Sunidhi Chauhan
-
ఎన్నో సినిమాలకు పాడాను.. కొన్నింటికైతే డబ్బులు..: సింగర్
సంగీత ప్రపంచంలోని పాపులర్ సింగర్స్లో సునిధి చౌహాన్ ఒకరు. తన కెరీర్లో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించిన ఆమె తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఓ పాడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ.. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అవతలివారు డబ్బు ఎగ్గొట్టే అవకాశాలు తక్కువ. రెమ్యునరేషన్ అందలేదుఎందుకంటే.. డబ్బిచ్చాకే పాడతాను అని డిమాండ్ చేయొచ్చు. అదే మనంతట మనమే ముందు పాట కంప్లీట్ చేద్దాం అనుకుంటే మాత్రం మనీ గురించి ఆలోచించొద్దు. రెమ్యునరేషన్ ముట్టలేదని అసలే బాధపడొద్దు. ఇప్పటికీ చాలా సినిమాలకుగాను పారితోషికం అందుకోలేదు. అలా అని వాళ్ల తప్పేం లేదు. కొన్నిసార్లు ఆఫర్ చేసినప్పటికీ నేనే వద్దనుకున్నాను. వాళ్లు ఇచ్చేది నాకంత సంతృప్తి అనిపించలేదు. ఇగో హర్ట్ చేయడం దేనికని..నాకు కావాల్సింది డిమాండ్ చేసి.. చివరికి మళ్లీ వారి ఇగోను ఎందుకు హర్ట్ చేయడం అని తీసుకోకుండా ఊరుకునేదాన్ని. కొన్నిసార్లు చివరి నిమిషంలో సింగర్లను మార్చేస్తారు. కానీ ఆ విషయం కనీసం కాల్ చేసి చెప్తే బాగుంటుంది. కొన్ని పాటలైతే ముందుగానే రికార్డు చేసి పెడతారు. అవసరాన్ని బట్టి ఆయా సినిమాల్లో వాడుకుంటారు అని చెప్పుకొచ్చింది.చదవండి: Sleep Movie Review: నిద్రతోనే భయపెట్టే సినిమా -
బాటిల్ విసిరిన ఆకతాయి.. సింగర్ రియాక్షన్ ఇదే!
పాపులర్ సింగర్ సునిధి చౌహాన్ ఇటీవల డెహ్రాడూన్లోని ఓ కాలేజీ ఫంక్షన్లో లైవ్ షోకు హాజరైంది. తన మధుర గాత్రంతో శ్రోతలను ఉర్రూతలూగించింది. బాలీవుడ్ హిట్ సాంగ్స్ పాడుతూ అందరిలో హుషారు నింపింది. అక్కడున్నవారిని తనతో కలిసి పాడమని ఎంకరేజ్ చేసింది. ఇంతలో ఓ వ్యక్తి ఆమెపైకి వాటర్ బాటిల్ విసిరాడు.బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది?తనవైపుగా ఏదో వస్తువు వస్తోందన్న విషయం గమనించి ఆమె రెండడుగులు వెనక్కు వేసింది. అయినా పాట పాడటం ఆపలేదు. కొన్ని సెకన్ల తర్వాత ఆమె.. నాపై బాటిల్స్ విసిరితే ఏమొస్తుంది? ఈ షో ఆగిపోతుంది. ఈ షో ఆగిపోవాలనుకుంటున్నారా? అని అడిగింది. అందుకు అక్కడున్న జనాలు వద్దని ముక్తకంఠంతో బదులిచ్చారు. అదే ఉత్సాహందీంతో ఆమె అదే ఉత్సాహంతో షోని కంటిన్యూ చేసింది. ఈ షోకి సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తనకు అలాంటి చేదు అనుభవం ఎదురైనా పట్టించుకోకుండా షో ముందుకు కొనసాగించిన సునిధి మంచితనానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆ స్థానంలో మరెవరైనా ఉంటే మైక్ అక్కడే పడేసి వెళ్లిపోయేవారని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sunidhi Chauhan (@sunidhichauhan5) -
రాజమండ్రి కోయిల
మట్టి గమకం ఆమె చిత్ర కాదు. సునిధి చౌహాన్ కాదు. పాడుతా తీయగా... పార్టిసిపెంట్ కాదు. కనీసం లోకల్ స్టేజ్ సింగ్ కూడా కాదు. కానీ ఉన్నట్టుండి ఆమె లక్షలాది మంది అభిమానులను సంపాదించుకుంది. వేలాది ప్రశంసలు పొందుతూ ఉంది. నీళ్ల కోసం ఏదో అరుగు మీద బకెట్ పట్టుకుని ఆమె పాడిన పాట ఎవరో వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ అయ్యింది.ఎవరీమే అని ఆరాలు ప్రారంభించారు. ‘సాక్షి’ ఆమెను వెతికి పట్టింది. మాట్లాడింది. ఆమె మాటలు వినండి... ‘‘నా పేరు బేబీ. నాకు సంగీతం అంటే ఏంటో కూడా తెలియదు. నేను ఎవరి దగ్గరా నేర్చుకోలేదు. ఎవరైనా పాడుతుంటే విని పాడేదాన్ని. ఒక్క అక్షరం కూడా చదువుకోలేదు. జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇవాళ నా పాట ఇంతమందికి నచ్చిందంటే చాలా ఆశ్చర్యంగా సంతోషంగా ఉంది.మా అమ్మనాన్నలకి మేం ఐదుగురు సంతానం. ముగ్గురు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. నేను పెద్ద అమ్మాయిని. నాన్న వెంకన్న వ్యవసాయం చేస్తారు. అమ్మ దయాకరుణ కూలి పని చేస్తుంది. నాకు ఇద్దరు పిల్లలు, కవలలు. హిమబిందు, ప్రియబిందు. వాళ్లకి పెళ్లిళ్లు అయిపోయాయి. ఇవాళ పెద్ద అమ్మాయి హిమబిందు డెలివరీ కోసం రాజమండ్రి ఆసుపత్రికి వచ్చాను. నేను అక్కడ నుంచే మీతో మాట్లాడుతున్నాను’ అందామె. మా అమ్మమ్మ పాడేది... మా అమ్మమ్మ చాలా బాగా పాడేదని మా అమ్మ చెప్పేది. నాకు బహుశా ఆవిడ నుంచి ఈ విద్య అబ్బిందేమో. ఫేస్బుక్లో నా పాట చూసి మా నాన్న, అమ్మ ఎంతో సంతోషించారు. నాకు ‘బొంబాయి’ చిత్రంలోని ‘కన్నానులే కలయికలు ఏనాడు ఆగవులే’ పాట అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఏ సినిమా చూస్తే ఆ సినిమాలో పాట నేర్చుకునేదాన్ని. పొలం పనులు చేసుకుంటూ పాడేదాన్ని. చదువు లేకపోయినా నాకు దేవుడు జ్ఞాపకశక్తి ఇచ్చాడు. నా చిన్నప్పటి నుంచే అమ్మ నాన్నలు దగ్గర కూర్చోబెట్టుకుని, నేను పలికే వచ్చీరాని పదాలతోనే పాడించుకునేవారు. చేలల్లో బాగా పాడేదాన్ని. అందరూ మెచ్చుకునేవారు. కొన్ని పదాలు సరిగా పలకలేనేమోనని బెరుకుగా ఉండేది’ అంటారు పసల బేబీ. మలుపు తిప్పిన రికార్డింగ్ ఒకసారి బట్టలకు గంజి పెట్టుకుని, పక్క వాళ్ల ఇంటికి వెళ్లాను. ఆ ఇంట్లో అమ్మాయి ‘ప్రేమికుడు’ చిత్రంలోని ‘ఓ చెలియా నా ప్రియ సఖియా’ పాట పాడుతోంది. ఆ అమ్మాయి వేదికల మీద ప్రదర్శనలిస్తుంది. ఆ అమ్మాయి పాటలో శృతి సరిగ్గా లేదనిపించింది. వెంటనే ఆ అమ్మాయితో ‘నువ్వు తప్పు పాడుతున్నావు, సరైన శృతిలో పాడితే బావుంటుంది’ అని సలహా ఇచ్చాను. వెంటనే ఆ అమ్మాయి నాతో పల్లవి చరణం పాడించింది. వీడియో షూట్ చేసి, నా అనుమతితో ఫేస్బుక్లో పెట్టింది. నా పాట విన్నాక మా ఆయన వజ్రరావు ‘నువ్వు వయసులో ఉన్నప్పుడే పాడితే బావుండేది. ఎంతో మంచి పేరు సంపాదించేదానివి. నా వల్ల నువ్వు