Sun flower
-
ఉక్రెయిన్ ఉక్కు మహిళ! మా గడ్డ పై ఏం పని మీకు ?
Ukrainian Woman Confronts Russian Soldiers: రష్యా దళాలు గురువారం ఉక్రెయిన్ సరిహద్దును దాటి దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అవి ఇప్పుడు రాజధాని కైవ్‌కు సమీపంలో ఉన్నాయి. రష్యా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దును దాటి వీధుల్లోకి ప్రవేశించడంతో ఉక్రెనియన్లు రష్యా దాడిని ఖండిస్తూ.. ప్రపంచవ్యాప్తంగా విస్తృత నిరసనలు చేపట్టారు. టోక్యో నుంచి న్యూయార్క్ వరకు రష్యా కార్యాలయలు వద్ద, బహిరంగ ప్రదేశాల్లో పెద్ద పెద్ద ఎత్తున నిరసనలు ప్రారంభించారు. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు సైతం సైనిక దుస్తులతో యుద్థ రంగంలోకి వెళ్లి తమ సైనికులకు ధైర్యాన్ని నింపడమే కాక తాను సైతం రష్యా బలగాలతో తలపడుతున్నాడు. ఇంకో వైపు ఆ దేశపు మహిళలు సైతం తాము కూడా తమ దేశం కోసం ఏం చేయడానికైన సిద్ధం అంటున్నారు. ఈ మేరకు రాజధానికి సమీపంలోని ఓడరేవు నగరమైన హెనిచెస్క్‌లోని వీధుల్లోకి వస్తున్న రష్యా బలగాలకు ఒక ఉక్రెయిన్ మహిళ ఎదురు నిలబడి ప్రశ్నల వర్షం కురిపించింది. ఏ మాత్రం బెరుకు లేకుండా మా దేశంలో ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. తుపాకులు, పెద్ద మెషిన్ గన్లు పట్టుకున్న ఆ సైనికులు నివ్వెరపోయాలా ఆక్రోసించింది. దీంతో వారు ఆ మహిళతో ఇక్కడ ఏం జరగటం లేదంటూ..ఆమెను శాంత పరచడానికి ప్రయత్నించారు. అయితే ఆమె ఏ మాత్రం ఖాతరు చేయకుండా మీకు ఇక్కడేం పని అంటూ గర్జించింది. దెబ్బకు ఆ రష్యా సైన్యం తాము ఇక్కడ సైనిక కసరత్తులు చేస్తున్నాం దయచేసి మీరు వెళ్లండి అని వాళ్లు సున్నితంగా చెబుతున్న ఆమె లక్ష్యపెట్టలేదు. పైగా ఈ భూమి పై మీకు ఏం దొరకదు. కనీసం ఈ గింజలైన తీసుకుని జేబులో పెట్టుకోండి. మీరంతా ఇక్కడ పడుకున్నప్పుడు కనీసం ఆ పొద్దుతిరుగుడు పువ్వులు అయిన పెరుగుతాయని వ్యంగ్యంగా చెప్పి నిష్క్రమించింది. పొద్దు తిరుగుడు పువ్వు ఉక్రెయిన్ జాతీయ పుష్పం. ఈ మేరకు ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ సైనికులను చూసి ఏ మాత్రం భయపడకుండా నిలబడిన "నిర్భయ", ఆమెను తమ దేశ దళాలతో మాట్లాడమని చెప్పాలి ఎందుకంటే ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా తమ బలగాలను ధైర్యంగా పోరాడేలా చేయగల సమర్థురాలు అని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. Woman in Henichesk confronts Russian military. “Why the fuck did you come here ? No one wants you!” 🤣#Russia #Ukraine #Putin pic.twitter.com/wTz9D9U6jQ — Intel Rogue (@IntelRogue) February 24, 2022 (చదవండి: చనిపోతున్నప్పుడు మన మెదడు ఏం ఆలోచిస్తుందో తెలుసా!) -
రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు తిన్నారంటే..
►రోజుకి గుప్పెడు పొద్దుతిరుగుడు గింజలు (సన్ ఫ్లవర్ విత్తనాలు) తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా అందుతాయి. ►ఈ విత్తనాల్లో ప్రొటిన్ , జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ , విటమిన్ ఈ, బీ, బీ6, మంచి కొవ్వులు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ►ఈ గింజల్లోని విటమిన్లు, పొటాషియం, మెగ్నీషియం రక్త పీడనం నియంత్రణలో ఉండడానికి తోడ్పడతాయి. ►విటమిన్ బి మెదడు ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఈ గింజలు డైలీ తినడం వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రతలు కూడా పెరుగుతాయి. ►బరువుని అదుపులో ఉంచడం, రోగనిరోధక శక్తిని పెంచి ఇతర అనారోగ్య సమస్యలు దరిచేరనివ్వదు. ►ఇంకా దీనిలో ఉన్న విటమిన్ ‘ఈ’ చర్మానికి పోషణ అందించి, హానికర కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుంది. చదవండి: బ్రేకింగ్ రికార్డ్.. ఏడడుగుల సౌకుమార్యం -
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం
-
వరికి కనీస మద్దతు ధర పెరిగింది
సాక్షి, న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రైతుల మన్ననలు పొందేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఖరీఫ్ సీజన్లో పండే 14 రకాల పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. బడ్జెట్లో కేటాయింపులకు అనుగుణంగా ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధర పెంపును కేంద్రం ప్రకటించింది. దీంతో ఖరీఫ్ సీజన్లో ప్రధాన పంట అయిన వరి కనీస మద్దతు ధర 2018-19లో క్వింటాకు 200 రూపాయలు పెరిగి, రూ.1,750గా నిర్ణయమైంది. 2017-18లో ఈ ధర రూ.1,550గా ఉండేది. గ్రేడ్ ఏ రకం వరి కనీస మద్దతు ధర కూడా 160 రూపాయలు పెరిగి రూ.1,750 చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. వరికి కనీస మద్దతు ధర పెరగడంతో, 2016-17(అక్టోబర్-సెప్టెంబర్) మార్కెటింగ్ ఏడాది ప్రకారం ఆహార రాయితీ బిల్లు కూడా రూ.11 వేల కోట్ల కంటే ఎక్కువ పెరగనుందని తెలిసింది. వరితో పాటు పత్తి(మిడియం స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా రూ.4,020 నుంచి రూ.5,150కు పెరిగింది. అదేవిధంగా పత్తి(లాంగ్ స్టాపుల్) కనీస మద్దతు ధర కూడా క్వింటాకు రూ.4,320 నుంచి రూ.5,450కు పెంచారు. పప్పు ధాన్యాల కనీస మద్దతు ధర క్వింటాకు రూ.5,450 నుంచి రూ.5,675కు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. సన్ ప్లవర్ ధర క్వింటాకు 1,288 రూపాయలు, పెసర్ల ధర క్వింటాకు 1,400 రూపాయలు, రాగుల ధర క్వింటాకు 997 రూపాయలు పెంచుతున్నట్టు ఆర్థిక వ్యవహారాల కేంద్ర కేబినెట్ ప్రకటించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే 14 ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చు కంటే 1.5 రెట్లు ఎక్కువగా పెంచనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్లో ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. మంగళవారమే ఈ విషయంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, నీతి ఆయోగ్ ప్లానింగ్ బాడీ అధికారులు సమావేశమయ్యారు. -
తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షం
హైదరాబాద్ సిటీ: తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలతో పాటు నిజామాబాద్, మెదక్‌లలో ఆదివారం రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షానికి నిజామాబాద్ జిల్లా బోధన్‌లో సన్‌ప్లవర్ పంటదెబ్బతింది. ఈ సీజన్లో వర్షాలు సరిగా కురవకపోవడంతో చాలామంది మెట్ట పంటలు వేశారు. అయితే ఈ అకాలవర్షానికి తోడు చిన్నపాటి గాలులు వీయడంతో కొన్ని చోట్ల పంటదెబ్బతింది. పశువుల మేత కోసం అల్లాడుతున్న రైతులకు ఈ వర్షం ఊరట కలిగించే విషయమే. హైదరాబాద్‌లో పలుచోట్ల అకాలవర్షానికి తారురోడ్డుపై కంకర తేలింది.