సూర్య వలయంపై ఇస్రో గురి
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. సూర్య వలయంపై పరిశోధనల కోసం ఆదిత్య ఎల్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి పీఎస్ఎల్వీ-ఎక్స్ఎల్ రాకెట్ ద్వారా ఉపగ్రహాన్ని పం పేం దుకు ఇస్రో శాస్త్రవేత్తలు ప్రణాళికలు తయారు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో రాబోయే సంవత్సరంలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు శాస్త్రవేత్తలు కసరత్తు చేస్తున్నారు. బెంగళూరులో దీని తయారీకి ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది.
ఇస్రో ప్రయోగించనున్న ఉపగ్రహంలో ఆదిత్య సోలార్ విండ్ ఫర్టికల్ ఎక్స్పెరిమెంట్ (యాస్పెక్స్), సోలార్ ఆల్ట్రావయొలెట్స్ ఇమేజింగ్ టెలిస్కోప్(సట్జ్), విజిబుల్ ఎమిషన్ లైన్ కరోనాగ్రాఫ్స్ (వెల్సి), హై ఎనర్జీ ఎల్-1 ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ (హెలియోస్), ప్లాస్మా అనలెజర్ ప్యాకేజి ఫర్ ఆదిత్య (పాపా), సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్ (సోలెక్స్) అనే ఆరు ఉపకరణాలు (పేలోడ్స్) అమర్చనున్నారు. 2017 ఆఖరులోపే ఈ ప్రయోగానికి ప్రయత్నం చేస్తున్నామని ఇస్రో చైర్మన్ కిరణ్కుమార్ తెలిపారు.