టెలికంకు సూపర్ బాస్!
న్యూఢిల్లీ: టెలికం, సమాచార ప్రసారాల రంగానికి ఓ సూపర్ రెగ్యులేటర్ (నియంత్రణ సంస్థ)ను ఏర్పాటు చేసే ఆలోచనలో టెలికం శాఖ ఉంది. కమ్యూనికేషన్లు, ఐటీ, మల్టీమీడియా.. ఇలాంటి రంగాలన్నింటికీ ఒకే నియంత్రణ సంస్థ ఉండాలని భావిస్తోంది. ఇందుకోసం కమ్యూనికేషన్ల ఏకీకరణ బిల్లును పునరుద్ధరించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి ఈ బిల్లుకు గత ఎన్డీఏ హయాంలోనే రూపకల్పన జరిగింది. నియంత్రణ అధికారాలు, లెసైన్స్ల జారీ, అప్పిలేట్ ట్రిబ్యునల్ అన్నీ కలపి సూపర్ రెగ్యులేటర్ ఉండాలని ఈ బిల్లు పేర్కొంటోంది.