పాడలేకపోయావేమో’ అని బాధపడ్డారు. సినిమా వారు కూడా... సినీ పరిశ్రమకు చెందినవారమంటూ బేబీకి చాలా ఫోన్లు వస్తున్నాయి. ‘సినిమాలలో పాడమని పుల్లయ్య పంతులు అనే ఆయన నాకు ఫోన్ చేశారు. కాని నేను వెళ్లడానికి కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు ఉన్నాయి. అందువల్ల నేను రాలేను అని చెప్పాను. నాకు కూడా అందరిలోను పాడాలని, అందరూ మెచ్చుకోవాలని అనిపిస్తుంది కదా. ఆమె మాటల్లో ఒక్క అపశబ్దం లేదు, ఎక్కడా యాస లేదు, మాటల్లో దోషం లేదు. క్లిష్టమైన ఆలాపన, ఎక్కువ గమకాలు, పెద్ద పెద్ద సంగతులు ఉన్న ఒక పాట వినిపించారు. ఆ పాటలో సంగీత విద్వాంసుల మాదిరిగానే గమకాలను అలవోకగా, అద్భుతంగా పలికారు. తనను ప్రోత్సహిస్తే పాట కచేరీలు చేస్తానని ఎంతో ఉత్సాహంగా పలికారు పసల బేబీ. ప్రస్తుతం వడిసలేరు దగ్గర ఉన్న జీడిపప్పు ఫ్యాక్టరీలో పని చేసేవారు బేబీ. అక్కడ కొన్ని సమస్యలు తలెత్తడంతో పని మానేశారు. కొన్ని సంఘాల వారు వారి సమావేశాలకు పాటలు పాడమని కోరడంతో పాడుతున్నారు. ఒక్కో కచేరీకి ఎంతో కొంత డబ్బు ఇస్తున్నారు. అలా బేబీ తన జీవితం కొనసాగిస్తున్నారు. – సంభాషణ: వైజయంతి పురాణపండ -
ఆగస్టు 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు
ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునిధి చౌహాన్ (గాయని); హాలీబెర్రీ (హాలీవుడ్ నటి) ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరి మీద గురువు ప్రభావం ఉంటుంది. వీరు పుట్టినతేదీ 14. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కాబట్టి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఐశ్వర్యం కలిగి ఉంటారు. కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. గురు, బుధుల కలయిక వల్ల ఆగిపోయిన చదువును పూర్తి చేయడం, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లేదా కొత్త కోర్సులు చేయడం వంటి పరిణామాలు జరగవచ్చు. నెమ్మదిగా నడుస్తున్న ప్రాజెక్టులను వేగవంతం చేయడం, లాభాల బాటలో పడేటట్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగులు ధైర్యంగా ఉద్యోగాన్ని వదిలేసి, వ్యాపారమో లేదా కొత్తప్రాజెక్టులనో ఆరంభిస్తారు. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. ప్రేమ వ్యవహారాలు మాత్రం అనుకూలించక పోవచ్చు. నరాల బలహీనత, లో బీపీ బాధించే అవకాశం ఉన్నందువల్ల సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ కలర్స్: గ్రీన్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ మంత్స్: ఏప్రిల్, జూన్, ఆగస్ట్, డిసెంబర్; సూచనలు: తోబుట్టువులకి, పెళ్లికాని కన్యలకి తగిన సాయం చేయడం, మతగ్రంథాలను రోజూ కనీసం పావుగంటపాటు పఠించడం, యోగ, ధ్యానం చేయడం, గురువులను గౌరవించడం మంచిది. - డాక్టర్ మహమ్మద్ దావూద్ -
ఐడియా రాక్ ఇండియా