![Sunidhi Chauhan: Not Giving Remuneration After Singing in Many Movies](/styles/webp/s3/article_images/2024/08/4/sunidhi-chauhan1.jpg.webp?itok=FoblU2BF)
సంగీత ప్రపంచంలోని పాపులర్ సింగర్స్‌లో సునిధి చౌహాన్ ఒకరు. తన కెరీర్‌లో ఎన్నో హిట్ సాంగ్స్ ఆలపించిన ఆమె తాజాగా ఆసక్తికర విషయాలను పంచుకుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ.. ఒక స్థాయికి చేరుకున్న తర్వాత అవతలివారు డబ్బు ఎగ్గొట్టే అవకాశాలు తక్కువ.
రెమ్యునరేషన్ అందలేదు
ఎందుకంటే.. డబ్బిచ్చాకే పాడతాను అని డిమాండ్ చేయొచ్చు. అదే మనంతట మనమే ముందు పాట కంప్లీట్ చేద్దాం అనుకుంటే మాత్రం మనీ గురించి ఆలోచించొద్దు. రెమ్యునరేషన్ ముట్టలేదని అసలే బాధపడొద్దు. ఇప్పటికీ చాలా సినిమాలకుగాను పారితోషికం అందుకోలేదు. అలా అని వాళ్ల తప్పేం లేదు. కొన్నిసార్లు ఆఫర్ చేసినప్పటికీ నేనే వద్దనుకున్నాను. వాళ్లు ఇచ్చేది నాకంత సంతృప్తి అనిపించలేదు.
ఇగో హర్ట్ చేయడం దేనికని..
నాకు కావాల్సింది డిమాండ్ చేసి.. చివరికి మళ్లీ వారి ఇగోను ఎందుకు హర్ట్ చేయడం అని తీసుకోకుండా ఊరుకునేదాన్ని. కొన్నిసార్లు చివరి నిమిషంలో సింగర్లను మార్చేస్తారు. కానీ ఆ విషయం కనీసం కాల్ చేసి చెప్తే బాగుంటుంది. కొన్ని పాటలైతే ముందుగానే రికార్డు చేసి పెడతారు. అవసరాన్ని బట్టి ఆయా సినిమాల్లో వాడుకుంటారు అని చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment