షేన్ వార్న్, ఎలిజబెత్ హ్యారీలు విడిపోయారా?
ప్రొఫెషనల్ జీవితంలో సుదీర్ఘ ప్రయాణాల వల్ల వైవాహిక జీవితంలో వారిద్దరూ క్వాలీటి లైఫ్ ను ఎంజాయ్ చేసింది తక్కువే కావడంతో అది వారికి అతిపెద్ద సమస్యగా మారింది. ఆస్ట్రేలియాలో షేన్ వార్న్.. బ్రిటన్ లో ఎలిజబెత్ హ్యరీలు గడపాల్సి రావడంతో కుటుంబ జీవితాన్ని ఎక్కువ శాతం సోషల్ మీడియా వెబ్ సైట్ ట్విటర్ లోనే పంచుకోవాల్సి వచ్చిందట!
దాంతో విసిగిపోయిన ఆస్ట్రేలియా స్పిన్ మాంత్రికుడు షేన్ వార్న్, ఆయన సతిమణి ఎలిజబత్ హ్యర్లీ లిద్దరూ సంబంధాలు తెగతెంపులు చేసుకున్నారని మీడియాలో రూమర్లు షికారు చేస్తున్నాయి. వార్న్, హ్యరీల రిలేషన్ షిప్ వారి ప్రోఫెషనల్ జీవితానికి అడ్డంకిగా మారడంతో విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు ది సన్ న్యూస్ పేపర్ వెల్లడించింది. పలమార్లు వీరిద్దరూ సర్దుకుపోదామని అనుకున్నా.. వీరి మధ్య దూరం పెరగడంతో మూడేళ్ల రిలేషన్ షిప్ కు రెండేళ్ల వివాహబంధానికి తెరపడింది.
విడివిడిగా గడిపే దంపతుల తమ సంబంధాలను నిలుపుకోవడం చాలా కష్టమేనని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానించారు. భారత సంతతికి చెందిన వ్యాపారవేత్త అరుణ్ నాయర్ తో నాలుగేళ్ల వైవాహిక జీవితానికి గుడ్ బై చెప్పాకా 2010లో షేన్ వార్న్ తో డేటింగ్ ప్రారంభించింది. ఆతర్వాత ఓ సంవత్సరం తర్వాత హ్యర్లీని వార్న్ ను పెళ్లాడారు.