ఇంద్రకీలాద్రిపై కలెక్టరు
ఇంద్రకీలాద్రి : దసరా ఉత్సవాలలో అత్యంత ముఖ్యమైన మూలా నక్షత్రం రోజున భక్తులకు అమ్మవారి దర్శనంలో ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేలా చేస్తున్న ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బాబు.ఏ శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. ఆలయ ప్రాంగణంలో క్యూలైన్లు, గంటలో ఎంత మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారనే వివరాలను ఆలయ ఈవో సూర్యకుమారిని అడిగి తెలుసుకున్న కలెక్టర్ బాబు.ఏ మహా మండపంలోని కుంకుమార్చన జరిగే ప్రాంగణాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట దేవస్థాన ఇంజనీరింగ్ అధికారులతో పాటు వివిధ శాఖల ముఖ్య అధికారులు ఉన్నారు.