Sunil Lalvani
-
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీ
-
కత్తితో దాడి..రూ.17 లక్షలు దోపిడీ
రాజ్ కోట్(గుజరాత్): పట్టపగలే ఓ ఉద్యోగిని కత్తితో భయపెట్టి దోపిడిచేశారు. ఈ ఘటన గుజరాత్ లోని రాజ్‌కోట్ లో పట్టపగలే జరగడం గమనార్హం. గుర్తుతెలియని ముగ్గురు దుండగులు అతడి వద్ద ఉన్న రూ.17 లక్షల నగదు బ్యాగును అపహరించారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. సునీల్ లాల్ వాని అనే అతను సహోద్యోగితో కలిసి రూ.37 లక్షలు ఓ బ్యాంకు నుంచి డ్రా చేశారు. ఈ తర్వాత రూ.17 లక్షలు సునీల్ తీసుకుని తన బైక్ పై వెళ్తున్నాడు. మార్గంమధ్యలోనే ముగ్గురు దుండగులు సునీల్ బైక్ ను అడ్డగించి, అతనిపై కత్తితో దాడికి పాల్పడ్డారు. సునీల్ వద్ద ఉన్న నగదు బ్యాగును ఇవ్వాలని బెదిరించారు. చివరకు నగదు బ్యాగు దోపిడీ చేసి అక్కడి నుంచి వారు పరారయ్యారని పోలీసులు తెలిపారు. దుండగుల జరిపిన కత్తిదాడిలో సునీల్ ఎడమ చేతికి గాయాలయ్యాయి. అయితే, జరిగిన విషయాన్ని అదే ప్రాంతంలో ఓ ఇంటికి అమర్చిన సీసీటీవీ కెమెరాలో రికార్డయిందని వారు వివరించారు. సునీల్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు వీడియో ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
బ్లాక్‌బెర్రీ జడ్10 రేటు మళ్లీ తగ్గింది
తాజా ధర రూ.17,990 60 రోజులే ఆఫర్ న్యూఢిల్లీ: బ్లాక్‌బెర్రీ కంపెనీ జడ్10 స్మార్ట్‌ఫోన్ ధరను రెండోసారి తగ్గించింది. అమ్మకాలు బాగా పడిపోవడమే దీనికి కారణమని పరిశ్రమ వర్గాలంటుండగా, భారత మార్కెట్లోకి ప్రవేశించి పదేళ్లైన సందర్భంగా ధరను తగ్గిస్తున్నామని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వాణి తెలిపారు. బీబీ10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ఫోన్ తాజా ధర రూ.17.990 అని పేర్కొన్నారు. అయితే ఈ తగ్గింపు ధర మంగళవారం నుంచే అమల్లోకి వస్తుందని, మరో 60 రోజుల పాటు ఈ ధరకే విక్రయిస్తామని వివరించారు. గత ఏడాది ఫిబ్రవరిలో మార్కెట్లోకి తెచ్చినప్పుడు ఈ ఫోన్ ధరను రూ.43,490గా కంపెనీ నిర్ణయించింది. ఆ తర్వాత గతేడాది సెప్టెంబర్‌లో రూ.29,990కు, తాజాగా రూ.17.990కు తగ్గించింది. ప్రారంభ ధరకు, ప్రస్తుత ధరకు తేడా రూ.25,500 ఉంది. అంటే ధరను సగానికి పైగా తగ్గించింది. గతేడాది జనవరిలో బ్లాక్‌బెర్రీ కంపెనీ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ బీబీ10ను ప్రారంభించింది. ఈ ఓఎస్ ఆధారంగా కంపెనీ తెచ్చిన హ్యాండ్సెట్లకు స్పందన ఆశించినంతగా లేదు. 2012, సెప్టెంబర్-నవంబర్ క్వార్టర్లో 37 లక్షలుగా ఉన్న బ్లాక్‌బెర్రీ స్మార్ట్ఫోన్ల విక్రయాలు గతేడాది ఇదే క్వార్టర్లో 19 లక్షలకు పడిపోయాయి. -
రూ.13,500 తగ్గిన బ్లాక్‌బెర్రీ ‘జడ్10’ ధర
ముంబై: బ్లాక్‌బెర్రీ కంపెనీ జడ్10 మొబైల్ ధరను 31 శాతం తగ్గించింది. పండుగల సీజన్ సందర్భంగా రూ. 43,490గా ఉన్న జడ్10 మొబైల్ ధరను 31 శాతం(రూ.13,500) తగ్గించి రూ.29,990కే అందిస్తున్నామని కంపెనీ బుధవారం తెలిపింది. ఈ ఆఫర్ పరిమిత కాలం వరకే ఉంటుందని వివరించింది. ఈ పండుగ సీజన్లో ఇలాంటి మరిన్ని ఆకర్షణీయ ఆఫర్లను అందిస్తామని బ్లాక్‌బెర్రీ ఇండియా ఎండీ సునీల్ లాల్వానీ చెప్పారు. బీబీ10 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే జడ్10, క్యూ5 మొబైళ్లను బ్లాక్‌బెర్రీ కంపెనీ ఈ ఏడాది జనవరిలో మార్కెట్లోకి తెచ్చింది. కానీ ఆశించినంత స్పందన ఈ ఫోన్లకు రాలేదు. ధరలు తగ్గించడం బ్లాక్‌బెర్రీకి కొత్తేమీ కాదు. గతంలో కూడా బ్లాక్‌బెర్రీ ధరలు తగ్గించింది. కొన్ని హ్యాండ్సెట్ల ధరలను గత ఏడాది మార్చిలో ఈ కంపెనీ 26 శాతం వరకూ తగ్గించింది. రూ. 37,990 ధర ఉన్న ప్లేబుక్ ధరను మొదట రూ.24,490కు, ఆ తర్వాత రూ.19,990కు తగ్గించింది.