super sports
-
సూపర్ స్పోర్ట్స్ కార్లకు డిమాండ్
ముంబై: సూపర్ స్పోర్ట్స్ కార్ల విభాగం భారత్‌లో ఈ ఏడాది 30 శాతం వృద్ధిని నమోదు చేస్తుందని బ్రిటిష్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెక్లారెన్ ఆటోమోటివ్ శుక్రవారం తెలిపింది. సరఫరా సమస్యల కారణంగా గత సంవత్సరం నష్టపోయిన తర్వాత మెక్లారెన్ ఇక్కడి వినియోగదారులకు ఈ ఏడాది దాదాపు 20కిపైగా కార్లను డెలివరీ చేయాలని భావిస్తోంది. 2022 నవంబర్‌లో భారత మార్కెట్లోకి కంపెనీ ప్రవేశించింది. ‘రూ.4–5 కోట్ల కంటే ఎక్కువ ధర ఉన్న ఈ కార్ల సెగ్మెంట్ గతేడాది కూడా ఆరోగ్యకర వృద్ధిని సాధించింది. కోవిడ్ తర్వాత పరిమాణం పరంగా 2021 ఒక రకమైన ప్రారంభ సంవత్సరం. 2022 బాగుంది. గతేడాది మెరుగ్గా ఉంది. 2024 ఇంకా మెరుగ్గా ఉంటుంది. గత సంవత్సరం అమ్మకాలలో స్వల్ప తగ్గుదల ఉంది. ఒక మోడల్ నుండి మరొక మోడల్‌కు మారడం వల్ల ఉత్పత్తిలో కొన్ని నెలల గ్యాప్ ఉంది. ఫలితంగా 2024లో మేము దాదాపు 20 యూనిట్లను డెలివరీ చేయాలని భావిస్తున్నాం’ అని ఇని్ఫనిటీ కార్స్ సీఎండీ లలిత్ చౌదరి తెలిపారు. భారత్‌లో మెక్లారెన్ ఆటోమోటివ్ అధికారిక డీలర్‌గా ఇని్ఫనిటీ కార్స్ వ్యవహరిస్తోంది. ప్రస్తుతం భారత రోడ్లపై దాదాపు 30 మెక్లారెన్ కార్లు పరుగెడుతున్నాయి. జీటీ, ఆర్చురా హైబ్రిడ్ మోడల్‌ను కంపెనీ ఇప్పటికే భారత్‌లో అందుబాటులోకి తెచి్చంది. కాగా, మెక్లారెన్ తన సూపర్ స్పోర్ట్స్ కారు 750ఎస్ మోడల్‌ను రూ.5.91 కోట్ల ధరతో ఆవిష్కరించింది. యూకేలోని యార్క్‌షైర్‌లో ఉన్న మెక్లారెన్ కాంపోజిట్స్ టెక్నాలజీ సెంటర్లో ఈ కారు తయారైంది. పూర్తిగా తయారైన కార్లనే భారత్‌కు దిగుమతి చేస్తున్నారు. కంపెనీ నుండి అత్యంత తేలికైన, శక్తివంతమైన మోడల్ ఇదే. 7.2 సెకన్లలో గంటకు 0–200 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. -
కోహ్లికి కోపమొచ్చింది!
సెంచూరియన్: తరచూ వివాదాలతో సహవాసం చేసే విరాట్ మరోసారి తన ఆగ్రహాన్ని వెళ్లగక్కాడు. వివరాల్లోకెళితే...అద్భుతమైన ఫామ్‌తో, రికార్డులతో దక్షిణాఫ్రికాలో అడుగు పెట్టిన కోహ్లి తొలి రెండు వన్డేల్లోనూ విఫలమయ్యాడు. కీపర్, స్లిప్స్‌లో క్యాచ్‌లు ఇచ్చి సునాయాస పద్ధతిలో నిష్ర్కమించాడు. వాండరర్స్‌లో జరిగిన తొలి వన్డేలో భీకరమైన స్టెయిన్ బౌలింగ్‌ను ఎదుర్కొనే క్రమంలో ఒక బంతి వేగంగా దూసుకొచ్చింది. పుల్ షాట్ ఆడే క్రమంలో అది పక్కటెముకలకు బలంగా తాకడంతో విరాట్ విలవిల్లాడిపోయాడు. అయితే అసలు కథ ఇక్కడే మొదలైంది. బుధవారం మూడో వన్డే సందర్భంగా మ్యాచ్ ప్రసారకర్త ‘సూపర్ స్పోర్ట్స్’ ఈ విజువల్స్‌ను పదేపదే ప్రసారం చేసింది. ‘కోహ్లి మెత్తబడ్డాడా...’అంటూ వ్యాఖ్యను కూడా జోడించింది. అంతటితో ఆగిపోకుండా సదరు మ్యాచ్‌లో అవుటైన తర్వాత కోహ్లి డ్రెస్సింగ్ రూమ్‌లో ఐస్ ప్యాక్‌తో చికిత్స చేయించుకోవడం, పుల్ షాట్‌ను ప్రాక్టీస్ చేయడం స్లో మోషన్లో మళ్లీ మళ్లీ చూపించింది. ఇది కోహ్లికి తీవ్ర ఆగ్రహం తెప్పించడంతో జట్టు సభ్యులతో చర్చించాడు. దాంతో కోచ్ డంకన్ ఫ్లెచర్ నేతృత్వంలో టీమ్ మేనేజ్మెంట్... ప్రసారకర్త సూపర్ స్పోర్ట్స్ డెరైక్టర్‌ను నేరుగా డ్రెస్సింగ్ రూమ్‌కే పిలిపించి వివరణ కోరింది. దానిని అనుచిత చర్యగా పేర్కొంటూ ఇకపై ‘క్రికెట్‌కే కట్టుబడాలని’ సలహా ఇచ్చింది. అందులో తప్పేమీ లేదంటూ చెప్పబోయిన అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకు కాదు! సూపర్ స్పోర్ట్ డెరైక్టర్‌ను భారత టీమ్ మేనేజ్మెంట్ హెచ్చరించినట్లు వచ్చిన వార్తలను జట్టు ఖండించింది. ‘సూపర్ స్పోర్ట్ ప్రతినిధిని కలిసిన మాట వాస్తవమే. అయితే అది కోహ్లి క్లిప్ గురించి కాదు. మరో విషయం చర్చించడానికే. అది ఏమిటనేది మాత్రం చెప్పలేను’ అని జట్టు మీడియా మేనేజర్ ఆర్ఎన్ బాబా వివరణ ఇచ్చారు.