Sulthanpur
-
Facebook Live: పోనీయ్.. 300 కి.మీ.లు దాటాలి
లక్నో: బీఎండబ్ల్యూ కారు.. మెరుపు వేగం.. నిర్లక్ష్యపు డ్రైవింగ్.. ఫేస్బుక్ లైవ్‌లో అత్యుత్సాహం.. ఇవన్నీ కలిసి నలుగురి ప్రాణాలను అనంత వాయువుల్లో కలిపేశాయి. 230 కిలోమీటర్ల వేగంతో కారును నడుపుతూ నలుగురు యువకులు ప్రాణాలు బలిచేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్‌లోని పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్‌వేపై శుక్రవారం సుల్తాన్పూర్ వద్ద జరిగింది. ఈ ప్రమాదం తాలూకు వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవడంతో వివరాలు తాజాగా వెలుగులోకి వచ్చాయి. ఆనంద్ ప్రకాశ్(35), అఖిలేశ్ సింగ్(35), దీపక్ కుమార్(37), మరో వ్యక్తి బీఎండబ్ల్యూ కారులో ఎక్స్‌ప్రెస్ హైవేపై అత్యంత వేగంతో దూసుకెళ్తున్నారు. దీంతో అందులోని వ్యక్తి.. ‘ స్పీడ్ మరింత పెంచు. స్పీడ్ 300 కి.మీ.లు దాటాలి. మనం ఫేస్బుక్ లైవ్‌లో ఉన్నాం’ అని డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తితో అన్నాడు. అప్పటికే ఆ వేగంతో భయపడిన కారులోని వ్యక్తి.. ‘మనం నలుగురం చస్తాం. నెమ్మదిగా పోనీయ్’ అని అరిచాడు. దీంతో డ్రైవర్.. భయపడే వ్యక్తిని వారిస్తూ ‘ అరవకు. నేను అంతటి వేగంతో నడిపి చూపిస్తా’ అని కోప్పడ్డాడు. ఈ వాగ్వాదం నడుమే కారు 230 కి.మీ.ల వేగంలో ప్రయాణిస్తూ ఎదురుగా వస్తున్న ట్రక్‌ను ఢీకొట్టింది. కారు టాప్, ముందుభాగం పగిలిపోయి కారులోని నలుగురూ ఛిద్రమై దూరంగా పడిపోయాడు. అక్కడిక్కడే మరణించారు. -
కోఠి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో.. పసికందు అదృశ్యం!
-
ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం.. పసికందు అదృశ్యం!
హైదరాబాద్ : కోఠి సుల్తాన్ బజార్‌లోని ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఆస్పత్రిలో ఆరు రోజుల పసికందు అదృశ్యమైంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మ తండాకు చెందిన విజయ ప్రసూతి కోసం గతవారం ఆసుపత్రికి వచ్చారు. ఆమె ఓ ఆడశిశువుకు జన్మనిచ్చారు. ఆమె కదల్లేని స్థితిలో ఆస్పత్రిలో ఉండటంతో.. పక్కనే ఉన్న ఓ గుర్తుతెలియని ఓ మహిళ ఈ గమనించి.. శిశువుకు టీకా ఇప్పిస్తానటూ తీసుకెళ్లింది. ఎంతసేపటికీ ఆమె తన బిడ్డను తీసుకురాకపోవడంతో విజయ తల్లిడిల్లిపోయారు. వెంటనే ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది స్థానిక సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా శిశువును అపహరించిన మహిళను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. పసికందు అదృశ్యమైన వార్తను కవర్ చేసేందుకు వచ్చిన మీడియాపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. మీడియాపై పోలీసులు, సెక్యూరిటీ గార్డులు దాడికి దిగారు. -
కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి
-
కారు-లారీ ఢీ: ముగ్గురు మృతి
సంగారెడ్డి: పుల్కల్ మండలం సుల్తాన్పూర్ వద్ద సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. కారు-లారీ ఢీ కొన్న సంఘటనలో ముగ్గురు మృతిచెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.