ఆగస్టు 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు | On August 14, the birthday celebrated | Sakshi
Sakshi News home page

ఆగస్టు 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

Aug 13 2015 10:46 PM | Updated on Sep 3 2017 7:23 AM

ఆగస్టు  14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఆగస్టు 14న పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు

ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారి సంవత్సర సంఖ్య 3.

ఈరోజు మీతో పాటు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రముఖులు: సునిధి చౌహాన్ (గాయని); హాలీబెర్రీ (హాలీవుడ్ నటి)
 
ఈరోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నవారి సంవత్సర సంఖ్య 3. ఇది దేవగురువైన బృహస్పతికి సంబంధించిన సంఖ్య కాబట్టి వీరి మీద గురువు ప్రభావం ఉంటుంది. వీరు పుట్టినతేదీ 14. ఇది బుధునికి సంబంధించిన సంఖ్య కాబట్టి మంచి తెలివితేటలు, సమయస్ఫూర్తి, ఐశ్వర్యం కలిగి ఉంటారు. కష్టపడే మనస్తత్వం ఉండటం వల్ల కీర్తిప్రతిష్ఠలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. భోగభాగ్యాలు అనుభవిస్తారు. గురు, బుధుల కలయిక వల్ల ఆగిపోయిన చదువును పూర్తి చేయడం, కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం లేదా కొత్త కోర్సులు చేయడం వంటి పరిణామాలు జరగవచ్చు.

నెమ్మదిగా నడుస్తున్న ప్రాజెక్టులను వేగవంతం చేయడం, లాభాల బాటలో పడేటట్లు చేయడం జరుగుతుంది. ఉద్యోగులు ధైర్యంగా ఉద్యోగాన్ని వదిలేసి, వ్యాపారమో లేదా కొత్తప్రాజెక్టులనో ఆరంభిస్తారు. ఈ సంవత్సరం తీసుకునే నిర్ణయాలు జీవితంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. ప్రేమ వ్యవహారాలు మాత్రం అనుకూలించక పోవచ్చు. నరాల బలహీనత, లో బీపీ బాధించే అవకాశం ఉన్నందువల్ల సమయానికి తిండి, నిద్ర ఉండేలా చూసుకోవడం మంచిది. లక్కీ నంబర్స్: 1,5,6,9; లక్కీ కలర్స్: గ్రీన్, ఎల్లో, క్రీమ్, గోల్డెన్, శాండల్, బ్లూ; లక్కీ మంత్స్: ఏప్రిల్, జూన్, ఆగస్ట్, డిసెంబర్; సూచనలు: తోబుట్టువులకి, పెళ్లికాని కన్యలకి తగిన సాయం చేయడం, మతగ్రంథాలను రోజూ కనీసం పావుగంటపాటు పఠించడం, యోగ, ధ్యానం చేయడం, గురువులను గౌరవించడం మంచిది.                   - డాక్టర్ మహమ్మద్ దావూద్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement