పాకిస్తాన్ ఆగడాలు ఆగవా?
ఒక ప్రక్క కరచాలనం, మరొక పక్క కాల్పులు, సార్క్ సదస్సులో కరచాలనం చేసిన గంటల వ్యవధిలోనే బంకర్లలో చొరబడి, కాల్పులు జరపడం ఎంత వరకు సమంజసం? భారత సైనికుల తలలు నరికినప్పుడే గట్టిగా స్పందించి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదికాదు. మనం ఎంత స్నేహభావం కోరుకుం టున్నా, మళ్లీ అదేపనిగా కాల్పులు జరపడం సరి హద్దులో చొరబాట్లు, హింసాయుత కవ్వింపు చర్య లు మామూలు అయిపోయాయి.
మన శాంతి సందేశాలు చేతకానితనంగా భావిస్తున్న పాకిస్తాన్కు తగిన రీతిలో జవాబిస్తేనే కానీ, వ్యవహారం చక్క బడదు.’ కుక్కతోక వంకర’ అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరించడం పట్ల దేశ ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రక్క చర్చలు జరుపుతూ మరోప్రక్క కయ్యానికి కాలుదువ్వుతున్న పాకిస్తాన్ ఆగడాలపై వెంటనే భారత సర్కారు సరైన రీతిలో జవాబు ఇవ్వకపోతే ఇంక ఎప్పటికీ ఈ సమస్య నివురుగప్పిన నిప్పు మాదిరిగానే రగులుతూ ఉంటుందన్నది అక్షర సత్యం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుని చొరబాట్లు నిరోధించే దిశగా వెంటనే చర్యలు చేపట్టాలి.
శొంటి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్