబాటులో ఉన్న ఆధారాలతో అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. సీసీ కెమెరాలను సైతం పరిశీలిస్తున్నారు. శనివారం మధ్య మండలం డీసీపీ విశ్వప్రసాద్, సైఫాబాదు డివిజన్ ఏసీపీ సి.వేణుగోపాల్‌రెడ్డి, నాంపల్లి ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాష, అదనపు ఇన్స్పెక్టర్ కిషోర్, ఎస్సై రెడ్డిగారి శ్రీకాంత్‌రెడ్డిలు సంఘటన స్థలాన్ని సందర్శించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ కు వచ్చిన ప్రయాణికులే సులభ్ కాంప్లెక్స్‌లో స్నానం చేసి ఇక్కడ వదిలిపెట్టి వెళ్లినట్టుగా తెలుస్తోంది. దోపిడీదారులు, రౌడీ షీటర్లు,నక్సలైట్లు వంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారు నగరానికి వచ్చి, సులభ్ కాంప్లెక్స్‌లో వీటిని మరిచిపోయారనే కోణంలోనూ పోలీసులు విచారిస్తున్నారు. అలాగే విక్రయించడం కోసం ఎవరైనా తీసుకువచ్చారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
స్వచ్ఛ భారత్ లక్ష్యం ఇదేనా..?
► ఏళ్లతరబడిగా మూతపడిన సులభ్‌కాంప్లెక్స్ ► బహిరంగ ప్రదేశాల్లో మూత్ర విసర్జన పెద్దపల్లి(సుల్తానాబాద్ రూరల్): ఒకవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తుండగా, సుల్తానాబాద్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొని ఉంది. స్థానిక మినీ కలెక్టరేట్ ఏర్పడిన సమయంలో సందర్శకులు, ప్రజల కోసం సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించారు. అప్పటి ఎమ్మెల్యే గీట్ల ముకుందరరెడ్డి దూరదృష్టితో మినీ కలెక్టరేట్‌తో పాటు సులభ్‌కాంప్లెక్స్‌ను నిర్మించి 2008జూలై 14న ప్రారంభించారు. ప్రభుత్వ వాటాగా రూ.2.50లక్షలు, నిర్వహకులు రూ.2.50లక్షలతో దీనిని నిర్మించారు. అయితే సులభ్‌కాంప్లెక్స్ నిర్వహకులకు ప్రభుత్వ వాటా చెల్లింపు కాకపోవడం, అప్పట్లో ఆదరణ లేకపోవడంతో దీనిని మూసివేశారు. దాదాపు ఆరేళ్లుగా తెరువడం లేదు. ప్రస్తుతం పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా దీని అవసరం ఎంతో ఏర్పడింది. అనేక గ్రామాలకు, మండలాలకు కూడలి అయిన సుల్తానాబాద్‌లో ప్రజలకు తగినన్ని మూత్రశాలలు లేకుండా పోయాయి. కూరగాయల మార్కెట్ వద్ద ఒకటి మాత్రమే పనిచేస్తోంది. కాల్వశ్రీరాంపూర్ చౌరస్తాలో ఉన్న ఐబీ, ఇరిగేషన్, పాత సివిల్ ఆసుపత్రి, పాత మటన్ మార్కెట్, బస్టాండ్ స్థలాల్లో, బంజరుదొడ్డి, రోడ్డు ప్రక్కన డ్రెయినేజీల్లో బహిరంగ మూత్ర విసర్జన చేస్తున్నారు. -
ఫలించిన ఎమ్మెల్యే కృషి
ఉరవకొండ : ఉరవకొండ మేజర్ పంచాయతీలో కొన్నేళ్లుగా ముక్కుపుటాలాలను అదరగొట్టే దుర్వాసనతో ఇబ్బందికరంగా మారిన సులభ్ కాంప్లెక్స్‌ను ఆదివారం శుభ్రం చేశారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉరవకొండలో మేధావులు, విద్యావేత్తలతో కలిసి పట్టణ అభివృద్ధి సాధన కమిటీ వేశారు. ఆ కమిటీ సభ్యులు ప్రతి వార్డూ తిరిగి సమస్యలు గుర్తించారు. జూలై 16, 17 తేదీల్లో పట్టణ అభివృద్ధి కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే బస్టాండ్‌తో పాటు దుర్భరంగా వూరిన సులభ్ కాంప్లెక్స్‌ను పరిశీలించారు. అదే నెల 31న కలెక్టర్ సొలవున్ ఆరోగ్య రాజ్‌నూ కలిసి ఉరవకొండకు మున్సిపాల్టీ హోదా కల్పించి, ప్రభుత్వ ఆస్పత్రిలో వలిక వసతులు, సులభ్ కాంప్లెక్స్ ఆధునీకరణతో పాటు వురో 17 ముఖ్య సమస్యలను వివరించారు. ఇందు కోసం రూ. 20 కోట్ల నిధులు వుంజురు చేయూలని కోరారు. దీనిపై కలెక్టర్ సానుకుంలగా స్పందించి మొట్ట మొదటిదిగా సులబ్ కాంప్లెక్స్ ను శుభ్రం చేరుుంచాలంటు జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీ అధికారి ఆదివారం కార్మికులతో సులభ్ కాంప్లెక్స్‌ను శుభ్రపరిచి, బ్లీచింగ్ పౌడర్ చల్లించారు. దీంతో పాటు కాంప్లెక్స్‌కు ఆనుకుని ఉన్న పంచాయతీ స్థలంలో ప్రహరీ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. విశ్వేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది నెలలకే పట్టణ అభివృద్ధికి శ్రీకారం చుట్టడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.